నర్సింగ్ కళాశాలకు బ్రేక్! | break to nursing college | Sakshi
Sakshi News home page

నర్సింగ్ కళాశాలకు బ్రేక్!

Published Tue, Nov 5 2013 6:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

break to nursing college

 జగిత్యాల, న్యూస్‌లైన్ :
 జగిత్యాల నర్సింగ్ కళాశాలకు ఆర్థికశాఖ మోకాలడ్డుతోంది. కళాశాలకు అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేయాలని ఆర్థికశాఖకు పంపించిన ఫైల్‌ను డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ పెండింగ్‌లో పెట్టింది. మెడికల్ కళాశాల లేని ప్రాంతాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు మంజూరు ఇస్తే ఇబ్బందులొస్తాయని భావించి ఈ నిర్ణయం  ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆగస్టులో ఏర్పాట్లను పరిశీలించి నర్సింగ్ కశాశాలకు పచ్చజెండా ఊపింది. ఏపీ నర్సింగ్ డిపార్ట్‌మెంట్ ఆగస్టు చివరివారంలో ఇక్కడకొచ్చి అనుమతి ఇచ్చింది. విద్యావతిగౌడ్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించింది. మరికొంత మంది బోధన సిబ్బందిని కూడా నియమించింది.
 
  కళాశాలకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధరూర్ క్యాంపులో కేటాయించారు. ఈ విద్యాసంవత్సరం తాత్కాలికంగా జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ యూనివర్సిటీ గతనెల 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల ఐదో తేదీ నాటికి దరఖాస్తుల గడువు ముగియనుంది. అనంతరం జరిగే కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేస్తారు. జగిత్యాల బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో నలభై సీట్లున్నాయి.
 
 నిధుల అనుమతికి నిరాకరణ?
 కళాశాల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని ఏరియా ఆస్పత్రి సమకూర్చింది. భవన నిర్మాణం, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు, కళాశాల నిర్వహణకు రూ.50 లక్షలు కేటాయించాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మూడు నెలల క్రితం డీఎంఈకి నివేదించారు. వీటిని పరిశీలించి నిధులు విడుదల చేయాల్సిన ఫైనాన్స్ సెకట్రరీలు పీవీ.రమేష్, ఎల్.సుబ్రహ్మణ్యం ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారు. మెడికల్ కళాశాలగానీ.. డెంటల్ కళాశాల గానీ లేని జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
 అంతటా ఇదే పరిస్థితి:  విద్యావతి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
 స్థానిక నర్సింగ్ కళాశాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుందనుకుంటున్నాం. ఆదిలాబాద్, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రాంతాల్లోని కళాశాలకు కూడా ఫైనాన్స్ అనుమతులు లభించాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఐఏఎస్‌లను కలిసి ఇక్కడ పరిస్థితిని వివరిస్తే అనుమతి తొందరగా వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యేకు విన్నవించాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement