BRGF
-
లెక్కలు.. తప్పాయ్!
- బీఆర్జీఎఫ్ నిధుల్లో వెలుగుచూసిన అవకతవకలు - పభుత్వ ఖాతాలో జమకాని రూ.27.88 లక్షలు - అదనపు చెల్లింపులు రూ.3.83 లక్షలు - గ్రామాలు, మండల పరిషత్‌లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం - 147 పంచాయతీల్లో రికార్డులే లేవు - 3,314 పనులపై ముగిసిన ఆడిట్ - 2013-14 ఆడిట్ రిపోర్ట్‌లో గుర్తించిన లోపాలు నల్లగొండ : 2013-14 ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి) కింద రూ.32.02 కోట్లు ఖర్చు చేశారు. ఆయా నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్ నిర్వహించగా రూ.31.71 లక్షల నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. దీంట్లో మండల పరి షత్, గ్రామపంచాయతీ స్థాయిలో ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. రూ.3.83 లక్షలు అడ్వాన్స్ చెల్లింపులు చేయగా.. ఆ నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు చూపలేదు. బీఆర్జీఎఫ్ పనులు చేపట్టిన వారినుంచి వివిధ రకాల పన్నుల రూపంలో మినహాయించిన రూ.27.88 లక్షలు ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. మరో 147 పంచాయతీల్లో క్యాష్‌బుక్‌లు, ఎంబీ రికార్డులు లేవు. దీంతో ఆ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించలేదు. రికార్డులు లేని పంచాయతీలకు నోటీసులు జారీ చేయాలని ఆడిట్ శాఖనుంచి జిల్లా పరిషత్ కు లేఖ అందినట్లు తెలిసింది. పంచాయతీలు, మండల పరిషత్‌ల బాటలోనే మున్సిపాల్టీల్లో కూడా అవకతవకలు బయటపడ్డాయి. మిర్యాలగూడ మున్సిపాల్టీలో చేపట్టిన అభివృద్ధి పనులనుంచి రూ.1.65 లక్షల పన్నులు మినహాయించారు కానీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. అనేక అంశాలపై అభ్యంతరాలు.. అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్లు, గ్రామీణ, మండల, అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్జీఎఫ్ నిధులు ఖర్చు చేస్తారు. దీనిలో భాగంగా జిల్లాకు ప్రతి ఏడాది సుమారు రూ.33 కోట్ల వరకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో జిల్లా పరిషత్, మున్సిపాల్టీలకు 20 శాతం, మండల పరిషత్ 30 శాతం, పంచా యతీలకు 50 శాతం నిధులు కేటాయిస్తారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 32.02 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం 3,314 పనులకు సంబంధించిన ఆడిట్ గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. ఈ ఆడిట్ రిపోర్ట్ ఇటీవలే జిల్లా పరిషత్‌కు సమర్పించారు. దీంట్లో నిధులు వినియోగంలో జరిగిన లోతుపాట్లు, రికార్డుల నిర్వహణతో పాటు పలు అంశాలపై ఆడిట్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెలుగుచూసిన లొసుగులు కొన్ని.. - బీఆర్జీఎఫ్ పనులు చేపట్టిన వారి నుంచి మినహాయించిన వాట్, ఆదాయ పన్ను, సీన రేజ్, సంబంధిత శాఖలకు జమ చేయడం లేదు. - మినహాయించిన పన్నుల సొమ్మును మండల పరిషత్, పంచాయతీలు, మున్సిపాల్టీలు తమ వద్దనే ఉంచుకుంటున్నాయి. - నిబంధనల ప్రకారం ప్రతి మూడు మాసాలోకోసారి ఈ పన్నులు జమ చేయాలి. కానీ అలా చేయకుండా ఆ నిధులను మరొక అవసరాలకు వినియోగిస్తున్నారు. - బీఆర్జీఎఫ్ నిధులు ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తుండటంతో మినహాయించిన పన్నులు కూడా అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. - పనులు పరీక్షించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేయడం లేదు..రికార్డుల్లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ సమర్పించడం లేదు. - పూర్తయిన పనుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. - నిధుల వినియోగం వివరాలకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) జిల్లా పరిషత్‌కు సమర్పించడం లేదు. - పంచాయతీ స్థాయిలో క్యాష్‌బుక్‌లు, ఓచర్లు, ఎంబీ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు. - బీఆర్జీఎఫ్ పనులు జరిగిన ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. -
నిధులు అటేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు (బీఆర్జీఎఫ్) ఇప్పట్లో మోక్షం లేనట్లే. వచ్చే మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సిన ఈ నిధులు ఇప్పటికీ విడుదల కాలే దు. వాస్తవంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రతి పాదనలు పంపితే, జూన్‌లో ఈ నిధులు వస్తాయి. ప్రతిపాదనలకు ముందుగా జిల్లా పరిషత్ సర్వస భ్య సమావేశం, తరువాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. 2014-15 బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాల్లో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా, జిల్లాలో మాత్రం బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జడ్పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్ 22న అత్యవసర సమావేశంలో రూ.25.34 కోట్ల బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినా, మూడు నెలలైనా నిధుల ఊసు లేదు. జూన్‌లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే వెనుకబడిన ఫ్రాంతాల అభివృద్ధి నిధుల కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేకాధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలు, 36 మండలాలు అప్పట్లోనే రూ.25.34 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. జడ్పీ సర్వసభ్య సమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత వరుస గా ఎన్నికలు జరిగాయి.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు చేసిన ప్రతిపాదనలలో తేడా వచ్చింది. కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం కోసం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు రూ.4 కోట్లు, 36 మండలాలకు రూ.21.34 కోట్ల పనులను రూపొందించారు. గ్రామపంచాయతీలు 50 శాతం, మండల పరిషత్‌లు 30 శాతం, జిల్లా పరిషత్ నుంచి 20 శాతం పనులను ప్రతిపాదించారు. కానీ, వీటిని సెప్టెంబర్ మొదటి వారంలోగా ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జాప్యం జరిగింది. ఫలితంగా పొరుగు జిల్లా ఆదిలాబాద్‌కు రూ.25 కోట్లు విడుదల చేసిన కేంద్రం, జిల్లా ప్రతిపాదనలను మాత్రం ఇంకా కనికరించలేదు. -
ఎట్టకేలకు
ఎట్టకేలకు జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటైంది. ఏడాది కాలంగా డీపీసీ లేకపోవడంతో సుమారు రూ.25 కోట్ల బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలలో జాప్యం జరిగింది. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కమిటీ ఏర్పాటుతో నిధులు రాబట్టేందుకు చర్యలు వేగవంతమవుతాయని, ఫలితంగా జిల్లా అభివృద్ధికి వీలు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సుమారు ఏడాది కాలం తర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఏర్పాటైంది. వరుసగా వచ్చిన ఎన్నికలలో (సర్పంచ్ మొదలు సార్వత్రిక) భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా డీపీసీ ఖరారు కాలేదు. డీపీసీ ఏర్పాటు కానందున ఏడాది క్రితం రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహిం చారు. జిల్లా పరిషత్ ద్వారా ఏటా సుమారు రూ. 25.63 కోట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్) ప్రతిపాదనలలో సైతం జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ బీఆర్జీఎఫ్ నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివద్ధికి నిధుల ప్రతిపాదన, ఆమోదం తదితర అంశాలలో కీలకంగా ఉండే డీపీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వ ం నవంబర్ 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ఎనిమిది నుంచి మొదలైన డీపీసీ సభ్యుల ఎన్నికల ప్ర క్రియ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీకి జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సభ్య కార్యదర్శిగా ఉం టారు. ప్రభుత్వం నియమించే నలుగురు సభ్యులు ఎవరనేది తేలాల్సి ఉం ది. కాగా బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. డీపీసీ స్వరూపం ఇలా డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. జడ్పీ చైర్మన్ సారథ్యం వహిస్తారు. కలెక్టర్ కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. ఇటీవల ఎన్నికైన 24 మంది సభ్యులకు తోడు మరో నలుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. మొత్తం 24 స్థానాలలో 21 స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ప్రభుత్వం నామినేట్ చే సే నలుగురిలో ముగ్గురు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగినవారు, ఒకరు మైనార్టీకి చెందినవారుంటారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాల్సిన మూడు స్థానాలలో మాజీ సర్పంచులనుగానీ, మాజీ ఎంపీపీలనుగానీ, తదితర కేడర్‌కు చెందినవారినిగానీ నియమించే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో ఎంపికయ్యేందుకు పలువురు పైరవీలు షురూ చేశారు. రెండు మూడు రోజులలో సభ్యుల నియామకం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. డీపీసీ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. సభ్యులకు నియామక పత్రాలు ఇందూరు : నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ నియామకపత్రాలు అందజేశారు. మహ్మద్ షకీల్ అహ్మద్, విశాలినీరెడ్డి, లలిత, బోండ్ల సుజాత, గడ్డం సుమనారెడ్డి, నేనావత్ కిషన్, అయిత సుజ, విమల వెల్మల, సామెల్ చిన్నబాలి నియామకపత్రాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు కమిటీ స్వరూపం ఏమిటీ? కమిటీ ఏం చేస్తుంది? సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారికి గల అధికారాలపై వారం రో జులలో శిక్షణా తరగతులు నిర్వహించాలని జడ్పీ సీఈఓ రాజారాంను ఆదేశించారు. దీంతో సభ్యులకు డీపీసీపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని పేర్కొ న్నా రు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
తాగునీటికి రూ.174 కోట్లు
* ఆర్థిక సంఘం నిధులు కేటాయింపు * ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు * 25వ తేదీ గడువు కరీంనగర్ సిటీ : జిల్లాలో 13వ ఆర్థిక సంఘం కింద చేపట్టనున్న పనుల్లో తాగునీటి పథకాలకు పెద్దపీట వేశారు. నాలుగైదు గ్రామాలను కలుపుతూ నిర్మించే సీపీడబ్యూఎస్, గ్రామాల వారీగా నిర్మించే రక్షిత మంచినీటి పథకాలకు కచ్చితమైన కేటాయింపులు ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించింది. ఈ మేరకు 2014-15కు గాను జిల్లాకు రూ.174 కోట్ల 69 లక్షల 72 వేలను ఆర్థిక సంఘం నుంచి కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాకు కేటాయించిన నిధుల్లో జిల్లా పరిషత్ వాటా రూ.34.94 కోట్లు, మండల పరిషత్ వాటా రూ.17 కోట్ల 47 లక్షల 71 వేలు, గ్రామపంచాయతీల వాటా రూ.122.28 కోట్లుగా నిర్ణయించారు. ఆయా విభాగాలకు కేటాయించిన నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. విధివిధానాలివి.. * అధిక భాగం నిధులు వెచ్చించే గ్రామపంచాయతీల్లో సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాలు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగన్వాడీల్లో పారిశుధ్యం నిర్వహణకు వెచ్చించాల్సి ఉంటుంది. * మండల పరిషత్ వాటాలో బోర్‌వెల్స్, మండల పరిషత్ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ నిర్వహణ, పాఠశాలలు, పీహెచ్సీ, సబ్‌సెంటర్లు, పశువుల ఆసుపత్రి, గోపాలమిత్ర, వ్యవసాయ అనుబంధ భవనాల నిర్మాణాల్లో ఉన్న గ్యాప్‌లను పూర్తిచేయాలి. * జిల్లా పరిషత్‌లో సీపీడబ్ల్యూఎస్, జెడ్పీ భవనాల నిర్వహణ, గ్రామీణ రోడ్ల నిర్వహణ, వ్యవసాయ, ఆహార పరిశ్రమల ఉన్నతికి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలిసారి భారీ కేటాయింపు ఏటా విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది భారీగా వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఏటా రెండు విడతల్లో కలిపి రూ.8కోట్లు కేటాయింపులు జరిగేవి. ఈసారి మాత్రం ఏకంగా రూ.174 కోట్లు రానుండడం విశేషం. మూడేళ్లుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో ఈ నిధులు జిల్లాకు చేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, 2001 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 ప్రకారం నిధులు కేటాయించడంతో ఇంతపెద్దమొత్తం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 25లోగా ప్రతిపాదనలు 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు రూపొందించే పనిలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు. రూ.174 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 25లోగా అందించి ప్రభుత్వానికి చేరవేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీల ప్రతిపాదనలు గ్రామసభలో, మండల పరిషత్ ప్రతిపాదనలు సమావేశంలో ఆమోదించి జెడ్పీకి, చివరగా మొత్తం నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తారు. ఒక్కో జెడ్పీటీసీకి రూ.40 లక్షలు? 13వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధులకు సమానంగా వాటాలు పంచినట్లు సమాచారం. జెడ్పీకి రూ.34.94 కోట్లు కేటాయించగా.. ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి సుమారు రూ.30 నుంచి రూ.40 లక్షల పనులు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల బీఆర్‌జీఎఫ్‌లో తక్కువ స్థాయిలో నిధులు రావడంతో కినుక వహించిన జెడ్పీటీసీలు 13వ ఆర్థిక సంఘం నిధులు భారీగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బీఆర్జీఎఫ్@ రూ.28.66 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్)కి జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఆమోదముద్ర వేసింది. 2014-15 వార్షిక సంవత్సరానికి వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి కింద రూ.28.66 కోట్లతో ప్రతిపాదించిన 1,592 పనులకు పచ్చజెండా ఊపింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన డీపీసీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఈ నిధుల్లో గ్రామీణ రోడ్ల నిర్మాణానికే పెద్దపీట వేశారు. రూ.11.89కోట్లతో 559 కొత్త రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదించగా, ఆ తర్వాత పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రూ.8.72కోట్లు, గ్రామీణ నీటి సరఫరాను ఆధునీకరించేందుకు రూ.5.70 కోట్లు నిర్దేశించారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆయా పురపాలక సంఘాల అధ్యక్షులు, డీపీసీ సభ్యులు ఈసీ శేఖర్‌గౌడ్, బొక్క జంగారెడ్డి హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. హాస్టళ్లను విస్మరించడం అన్యాయం : మంచిరెడ్డి బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపుల్లో సంక్షేమ హాస్టళ్లను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు రూ.కోటిన్నర కేటాయించిన జిల్లా యంత్రాంగం.. బీసీ హాస్టళ్లను విస్మరించడం దా రుణమన్నారు. పదేళ్ల నుంచి కనీసం రంగులు వేసేం దుకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించలేద ని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో కనీస సౌకర్యాలు కల్పిం చేందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. వైద్యో నారాయణ.. : తీగల జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా తయారైందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. పీహెచ్సీలో వైద్యులు ఉండడంలేదని, ఖాళీలను భర్తీ చేసే విషయంలో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మహేశ్వరంలో 100 పడకల ఆస్పత్రి మంజూరైనా పనులు ఇంకా మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతపనులను ప్రతిపాదించడం సరికాదు: మలిపెద్ది బీఆర్జీఎఫ్ కింద చేపట్టే పనుల్లో డుప్లికేషన్ జరుగకుండా చూడాలని మేడ్చల్ శాసనసభ్యుడు మలిపెద్ధి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత పనులనే మళ్లీ ప్రతిపాదించినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త వాహనాలివ్వండి: యాదయ్య ప్రభుత్వ అధికారులను వాహనాల కొరత పట్టిపీడిస్తోందని, కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. బీఆర్జీఎఫ్ కింద సాగునీటి పారుదలకు కూడా నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. తన నియోజకవర్గంలోని చాలా పీహెచ్సీలలో వైద్యుల్లేరని, ఖాళీలను భర్తీ చేసేందుకు చొరవ చూపాలని అన్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధన: చామకూర సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియంలో విద్యాబోధన వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే విద్యాబోధనను ఆంగ్లంలో చేయాలని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి సూచిం చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. పాత పనులకే దిక్కులేదు: సంజీవరావు గత ఏడాది బీఆర్జీఎఫ్ పనులే ఇంకా మొదలు కాలేదని వికారాబాద్ శాసనసభ్యుడు సంజీవరావు అన్నారు. నిధుల లేమితో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మర్పల్లిలో కస్తుర్బా స్కూల్ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్ ఉడాయించారని, ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్జీఎఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. బంట్వారం మండలంలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, 15 ఏకోపాధ్యాయ పాఠశాలలకు కూడా టీచర్లు రాకపోవడంతో మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందించండి: ప్రకాశ్‌గౌడ్ చెడిపోయిన బోర్లను బాగు చేయకుండా కొత్త వాటిని వేయాలడాన్ని రాజేంద్రనగ ర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తప్పుబట్టారు. చెడినవాటికి మరమ్మతులు చేస్తే నీటి సమస్యను అధిగమించవచ్చని అన్నారు. శంషాబాద్‌కు ఇప్పటివరకు తాగునీటి సరఫరా చేయడంలేదని, మణికొండలో వాటర్‌వర్క్స్, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయానని డీపీసీ దృష్టికి తెచ్చారు. నిధుల వాటా పెంచండి: వివేక్ కుత్బుల్లాపూర్‌లోని ప్రగతినగర్, బాచుపల్లి, దూలపల్లి, నిజాంపేట్ తదితర గ్రామాల్లో జనాభా భారీగా పెరిగిందని, వారి అవసరాలు తీర్చే విధంగా నిధులు కేటాయింపులు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేఎం వివేక్ స్పష్టం చేశారు. చాలా గ్రామాలకు రోడ్డు మార్గాలు వేసేందుకు కూడా నిధుల కొరత ఏర్పడిందని, ఈ అంశంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఫిరంగినాలాను శుద్ధి చేయండి: ఈసీ శేఖర్‌గౌడ్ చారిత్రిక ఫిరంగి నాలా కుచించుకుపోతుందని, దీనిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీసీ సభ్యుడు ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో ఈ నాలా మురికి కాల్వగా మారిందని, దీన్ని శుద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. సమృద్ధిగా నిధులు: మహేందర్‌రెడ్డి, మంత్రి బీఆర్జీఎఫ్ నిధులేకాకుండా వివిధ పద్దుల కింద ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది చేపట్టిన 839 పనుల్లో 644 పనులు అసంపూర్తిగా ఉన్నాయని, 23 పనులు ఇప్పటికీ ప్రారంభంకాలేదని, ఈసారి పనుల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని చెప్పారు. గ్రామీణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న అంశం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపా రు. సంక్షేమ హాస్టళ్లు, ఇరిగేషన్ శాఖకు బీఆర్జీఎఫ్ నిధు లు కేటాయించాలనే సభ్యుల అభిప్రాయం ఆహ్వానించదగ్గదని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ తర్వాత శాఖలవారీగా సమీక్షలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. అభివృద్ధికి సహకరించండి: సునీత రాజధానికి చేరువలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందని పల్లెలు ఉన్నాయని, వీటిన్నింటిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు బీఆర్జీఎఫ్ నిధులను వినియోగించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.28.66 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు సహకార ం తప్పనిసరని, టీచర్ల కొరతను అధిగమించేందుకు తమ వద్ద పీఏలుగా నియమించుకున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు. -
వెనుకబడిన నిధులు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్) ప్రతి పాదనలు అటకెక్కాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల కోసం జిల్లా అధికార యంత్రాంగం గత నెలలో ఎంతో ఆర్భాటంగా.. ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ.. ఆ ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా ప్లానింగ్ కమిటీ (డీపీసీ) ఆమోదం తీసుకున్నాకే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అయితే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఈ ప్లానింగ్ కమిటీ నియామకం ఊసే ఎత్తకపోవడంతో బీఆర్జీఎఫ్ నిధుల ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. రూ.33.11 కోట్లతో ప్రతిపాదనలు.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం స్థానిక సంస్థలకు ఏటా నిధులు విడుదల చేస్తుంది. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఈ నిధులు వస్తాయి. ఏటా సుమారు రూ.33 కోట్ల మేరకు ఈ నిధులు విడుదలవుతాయి. ఇందులో భాగంగా గత నెలలో ఆయా స్థానిక సంస్థలు ప్రతిపాదనలు తయారు చేశారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ, సబ్‌సెంటర్ భవనాలు, తాగునీటి పథకాలు వంటి పనులు ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీల కాంపోనెంట్ కింద రూ.13.49 కోట్లు, మండల పరిషత్ కాంపోనెంట్లో రూ.8.09 కో ట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5.38 కోట్లు, ఏడు మున్సిపాలిటీల్లో 5.52 కోట్ల అంచ నా వ్యయం కలిగిన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీల ఆమోదం తీసుకున్నారు. మండల పరిషత్, మున్సిపాలిటీల పనులకు సంబంధించి అప్పట్లో ప్రత్యేక అధికారుల ఆమోదంతో ప్రతిపాదనలు జిల్లా పరిషత్‌కు వచ్చాయి. అయితే.. ఈ ప్రతిపాదనలకు జిల్లా ప్లానింగ్ కమిటీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం ఈ ప్లానింగ్ కమిటీ ఊసే ఎత్తడం లేదు. కమిటీ నియామకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు గానీ, ఆదేశాలు కానీ విడుదల చేయకపోవడంతో కమిటీ నియామకం నిలిచిపోయింది. దీంతో ఈ బీఆర్జీఎఫ్ పనుల ప్రతిపాదనలు అటకెక్కినట్లయింది. గతేడాది జిల్లాకు మొండిచేయి.. గతేడాది సకాలంలో ప్రతిపాదనలు పంపకపోవడం, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జిల్లాకు ఒక్కపైసా కూడా రాలేదు. సకాలంలో స్పందించి ఉంటే రూ.36.65 కోట్లు వచ్చేవి. ఫలితంగా ప్రతిపాదించిన సుమారు 3,784 పనులకు మోక్షం కలగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడిచిపోయినా నిధులకు సంబంధించి ఇంకా ప్రతిపాదనలే వెళ్లకపోవడంతో నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ఆదేశాలు రాలేదు- అనితాగ్రేస్, జెడ్పీ సీఈవో జిల్లా ప్రణాళిక కమిటీ నియామకం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. రెండు మూడు రోజుల్లో ఈ ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నాము. జీవో వచ్చిన వెంటనే డీపీసీని నియమించి బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపుతాము. -
తెరచాటు ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్జీఎఫ్ (బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్) పనుల ప్రణాళికను ఈ నెల 26వ తేదీ లోగా తయారు చేసి పంపించాలని గత నెల 12న ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశా రు. జిల్లాకు కేటాయించిన రూ. 22.94 కోట్ల కు పనులకు ప్రతిపాదనలు తయారు చేసి, పక్కా ప్రణాళికను అందజేయాలని ఆదేశాలిచ్చారు. రోడ్లు, సామాజిక భవనాలు పాఠశాలలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలతో పాటు గత ఏడాది చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రత్యేక మార్గదర్శకాలిచ్చారు. ఆ మేరకు కాల పరిమితితో కూడిన షెడ్యూల్ ఇచ్చారు. కానీ, జిల్లా పరిషత్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఎలాగూ కొత్త పాలక వర్గం వస్తుందని, వారి ఆధ్వర్యంలో చేపట్టి మార్కులు కొట్టేయవచ్చన్న అభిప్రాయంతో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేశారని తెలిసింది. ఇదే విషయమై ఈనెల 7న ‘అధికారుల...వెనుకంజ’ శీర్షికతో ‘ సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గడువు దాటితే నిధులు వెనక్కి మళ్లిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని అప్పుడే తెలిపినా అధికారుల్లో చలనం కలగలేదు. ‘సాక్షి’ చెప్పినట్టే నిధులు వెనక్కిపోయే అవకాశం ఉందన్న సంకేతాలు తాజాగా జెడ్పీ అధికారులకు అందాయి. దీంతో పాలకవర్గం ఏర్పడే వరకు వేచి చూస్తే అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయానికొచ్చారు. అధికార పీఠం ఎక్కబోతున్న నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రణాళిక తయారీకి సిద్ధమయ్యారు. నిబంధనలకు తిలోదకాలు నిర్ధేశిత గడువు సమీపించడంతో ఆఘమేఘాల మీద పనుల ప్రతిపాదనకు ఉపక్రమించారు. పంచాయతీ, మండల స్థాయిలో ప్రతిపాదిత పనుల జాబితాను బుధవారం (25వ తేదీ)లోగా తయారు చేసి ఇవ్వాలని ఈనెల 21వ తేదీన మండల అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు చేసి ప్రతిపాదలను తయారు చేయాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో ప్రజాభిప్రాయాన్ని గాలికొదిలేసి నాలుగు గోడల మ ధ్య కూర్చొని, అధికార పార్టీ నేతలు చెప్పిన పనులు ప్రతిపాదించి మమ అన్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. షెడ్యూల్ పట్టని అధికారులు వాస్తవానికి షెడ్యూల్ జారీ చేసిన ప్రకారం మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకోవలసి ఉంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల వరకు గ్రామసభలు పెట్టి పనులను గుర్తించాలి. 9వ రోజులోగా గ్రామస్థాయిలో అనుమతి పొందాలి. ఆ జాబితాలను 12వ రోజులోగా మండలాలకు పంపించాలి. 14వ రోజులోగా మండల స్థాయిలో సమావేశం నిర్వహించి, గ్రామస్థాయి ప్రతిపాదనలను చర్చించాక అనుమతి తెలపాలి. 17వ రోజులోగా జిల్లా పరిషత్‌కు పంపించాలి. 21వ రోజులోగా మండల ప్రణాళికలను పరిశీలించాలి. 24వ రోజులోగా జిల్లా పరిషత్‌లో తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయా రు చేయాలి. 27వ రోజులోగా మండల ప్రణాళికను, జిల్లా పరిషత్ ప్రణాళికను జిల్లా ప్రణాళి క కమిటీ (డీపీసీ)కి పంపించాలి. 31వ రోజు లోగా డీపీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. దాన్ని 32వ రోజున ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ, జెడ్పీ అధికారులకు అదేమీ పట్టకపోవడంతో షెడ్యూల్ ప్రకారంగా జరగలేదు. గ్రామ సభలు నిర్వహించకుండానే... షెడ్యూల్, నిబంధనలను పట్టించుకోకుండా ప్రణాళికలను తయారు చేస్తున్నారు. పనులను గుర్తించేందుకు దోహదపడే గ్రామసభలను నిర్వహించడం లేదు. మండల స్థాయి అధికారులు, అధికార పార్టీ నేతలు ఒకచోట సమావేశమై తమకు తోచిన విధంగా పనులు ప్రతిపాది స్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రక్రియ ముగిసింది. మిగతా మండలాల్లో మంగళ, బుధవారాల్లోగా పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గడువు ముంచుకొస్తుండటం తో అధికార పార్టీ నేతలు చెప్పినట్టే చేసేయాల ని ఉన్నత వర్గాల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయి అధికారులు వెనకా ముందూ చూడడం లేదు. టీడీపీ నాయకులు చెప్పిన వాటినే ప్రతిపాదిస్తున్నారు. -
అధికారుల.. వెనుకంజ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్‌జీఎఫ్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని కింద అభివృద్ధి చేసేందుకు ఎంతో వెనుకబడి ఉందన్న దృష్టితో విజయనగరం జిల్లాను మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంపిక చేశారు. ఈక్రమంలో సామాజిక పరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తోంది. 2014-15కు సంబంధించి జిల్లాకు రూ.22.94కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు ప్రతిపాదిత పనులతో ప్రణాళిక తయారు చేసి ఈనెల 26వ తేదీలోగా అందజేయాలని గతనెల 12వ తేదీన జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రోడ్లు, సామాజిక, పాఠశాలల, అంగన్వాడీ భవనాలు తదితర నిర్మాణాల్ని ఈ ప్రణాళికలో పొందుపర్చాల్సి ఉంది. అలా గే గత ఏడాది చేపట్టి అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తాజా ప్రణాళికలో చేర్చాలని స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రణాళిక తయారయ్యే పరిస్థితి మా త్రం కన్పించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రణాళిక తయారీపై జిల్లా పరిషత్ అధికారులు కనీసం దృష్టి పెట్టలేదు. కొత్తగా వచ్చిన పాలకవర్గం ద్వారా పనులు ప్రతిపాదించేలా చేస్తే వారికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందనే అధికారుల ఆలోచనే ప్రణాళిక తయారీలో వెనుకబాటుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికైతే షెడ్యూల్ జారీ చేసిన మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్ విడుదలైన నాటి నుం చి ఏడు రోజుల వరకు గ్రామసభలు పెట్టి పనులను గుర్తించాలి. కొత్తగా చేపట్టే పనుల తో పాటు అసంపూర్తిగా ఉన్న పనులను అందులో ప్రతిపాదించాలి. 8,9వ రోజులోగా గ్రామస్థాయిలో అనుమతి పొందాలి. ఆ జాబి తాలను 10 నుంచి 12వ రోజులోగా మండలాలకు పంపించాలి. 13,14వ రోజులోగా మండల స్థాయిలో సమావేశం నిర్వహించి, గ్రామస్థాయి ప్రతిపాదనలను చర్చించాక అనుమతి తెలపాలి. 15నుంచి 17వ రోజు లోగా జిల్లా పరిషత్‌కు పంపించాలి. 18 నుంచి 21 రోజులోగా మండల ప్రణాళికలను పరిశీలించాలి. 22నుంచి 24వ రోజులోగా జిల్లా పరిషత్‌లో తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేయాలి. 25 నుంచి 27వ రోజులోగా మండల ప్రణాళికను, జిల్లా పరిషత్ ప్రణాళికను జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ)కి పంపించా లి. 28నుంచి 31వ రోజులోగా డీపీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. దాన్ని 32వ రోజున ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే షెడ్యూల్ విడుదలైన మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీ ప్రారంభం కావాలి. కానీ ఇంతవరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. స్పష్టత కరువు కొత్త పాలకవర్గం కొలువు దీరెదెప్పుడో? ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకునేదెప్పుడో? అంతా స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన ఈనెల 26వ తేదీలోగా బీఆర్జీఎఫ్ ప్రణాళిక సమర్పించే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే షెడ్యూల్ గడువు ముగిసిన తర్వాత ఏమవుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్‌కే సర్కార్ కట్టుబడితే జిల్లాకు కేటాయిం చిన రూ.22.94కోట్లకు గ్రహణం పట్టినట్లే. ఈ నేపథ్యంలో సర్కార్ చొరవ తీసుకుని ప్రత్యేక అనుమతి ఇస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. -
రూ.178 కోట్లకు లెక్కల్లేవ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘మంజూరైన నిధులకు లెక్కలు చూపిస్తేనే తదుపరి నిధుల్ని విడుదల చేస్తాం.’ బీఆర్జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫండ్) నిధులపై కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక ఇది. దీంతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని దాదాపు పరిష్కరించుకుంటున్నారు. కానీ బీఆర్జీఎఫ్ యేతర నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అసలు ఆ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 13వ ఆర్థిక సంఘం, రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఇసుక సీనరేజీ, సాధారణ నిధుల వినియోగాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో స్థానిక సంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనతతో నిబంధనల్ని పక్కన పెట్టి, నచ్చినట్టు ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలకులు, అధికారులు చేతి వాటవాన్ని ప్రదర్శిస్తున్నారు. మంజూరైన నిధులకు లెక్కలు చూపించడం లేదు. ఈ విధంగా విడుదలైన నిధులకు, ఖర్చుకు పొంతన కుదరడం లేదు. జిల్లాకు మంజూరైన నిధుల్లో రూ.178.63 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రతీ పైసాకు స్థానిక సంస్థలు లెక్క చూపించాల్సి ఉంది. ఆ మేరకు ఆడిట్ చేయించుకోవాలి. కానీ మంజూరైన నిధులకు పూర్తి స్థాయిలో లెక్కలు చూపించడం లేదు సరికదా... ఆడిట్‌ను కూడా సరిగా చేయించుకోవ డం లేదు. ఆడిట్ చేసిన వరకూ చూస్తే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, పంచాయతీలు, మున్సిపాల్టీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, దేవాలయాల్లో ఇప్పటివరకు రూ.178.63 కోట్లకు లెక్కలు తేలలేదు. దాదాపు లక్షా 13వేల 845 అభ్యంతరాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో దుర్వినియోగం చేసిన నిధులతో పాటు అడ్వాన్సుల కింద వాడేసిన నిధులకు లెక్కలు చూపడం లేదు. ఎం- బుక్‌లో రికార్డు చేయకుండా నిధుల వినియోగించినట్టు కూడా ఆడిట్లో తేలింది. ఇక రికార్డులు గల్లంతు చేసిన వ్యవహారం కూడా పలుచోట్ల వెలుగు చూసింది. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన ప్రతి అభ్యంతరానికీ అధికారులు సమాధానం చెప్పాలి. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏటా ఆడిట్ అభ్యంతరాలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం. అభ్యంతరాల్ని పరిష్కరి స్తేనే నిధులు విడదల చేస్తామని బీఆర్‌జీఎఫ్‌కు ఏ రకంగానైతే షరతులు విధించారో ఆ దిశగా మిగతా నిధుల వినియోగంపై వ్యవహరించి ఉంటే తప్పనిసరిగా లెక్కలు చూపించేవారు. కానీ మన పాలకులు, ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిధులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అవి సక్రమంగా ఖర్చు అయ్యాయా ? లేదా ? అన్నదానిపై దృ ష్టి సారించడం లేదు. పోనీ ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలని లేదంటే చర్యలు తీసుకోవల్సి వస్తోందని కనీస హెచ్చరికలు కూ డా చేయడం లేదు. ఈ క్రమంలో రూ.178 కోట్లు అతీగతి లేకుండా పోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాయో తేలడం లేదు. దీంతో అవన్నీ స్వాహా అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ చేయాలి... కార్యాలయంలో జరిగిన ప్రతీ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన రికార్డులను చూపించాలి. ఖర్చుకు సంబంధించిన ఓచర్లు, బిల్లులు సమర్పించాలి. మంజూరు ఉత్తర్వులు చూపించాలి. చెక్‌బుక్‌లు సమర్పించాలి. {sెజరీ, బ్యాంకు పాసు పుస్తకాలను సైతం అందజేయాలి. ఒక్కొక్క లావాదేవీకి సంబంధించిన రిజిస్టర్లను కూడా చూపించాలి. ఆడిట్ రిపోర్టు ఇచ్చిన 60 రోజుల్లోగా సాధారణ అభ్యంతరాలకు జవాబులివ్వాలి. {పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన తీవ్రమైన అభ్యంతరాలకు 120రోజులు సమాధానమివ్వాలి. {పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన అభ్యంతరాలకు నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే సర్ఛార్జ్ నోటీసు అందుకోవాల్సి ఉంది. సర్ఛార్జ్ లేఖ ఇచ్చిన 60రోజుల్లోగా అభ్యంతరాల సొమ్మును సంబంధిత ఖాతాకు జమ చేయాలి. జిల్లాలోని స్థానిక సంస్థలపై ఆడిట్ నివేదిక స్థానిక సంస్థ ఆడిట్ అభ్యంతరాలు లెక్కలు తేలని మొత్తం జిల్లా పరిషత్ 656 రూ. 48.73కోట్లు మండల పరిషత్‌లు 4679 రూ. 12.50కోట్లు గ్రామ పంచాయతీలు 1,02,491 రూ. 69.73కోట్లు మున్సిపాల్టీలు 3195 రూ.40.5కోట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీలు 247 రూ.2.6కోట్లు గ్రంథాలయ సంస్థలు 123 రూ.3.5కోట్లు దేవాలయాలు 2453 రూ.99.40లక్షలు -
మాటలు కాదు.. సాక్ష్యాలు కావాలి
ఇందూరు, న్యూస్‌లైన్: కలెక్టర్ : గత సమీక్షలో నిర్ణయించిన గడువు తేదీ ప్రకారం మీ మండలంలో బీఆర్జీఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, భవన నిర్మాణాల పనులు పూర్తయ్యాయా..? ఎంపీడీఓలు : పూర్తి అయ్యాయి సార్.. కలెక్టర్ : అయితే పూర్తి చేసినట్లుగా ఆ భవనం ఫొటో తీసుకురావాలని చెప్పాను.. ఉందా..? చూపించండి. ఎంపీడీఓలు : ఉంది సార్...! చూడండి జిల్లాలో బీఆర్జీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు నిజంగా పూర్తి చేశారో లేదో తెలుసుకోవడానికి ప్రతి మండలాధికారిని, పంచాయతీరాజ్ ఇంజినీర్‌ను ఒక్కొక్కరినీ నిల్చోబెట్టి కలెక్టర్ పైవిధంగా అడిగారు. సోమవారం జిల్లా పరిషత్‌లో కలెక్టర్ ప్రదుమ్న ‘బీఆర్జీఎఫ్’ ప నులపై సమీక్ష నిర్వహించారు. పూర్తయిన ప్రతీ పనికి సంబంధించిన ఫొటోను తనకు చూపించే వరకు ఓపిగ్గా నాలుగు గంటల సేపు సుదీర్ఘంగా సమీక్షించారు. దీంతో పనులు పూర్తి చేయని పలువురి మండలాధికారులు డొల్లతనం బయటపడింది. కలెక్టర్ నుంచి తప్పించుకోవడం కుదరదని అధికారులు కంగుతిన్నారు. కలెక్టర్ అడిగిన పూర్తయిన పనుల ఫొటోలను చూపిం చారు. అయితే కొందరు అధికారులు ఫొటోలు చూపించగా పూర్తయిన భవన నిర్మాణ పనులు అసంతృప్తిగా ఉన్నాయని వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు మరికొందరు అధికారులు ఫొటోలు తీసుకురాక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా పనులు పూర్తి చేశారో లేదో తెలుసుకోవడానికి కలెక్టర్ వేసిన ప్లాన్ అధికారులు చెప్పుడు మాటలకు, జరిగే పనులకు పొంతన లేదనే విషయాన్ని బయటపెట్టిం ది. కొన్ని పనులు పూర్తి అయినట్లు ఫొటోలు ఉండటంతో ఒక విధంగా సంతృప్తి వ్యక్తం చేశారు. మండలం వారీగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. కొందరు అధికారులకు పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలి... జిల్లాలో బీఆర్జీఎఫ్ నిధులతో ప్రారంభించిన పనులను జనవరి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ మండలాధికారులను, ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5022 వివిధ పనులు మంజూరు కాగా 2069 పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పనులు కొన్ని ప్రారంభించగా, మరికొన్ని ప్రారంభించలేదన్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలని సూ చించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో దాదాపుగా 85 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యాలు లేవని, వందకు పైగా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు లేవన్నారు. 1500 పాఠశాలల్లో కట్టిన టాయిలెట్లు వాటర్ సౌకర్యం లేక వినియోగంలో లేవని తెలిపారు. ఎంపీ,ఎస్ఎఫ్సీ,టీఎఫ్సీ,జీపీ కాంపోనెంట్ నిధులతో ఈ సౌకర్యాలు తీర్చాలన్నారు. ఇందుకు మరోసారి మండలాధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఈ నెల 10లోగా ప్రపోజల్స్ పం పించాలని ఆదేశించారు. ముందుగా వీటికే ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామాల్లో రోడ్లు,డ్రైన్లు ఇతర పనులకు తరువాత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సౌకర్యాల కల్పన విషయం లో అధికారులు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బం దులు ఎదుర్కొంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ సభలను పకడ్బందీగా, ఉన్న నిధులతోనే నిర్వహించాలన్నారు. ఈ విష యం కార్యదర్శులకు, సర్పంచులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం నిర్మల్ భారత్ అభియాన్ పథకం, పెన్షన్ తదితర పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబాబు, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉసూరుమన్న కసరత్తు
సాక్షి, సంగారెడ్డి: కొండను తవ్వి ఎలుకను పట్టిన చందగా మారింది జిల్లా పరిషత్ యంత్రాంగం తీరు. స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల వినియోగంపై జిల్లా పరిషత్ అధికారులు నిర్వహించిన భారీ కసరత్తు తుస్సుమంది. వివిధ పద్దుల కింద గడిచిన మూడేళ్లలో మంజూరైన వేల పనుల పురోగతిపై అధ్యయనం చేసి అందులో కేవలం 143 పనులు మాత్రమే ప్రారంభానికి నోచుకోలేదని తెలిసి చేతులు దులుపుకుంది. అదే విధంగా 77 పనుల రద్దుకు మాత్రమే సిఫారసు చేసింది. ప్రారంభం కాని పనులను ప్రారంభమైనట్లు, ప్రారంభమైనా పూర్తికాని పనులు పూర్తయినట్లు చూపించి ‘లేని పురోగతి’ని కాగితాలపై చూపించారనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్), జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల సాధారణ నిధుల, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు(ఎస్ఎఫ్సీ), 13వ ఆర్థిక సంఘం(టీఎఫ్సీ) నిధులతో కింద 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన పనుల స్థితిగతులపై మరోమారు సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జడ్పీ సీఈఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎస్ఈలకు ఆదేశించారు. దీంతో వారం రోజులుగా జడ్పీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలను తయారు చేసింది. ఈ మూడేళ్ల కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయినట్లు తేల్చింది. ఇంకా 1524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు మాత్రమే ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని తేల్చింది. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం సాధ్యం కాని 77 పనుల రద్దుకు సిఫారసు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్), ఎంపీడీఓల నిర్లక్ష్యానికి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలు తోడు కావడంతో నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనుల సంఖ్య ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తప్పుడు సమాచారం ఇచ్చి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు డెడ్లైన్లు గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో పనులన్నింటినీ వచ్చే ఏడాది జనవరి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డెడ్‌లైన్ విధించారు. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని గడువు పెట్టారు. అయితే, గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో ఉన్న 1,342 పనులను జనవరి 31లోగా పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు సమ్మతం తెలిపారు. -
నిధులకు బూజు
సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)కు బూజు పట్టింది. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ నిధులు రికార్డుల్లోనే మూలుగుతున్నాయి. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాలతో జిల్లా పరిషత్ కార్యాలయం అధికారులు నిరుపయోగంగా మూలుగుతున్న నిధుల లెక్కలు వెలికి తీశారు. వరుసగా 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల్లో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని పనుల జాబితాలను మండలాల వారీగా సిద్ధం చేశారు. దాదాపు వారం రోజుల కసరత్తు ముగియడంతో జడ్పీ అధికారులు గురువారం సాయంత్రం సమగ్ర నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. జడ్పీ నిధులతో మంజూరైన పనులు ఇంకా ప్రారంభం కాకుంటే రద్దు చేస్తామని, అలాంటి పనుల పూర్తి వివరాలు అందజేయాలని.. ఈ నెల 4న డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన యంత్రాంగం నివేదిక సిద్ధం చేయడంతో వీటిని రద్దు చేస్తూ ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. బీఆర్జీఎఫ్ కింద జిల్లాకు వచ్చే నిధుల్లో 20 శాతం జిల్లా పరిషత్, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామ పంచాయతీల వాటాలుగా కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, మురికి కాల్వలు, భవనాలు, తాగునీటి వనరుల నిర్మాణం, మరమ్మతు పనుల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ వివాదాలు, స్థల సమస్యలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లిప్తత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, తదితర కారణాల వల్ల చాలా పనులు ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. జిల్లా పరిషత్ పరిశీలనలో తేలిన లెక్కల ప్రకారం.. 2010-13 మధ్య కాలంలో రూ.110.80 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులతో 12,353 పనులు మంజూరయ్యాయి. వీటిలో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రారంభం కాని పనులను రద్దు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నిధులతో మళ్లీ అదే పనులను చేపడతారా? లేక కొత్త పనులకు ఈ నిధులను కేటాయిస్తారా ? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి, పాత పాలకవర్గాలు చేపట్టిన పనులు రద్దు కానున్నాయి. దీంతో ఇపుడున్న పాలకవర్గాలు పనుల ఎంపిక చేసుకునే అవకాశం కలగనుంది. మరోవైపు ఈనెల 27వ తేదీన సిద్దిపేట, 28న మెదక్, 29న సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.