ఇందూరు, న్యూస్‌లైన్: కలెక్టర్ : గత సమీక్షలో నిర్ణయించిన గడువు తేదీ ప్రకారం మీ మండలంలో బీఆర్‌జీఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, భవన నిర్మాణాల పనులు పూర్తయ్యాయా..?
ఎంపీడీఓలు : పూర్తి అయ్యాయి సార్..
కలెక్టర్ : అయితే పూర్తి చేసినట్లుగా ఆ భవనం ఫొటో తీసుకురావాలని చెప్పాను.. ఉందా..? చూపించండి.
ఎంపీడీఓలు : ఉంది సార్...! చూడండి
జిల్లాలో బీఆర్‌జీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు నిజంగా పూర్తి చేశారో లేదో తెలుసుకోవడానికి ప్రతి మండలాధికారిని, పంచాయతీరాజ్ ఇంజినీర్‌ను ఒక్కొక్కరినీ నిల్చోబెట్టి కలెక్టర్ పైవిధంగా అడిగారు. సోమవారం జిల్లా పరిషత్‌లో కలెక్టర్ ప్రదుమ్న ‘బీఆర్‌జీఎఫ్’ ప నులపై సమీక్ష నిర్వహించారు. పూర్తయిన ప్రతీ పనికి సంబంధించిన ఫొటోను తనకు చూపించే వరకు ఓపిగ్గా నాలుగు గంటల సేపు సుదీర్ఘంగా సమీక్షించారు. దీంతో పనులు పూర్తి చేయని పలువురి మండలాధికారులు డొల్లతనం బయటపడింది. కలెక్టర్ నుంచి తప్పించుకోవడం కుదరదని అధికారులు కంగుతిన్నారు. కలెక్టర్ అడిగిన పూర్తయిన పనుల ఫొటోలను చూపిం చారు. అయితే కొందరు అధికారులు ఫొటోలు చూపించగా పూర్తయిన భవన నిర్మాణ పనులు అసంతృప్తిగా ఉన్నాయని వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు మరికొందరు అధికారులు ఫొటోలు తీసుకురాక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా పనులు పూర్తి చేశారో లేదో తెలుసుకోవడానికి కలెక్టర్ వేసిన ప్లాన్ అధికారులు చెప్పుడు మాటలకు, జరిగే పనులకు పొంతన లేదనే విషయాన్ని బయటపెట్టిం ది. కొన్ని పనులు పూర్తి అయినట్లు ఫొటోలు ఉండటంతో ఒక విధంగా సంతృప్తి వ్యక్తం చేశారు. మండలం వారీగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. కొందరు అధికారులకు పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.
నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలి...
జిల్లాలో బీఆర్‌జీఎఫ్ నిధులతో ప్రారంభించిన పనులను జనవరి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ మండలాధికారులను, ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5022 వివిధ పనులు మంజూరు కాగా 2069 పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పనులు కొన్ని ప్రారంభించగా, మరికొన్ని ప్రారంభించలేదన్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలని సూ చించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో దాదాపుగా 85 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యాలు లేవని, వందకు పైగా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు లేవన్నారు. 1500 పాఠశాలల్లో కట్టిన టాయిలెట్లు వాటర్ సౌకర్యం లేక వినియోగంలో లేవని తెలిపారు. ఎంపీ,ఎస్‌ఎఫ్‌సీ,టీఎఫ్‌సీ,జీపీ కాంపోనెంట్ నిధులతో ఈ సౌకర్యాలు తీర్చాలన్నారు.
ఇందుకు మరోసారి మండలాధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఈ నెల 10లోగా ప్రపోజల్స్ పం పించాలని ఆదేశించారు. ముందుగా వీటికే ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామాల్లో రోడ్లు,డ్రైన్లు ఇతర పనులకు తరువాత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సౌకర్యాల కల్పన విషయం లో అధికారులు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బం దులు ఎదుర్కొంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ సభలను పకడ్బందీగా, ఉన్న నిధులతోనే నిర్వహించాలన్నారు. ఈ విష యం కార్యదర్శులకు, సర్పంచులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం నిర్మల్ భారత్ అభియాన్ పథకం, పెన్షన్ తదితర పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబాబు, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మాటలు కాదు.. సాక్ష్యాలు కావాలి
Published Tue, Jan 7 2014 4:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement