బ్రెయిలీ లిపిలో రామాయణం
తిరుమల: బ్రెయిలీ లిపిలో రూపొందించిన రామాయణం గ్రంథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు గురువారం ఆవిష్కరించారు. చూపులేని భక్తులకు ఆధ్యాత్మిక, సాహిత్యజ్ఞానాన్ని కల్పించేందుకు టీటీడీ బ్రెయిలీ లిపిలో ఉషశ్రీ రామాయణాన్ని రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన దేవనార్ ఫౌండేషన్ సహకారంతో దీన్ని ప్రచురించారు. ఈ మేరకు శ్రీవారి వసంతోత్సవాల సందర్భంగా వసంత మండపం ముందు ఈ గ్రంథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవనార్ ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబుగౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారికి రూ. 50 లక్షల విరాళం
తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ. 50 లక్షలు విరాళంగా అందింది. ముంబైకి చెందిన ఏబీఏ. దుభాష్ తన జీ అండ్ బుమాంజీ చారిటీ ట్రస్టు పేరుతో రూ. 50 ల క్షలు విరాళంగా ఇచ్చారు.