అక్టోబర్ 5 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అక్టోబర్ 5 నుంచి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అఖిలాండ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. 8 రోజుల పాటు స్వామివారికి వివిధ సేవలు చేస్తారు. 5వ తేదీన ధ్వజారోహణతో
ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 9న గరుడసేవ, 10న స్వామివారిని స్వర్ణ రథంపై ఊరేగిస్తారు. 13న చక్రస్నానంతో ముగుస్తాయి.
ఈ నెల 8 నుంచి 17 వరకు తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో వరసిద్ధి వినాయక ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 17 నుంచి19 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.