ఎట్టకేలకు జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటైంది. ఏడాది కాలంగా డీపీసీ లేకపోవడంతో సుమారు రూ.25 కోట్ల బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలలో జాప్యం జరిగింది. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కమిటీ ఏర్పాటుతో నిధులు రాబట్టేందుకు చర్యలు వేగవంతమవుతాయని, ఫలితంగా జిల్లా అభివృద్ధికి వీలు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సుమారు ఏడాది కాలం తర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఏర్పాటైంది. వరుసగా వచ్చిన ఎన్నికలలో (సర్పంచ్ మొదలు సార్వత్రిక) భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా డీపీసీ ఖరారు కాలేదు. డీపీసీ ఏర్పాటు కానందున ఏడాది క్రితం రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహిం చారు. జిల్లా పరిషత్ ద్వారా ఏటా సుమారు రూ. 25.63 కోట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్‌జీఎఫ్) ప్రతిపాదనలలో సైతం జాప్యం జరిగింది.
ఫలితంగా ఇప్పటికీ బీఆర్‌జీఎఫ్ నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివద్ధికి నిధుల ప్రతిపాదన, ఆమోదం తదితర అంశాలలో కీలకంగా ఉండే డీపీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వ ం నవంబర్ 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ఎనిమిది నుంచి మొదలైన డీపీసీ సభ్యుల ఎన్నికల ప్ర క్రియ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీకి జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సభ్య కార్యదర్శిగా ఉం టారు. ప్రభుత్వం నియమించే నలుగురు సభ్యులు ఎవరనేది తేలాల్సి ఉం ది. కాగా బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
డీపీసీ స్వరూపం ఇలా
డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. జడ్‌పీ చైర్మన్ సారథ్యం వహిస్తారు. కలెక్టర్ కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. ఇటీవల ఎన్నికైన 24 మంది సభ్యులకు తోడు మరో నలుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. మొత్తం 24 స్థానాలలో 21 స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ప్రభుత్వం నామినేట్ చే సే నలుగురిలో ముగ్గురు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగినవారు, ఒకరు మైనార్టీకి చెందినవారుంటారు.
పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాల్సిన మూడు స్థానాలలో మాజీ సర్పంచులనుగానీ, మాజీ ఎంపీపీలనుగానీ, తదితర కేడర్‌కు చెందినవారినిగానీ నియమించే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో ఎంపికయ్యేందుకు పలువురు పైరవీలు షురూ చేశారు. రెండు మూడు రోజులలో సభ్యుల నియామకం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. డీపీసీ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.
సభ్యులకు నియామక పత్రాలు
ఇందూరు : నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ నియామకపత్రాలు అందజేశారు. మహ్మద్ షకీల్ అహ్మద్, విశాలినీరెడ్డి, లలిత, బోండ్ల సుజాత, గడ్డం సుమనారెడ్డి, నేనావత్ కిషన్, అయిత సుజ, విమల వెల్మల, సామెల్ చిన్నబాలి నియామకపత్రాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు కమిటీ స్వరూపం ఏమిటీ? కమిటీ ఏం చేస్తుంది? సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారికి గల అధికారాలపై వారం రో జులలో శిక్షణా తరగతులు నిర్వహించాలని జడ్‌పీ సీఈఓ రాజారాంను ఆదేశించారు. దీంతో సభ్యులకు డీపీసీపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని పేర్కొ న్నా రు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఎట్టకేలకు
Published Fri, Dec 19 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement