డీపీసీ సభ్యుల ఎంపిక పూర్తి
* నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు
* అధికారిక ఉత్తర్వులే ఆలస్యం
ఇందూరు: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ)లో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సభ్యులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చకు పుల్‌స్టాప్ పడింది. సభ్యుల ఎంపికకు సంబంధిం చిన అభ్యర్థుల పేర్లను ప్రపోజ్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వానికి నలుగురు అభ్యర్థుల పేర్లను పంపారు. అయితే తమ నియోజకవర్గ అభ్యర్థిని ప్రపోజ్ చేయాలని ఎమ్మెల్యేల కోరిక మేరకు జిల్లా మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కవితలు పేర్లను ఖరారు చేసి జడ్పీ చైర్మన్ దపేదారు రాజు ద్వారా పంపినట్లు తెలిసింది. జడ్పీ నుంచి పంపిన పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
జిల్లా ప్రనాళిక కమిటీలో 30 మంది సభ్యులకు గాను ఇదివరకే గ్రామీణ ప్రాంతం నుంచి 19 మంది జడ్పీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొత్తం 24 మంది సభ్యుల ఎన్నిక డిసెంబర్‌లోనే పూర్తయింది. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా ఇందులో జిల్లా కలెక్టర్ డీపీసీ కమిటీ కన్వీనర్‌గా, చై ర్మన్‌గా జడ్పీచైర్మన్ ఉంటారు. మిగిలిన నాలుగు నామినేటెడ్ పోస్టులకు సభ్యులు ప్రస్తుతం ఎంపిక కావడంతో 30 మంది సభ్యులతో డీపీసీ కమిటీ స్వరూపం దాల్చింది. అయితే ఈ కమిటీ చాలా కీలకమైం ది. జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులకు డీపీసీ ఆమో దం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపికైన సభ్యులు వీరే..
నిజామాబాద్ అర్బన్ నుంచి మల్లేష్ గుప్తా, బాల్కొండ నుంచి మహ్మద్ ఇక్బాల్, బోధన్ నుంచి శ్యామ్‌రావు, నిజామాబాద్ రూరల్ నుంచి గంగారాంలు నామినేటెడ్ సభ్యులుగా ఎంపికయ్యారు.ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే సభ్యుల నియామ కం చేపడుతారు.