తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : తిరుచానూరు మండలం యోగిమల్లవరం గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో సోమవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. యోగిమల్లవరం గ్రామానికి చెందిన బాలాజీ(13) అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ ఇంటర్వెల్ సమయంలో గ్రామానికి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ జారిపడి మునిగిపోయాడు. బాలుడి కోసం అధికారులు, గ్రామస్తులు తీవ్రంగా గాలిస్తున్నారు.