District Planning Committee
-
డీపీసీ సభ్యుల ఎంపిక పూర్తి
* నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు * అధికారిక ఉత్తర్వులే ఆలస్యం ఇందూరు: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ)లో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సభ్యులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చకు పుల్‌స్టాప్ పడింది. సభ్యుల ఎంపికకు సంబంధిం చిన అభ్యర్థుల పేర్లను ప్రపోజ్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వానికి నలుగురు అభ్యర్థుల పేర్లను పంపారు. అయితే తమ నియోజకవర్గ అభ్యర్థిని ప్రపోజ్ చేయాలని ఎమ్మెల్యేల కోరిక మేరకు జిల్లా మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కవితలు పేర్లను ఖరారు చేసి జడ్పీ చైర్మన్ దపేదారు రాజు ద్వారా పంపినట్లు తెలిసింది. జడ్పీ నుంచి పంపిన పేర్లు దాదాపు ఖరారయ్యాయి. జిల్లా ప్రనాళిక కమిటీలో 30 మంది సభ్యులకు గాను ఇదివరకే గ్రామీణ ప్రాంతం నుంచి 19 మంది జడ్పీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొత్తం 24 మంది సభ్యుల ఎన్నిక డిసెంబర్లోనే పూర్తయింది. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా ఇందులో జిల్లా కలెక్టర్ డీపీసీ కమిటీ కన్వీనర్‌గా, చై ర్మన్‌గా జడ్పీచైర్మన్ ఉంటారు. మిగిలిన నాలుగు నామినేటెడ్ పోస్టులకు సభ్యులు ప్రస్తుతం ఎంపిక కావడంతో 30 మంది సభ్యులతో డీపీసీ కమిటీ స్వరూపం దాల్చింది. అయితే ఈ కమిటీ చాలా కీలకమైం ది. జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులకు డీపీసీ ఆమో దం తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన సభ్యులు వీరే.. నిజామాబాద్ అర్బన్ నుంచి మల్లేష్ గుప్తా, బాల్కొండ నుంచి మహ్మద్ ఇక్బాల్, బోధన్ నుంచి శ్యామ్‌రావు, నిజామాబాద్ రూరల్ నుంచి గంగారాంలు నామినేటెడ్ సభ్యులుగా ఎంపికయ్యారు.ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే సభ్యుల నియామ కం చేపడుతారు. -
ఎట్టకేలకు
ఎట్టకేలకు జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటైంది. ఏడాది కాలంగా డీపీసీ లేకపోవడంతో సుమారు రూ.25 కోట్ల బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలలో జాప్యం జరిగింది. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కమిటీ ఏర్పాటుతో నిధులు రాబట్టేందుకు చర్యలు వేగవంతమవుతాయని, ఫలితంగా జిల్లా అభివృద్ధికి వీలు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సుమారు ఏడాది కాలం తర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఏర్పాటైంది. వరుసగా వచ్చిన ఎన్నికలలో (సర్పంచ్ మొదలు సార్వత్రిక) భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా డీపీసీ ఖరారు కాలేదు. డీపీసీ ఏర్పాటు కానందున ఏడాది క్రితం రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహిం చారు. జిల్లా పరిషత్ ద్వారా ఏటా సుమారు రూ. 25.63 కోట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్) ప్రతిపాదనలలో సైతం జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ బీఆర్జీఎఫ్ నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివద్ధికి నిధుల ప్రతిపాదన, ఆమోదం తదితర అంశాలలో కీలకంగా ఉండే డీపీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వ ం నవంబర్ 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ఎనిమిది నుంచి మొదలైన డీపీసీ సభ్యుల ఎన్నికల ప్ర క్రియ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీకి జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సభ్య కార్యదర్శిగా ఉం టారు. ప్రభుత్వం నియమించే నలుగురు సభ్యులు ఎవరనేది తేలాల్సి ఉం ది. కాగా బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. డీపీసీ స్వరూపం ఇలా డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. జడ్పీ చైర్మన్ సారథ్యం వహిస్తారు. కలెక్టర్ కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. ఇటీవల ఎన్నికైన 24 మంది సభ్యులకు తోడు మరో నలుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. మొత్తం 24 స్థానాలలో 21 స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ప్రభుత్వం నామినేట్ చే సే నలుగురిలో ముగ్గురు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగినవారు, ఒకరు మైనార్టీకి చెందినవారుంటారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాల్సిన మూడు స్థానాలలో మాజీ సర్పంచులనుగానీ, మాజీ ఎంపీపీలనుగానీ, తదితర కేడర్‌కు చెందినవారినిగానీ నియమించే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో ఎంపికయ్యేందుకు పలువురు పైరవీలు షురూ చేశారు. రెండు మూడు రోజులలో సభ్యుల నియామకం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. డీపీసీ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. సభ్యులకు నియామక పత్రాలు ఇందూరు : నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ నియామకపత్రాలు అందజేశారు. మహ్మద్ షకీల్ అహ్మద్, విశాలినీరెడ్డి, లలిత, బోండ్ల సుజాత, గడ్డం సుమనారెడ్డి, నేనావత్ కిషన్, అయిత సుజ, విమల వెల్మల, సామెల్ చిన్నబాలి నియామకపత్రాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు కమిటీ స్వరూపం ఏమిటీ? కమిటీ ఏం చేస్తుంది? సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారికి గల అధికారాలపై వారం రో జులలో శిక్షణా తరగతులు నిర్వహించాలని జడ్పీ సీఈఓ రాజారాంను ఆదేశించారు. దీంతో సభ్యులకు డీపీసీపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని పేర్కొ న్నా రు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఓటింగ్ నేడే
డీపీసీ ఎన్నికలకు సిద్ధం ఏకగ్రీవమైన రూరల్ స్థానాలు అర్బన్ పరిధిలో తీవ్రంగా పోటీ 5 పదవులకు రంగంలో 18 మంది ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇందూరు: జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ) ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు జడ్పీలో అన్ని ఏర్పాట్లు చేశారు. రూరల్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అర్బన్ పరిధిలోని ఐదు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. రూరల్‌లో 23 మంది నామినేషన్లు వేయగా, ఒకదానిని అధికారులు తిరస్కరించారు. పుప్పాల శోభ, నిమ్మ మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రంగంలో మిగిలిన 19 మంది ఏకగ్రీవమయ్యా రు. ఇందులో 18 స్థానాలు టీఆర్ఎస్కు దక్కగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అర్బన్‌లో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. 24 నామినేషన్లు రాగా, ఐదు తిరస్కరణకు గురయ్యా యి. సుదం లక్ష్మి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 18 మంది ఐదు స్థానాల కోసం తలపడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆరు గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. 141 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రూరల్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైంది వీరే సామెల్ చిన్నబాలి, నాగుల శ్రీలత, కిషన్ నేనావత్, లక్ష్మీ బదావత్, రమేశ్ నంద, తానాజీరావు, మాధవరావు, విజయ జం గం, లక్ష్మీ దాసరి, విమల వెల్మల, అమిత ఎనుగందుల, గడ్డం సుమనారెడ్డి, లత కున్యోత్, సావిత్రి మద్ది, జొన్న ప్రతాప్‌రెడ్డి, పడిగెల రాజేశ్వర్‌రావు, మధుసూదన్‌రావు, శంకర్ పుప్పాల. (వీరంతా టీఆర్ఎస్కు చెందినవారు) కాంగ్రెస్ నుంచి సుజ అయిత ఎన్నియ్యారు. అర్బన్ స్థానాలకు పోటీలో ఉన్నది వీరే! బీసీ మహిళ (ఒక స్థానం) బోండ్ల సుజాత, బోగడమీది శ్రీదేవి. బీసీ జనరల్ (ఒక స్థానం) ఖాజా షరీఫుద్దీన్, దారం సాయిలు, జొన్నల నర్సింహులు, మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ నసీర్, మహ్మద్ షకీల్ అహ్మద్, బి. రామస్వామి, శేక్ అజీముద్దీన్. జనరల్ మహిళ (రెండు స్థానాలు) బి.లత, పి. లావణ్య, విశాలినీ రెడ్డి. జనరల్ (ఒక స్థానం) అంకు దామోదర్, కోగుల నర్సయ్య, దామోదర్‌రెడ్డి, మ్లలన్న గారి భూంరెడ్డి, ముస్తాబ్ అహ్మద్. -
‘ఢీ’పీసీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికల్లో కీలక ప్రక్రియ ముగిసింది. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో బుధవారం జిల్లా పరిషత్‌లో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఇందుకు జెడ్పీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. డీపీసీలో 24 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 8న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామినేష్ల స్వీకరణ, వాటి పరిశీలన పూర్తిచేయగా.. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ క్రమంలో 21 స్థానాల్లో సింగిల్ నామినేషన్లే ఉండడంతో వాటి ఎన్నిక ఏకగ్రీవమే. మున్సిపల్ కోటాలోని బీసీ జనరల్ కోటాలో ఉన్న మూడు స్థానాలపై నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాటికి ఓటింగ్ అనివార్యమైంది. మూడు బీసీ జనరల్ సీట్లకు ఓటింగ్.. డీపీసీ సభ్యుల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 24 సభ్యులకుగాను 10 మందిని జెడ్పీటీసీలు ఎన్నుకోనుండగా, 14 మందిని మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో జెడ్పీటీసీ కోటాలో 10 సీట్లకుగాను 11 మంది, మున్సిపల్ కౌన్సిలర్ కోటాలో 14 సీట్లకుగాను 25 మంది పోటీపడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు.. పోటీకంటే సర్దుకుపోవడమే మేలని భావించి బలాబలాల ప్రకారం సీట్లు దక్కించుకునేలా ఎత్తుగడ వేశాయి. ఈ క్రమంలో ఏకాభిప్రాయానికి వచ్చి పార్టీల వారీగా సీట్ల సంఖ్యను ఖరారు చేసుకున్నాయి. దీంతో పోటీలో ఉన్న పలువురిని పార్టీ నేత లు బుజ్జగించి రాజీయత్నానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ కోటాలో అదనంగా ఉన్న ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. మున్సిపల్ కోటాలోనూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. బీసీ జనరల్ కోటాలోని 3సీట్లపై అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో ఆ సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లో సింగిల్ నామినేషన్లు మిగలడంతో వాటి ఓటింగ్ నామమాత్రమే అయ్యింది. బీసీ జనరల్ కోటాలోని మూడు సీట్లకు సంబంధించి జిల్లా పరిషత్‌లో బుధవారం ఓటింగ్ జరగనుంది. ఈ మూడు సీట్లకుగాను ఐదు మంది బరిలో ఉన్నారు.ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుర్తింపు కార్డులు తప్పనిసరి.. జెడ్పీటీసీ కోటాలోని సీట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా, మున్సిపల్ కౌన్సిలర్ల కోటాలో ఉన్న మూడు బీసీ జనరల్ స్థానాలకు ఓటింగ్ అనివార్యమైంది. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లంతా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. వీరిలో ముగ్గురికి ఓట్లు వేసి గెలిపించాలి. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు తప్పకుండా వారి గుర్తింపు కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే అనుమతించబోమని జిల్లాపరిషత్ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు. -
డీపీసీ...లైన్‌క్లియర్
నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికకు లైన్‌క్లియర్ అయ్యింది. జెడ్పీటీసీ సభ్యుల కోటాలో 20 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కౌన్సిలర్ల కోటాలో రెండుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ సభ్యుల నడుమే పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ కుదిరిన అవగాహన మేరకు జెడ్పీటీసీ కోటాలో కాంగ్రెస్-13, టీఆర్ఎస్-7 స్థానాలు పంచుకున్నాయి. అయితే జెడ్పీటీసీ సభ్యుల కోటా బీసీ మహిళా కేటగిరీలో 3 స్థానాలుండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కుదిరిన అవగాహన మేరకు కాంగ్రెస్‌కు రెండుస్థానాలు, టీఆర్ఎస్కు ఒక స్థానం అనుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నిడమనూరు జెడ్పీటీసీ సభ్యురాలు అంకతి రుక్మిణి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ మూడు స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. కౌన్సిలర్ల కోటాలో...పోటాపోటీ కౌన్సిలర్ల కోటాలో నాలుగు స్థానాలుండగా, ఎస్పీ మహిళా కేటగిరిలో మిర్యాలగూడ కౌన్సిలర్ వెంకమ్మ(కాంగ్రెస్), జనరల్ మహిళా కేటగిరిలో పి.వనజ(టీఆర్ఎస్) ఏకగీవ్రమయ్యారు. అయితే వనజ సూర్యాపేట మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి గెలిచి తదనంతర పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక మిగిలిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ కౌన్సిలర్ మధ్యే తీవ్రపోటీ నెలకొంది. బీసీ జనరల్ స్థానానికి నలుగురు సభ్యులు పోటీపడుతుండగా, దీంట్లో ముగ్గురు కాంగ్రెస్‌పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ కౌన్సిలర్. జనరల్ కేటగిరిలో ఆరుగురు బరిలో ఉండగా, ఇందులో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరిది బీజేపీ. నల్లగొండ, కోదాడ మునిసిపాలిటీల్లో కా ంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల దృష్ట్యా పోటీ అనివార్యమైంది. అయితే పోటీ అనివార్యమైనప్పటికీ ఒక స్థానం నల్లగొండకు, రెండోస్థానం దేవరకొండకు దక్కేవిధంగా రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు ఎన్నిక.. కౌన్సిలర్ కోటాలో మిగిలిన రెండు స్థానాలకు బుధవారం కలెక్టరేట్లో ఉదియాదిత్య భవన్లో ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక ఉంటుంది. ఐదు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం మొత్తం 210 కౌన్సిలర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు ఫొటోగుర్తింపు కార్డులు, కౌన్సిలర్లుగా ఎన్నికైన సమయంలో ఇచ్చిన ధృవీకరణ పత్రాలు, మునిసిపల్ కమిషనర్ నుంచి గుర్తింపుపత్రం తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఎన్నికకు మునిసిపల్, నగర పంచాయతీల కమిషనర్లు హాజరుకావాలని జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు వీరే.. ఎస్సీ జనరల్ : ఎస్.బసవయ్య , ఎం.యాదయ్య ఎస్సీ మహిళ : వై.నాగమణి పి.సంపత్రాణి ఎస్టీ మహిళ : బి.మంజుల, భూక్యా నీల ఎస్టీ జనరల్ : కె. శంకర్ బీసీ మహిళ : ఎస్.ఉమ , జె.వసంత, కె.కమలమ్మ బీసీ జనరల్ : ఎన్. శ్రీనివాస్‌గౌడ్, ఎం.శ్రీనివాస్, బి.పరమేశ్వర్, పి.కోటేశ్వరరావు జనరల్ మహిళ : టి. స్పందనరెడ్డి, ఈ. శ్వేత, ఆర్.చుక్కమ్మ జనరల్ కేటగిరి : ఎం.రామకృష్ణారెడ్డి, కె.లింగారెడ్డి, ఎన్.రాజిరెడ్డి -
రసకందాయంలో డీపీసీ ఎన్నిక
నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నిక రసకందాయంలో పడింది. కమిటీ సభ్యు ల్లో కౌన్సిలర్ల కోటాకు సంబంధించి కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ల మధ్య గట్టిపోటీ ఏర్పడింది. ఈ కోటాలో నాలుగు స్థానాలుండగా, రెండు ఏకగ్రీమవుతుండగా, మరోరెండు స్థా నాలకు 17మంది కౌన్సిలర్లు బరిలో ఉన్నారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో నామినేష న్ల పరిశీలన పూర్తయ్యింది. కౌన్సిలర్ల కోటాలో మహిళా రిజర్వేషన్లో పురుషుడు నామినేషన్ దాఖలు చేయగా, అధికారులు దానిని తిరస్కరించారు. కాగా రెండు పార్టీల మధ్య సమన్వ యం కుదరిన పక్షంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరించుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జెడ్పీటీసీ కోటాలో 20 మంది సభ్యులకుగాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు నలుగురు పోటీ పడుతున్నారు. ఈ మూడు స్థానాలు కూడా బీసీ మహిళా కోటాకు చెందినవే. రామన్నపేట, నిడమనూరు, మోతె, యాదగిరిగుట్ట సభ్యులు పోటీలో ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ కాగా, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ టీఆర్ఎస్కు చెందినవారు. టీఆర్ఎస్కు కోటా ప్రకారం 7 స్థానాలు ఇవ్వాల్సి ఉండగా 6 ఇచ్చారు. కాబట్టి పొత్తులో భాగంగా ఈ మూడు స్థానాల్లో ఒకటి టీఆర్ఎస్కు తప్పనిసరిగా కేటాయించాల్సిందే. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు నామినేషన్ ఉపసంహరిం చుకుంటేనే సరి...లేకపోతే పోటీ ఉంటుంది. కాగా, కౌన్సిలర్ల కోటాలో బీసీ జనరల్ స్థానానికి 8 మంది, జనరల్ స్థానానికి 9మంది కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. వీరిలో బీసీ జనరల్ స్థానానికి నామినేషన్ వేసిన సభ్యులు సైతం జనరల్ స్థానానికి నామినేషన్ వేశారు. సూర్యాపేట మునిసిపాలిటీ మినహా కోదాడ, భువనగిరి, నల్లగొండ,మిర్యాలగూడ మునిసిపాలిటీ, హుజూర్నగర్ , దేవరకొండ నగరపంచాయతీ నుంచి సభ్యులు పోటీలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి డీపీసీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. -
ఇక్కడ..లొల్లి
మంత్రికి తెలియకుండానే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం ⇒ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యమిచ్చిన జెడ్పీ చైర్మన్ ⇒ కలెక్టర్‌కు తెలియకుండానే సమావేశం ఏర్పాటు ⇒ మంత్రి జోక్యంతో వాయిదా ⇒ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యతకు భంగం! సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) పదవులను సజావుగా పంచుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య కొత్త లొల్లి మొదలైంది. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ‘రాజీ’ మూడుగంటల ముచ్చటగానే మిగిలిపోయి రాజకీయ వైరానికి దారితీసింది. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ నియామకంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పూర్తిగా కాంగ్రెస్ వారికే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వం నియమించాల్సిన ఎమ్మెల్యేలను తానే నామినేట్ చేయడం, జిల్లా మంత్రికి తెలియకుండానే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కొత్త వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండానే కమిటీని నియమించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలుసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమావేశాన్ని వాయిదా వేయించినట్టు సమాచారం. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్గాజెడ్పీచైర్మన్, కార్యదర్శిగా కలెక్టర్ ఉంటారు. ఇందులో రాజకీయ నాయకులకు కూడా స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కమిటీలో తీసుకోవాలి. అయితే, ఎంపీపీలు, జెడ్పీటీసీలను నియమించే అధికారం జెడ్పీచైర్మన్‌కు ఉన్నా ఎమ్మెల్యేలను మాత్రం ప్రభుత్వం (జిల్లా ఇన్చార్జ్ మంత్రి) సిఫారసు చేయాల్సి ఉం టుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను అధికారికంగా నియమించనందున జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఎమ్మెల్యేల పేర్లను సిఫారసు చేయాలి. ఏం జరిగిందో ఏమో కానీ... మంత్రికి, ప్రభుత్వానికి తెలియకుం డానే జెడ్పీచైర్మన్ బాలునాయక్ ముగ్గు రు ఎమ్మెల్యేలను కూడా నియమించేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కమిటీ సభ్యులుగా నియమించేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీలను కూడా కాంగ్రెస్ వారినే నియమించారు. జెడ్పీచైర్మన్ ఆదేశాలతో ఈ కమిటీని ఖరారు చేసిన వైద్యశాఖ అధికారులు కలెక్టర్‌కు తెలియకుండానే శనివారం కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కనీసం సమావేశ ఏర్పాటు గురించి మంత్రి జగదీష్‌రెడ్డికి సమాచారం కూడా ఇవ్వలేదు. దీనిపై మంత్రి జిల్లా ఉన్నతాధికారులను ఆరాతీయడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుం డా కమిటీని నియమించి సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆ శాఖ ఉన్నతాధికారులు జెడ్పీచైర్మన్‌ను ఒప్పించి సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీని వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డీపీసీ పదవులను ఏ పేచీ లే కుండానే పంచుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య రాజకీయ అగాథం ఏర్పడిందని, జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తుందని రాజకీ య వర్గాలంటున్నాయి. అసలు జిల్లా మంత్రికి తెలియకుండా కమిటీని నియమించి, సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ విషయమై తాడోపేడో తేల్చుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో నూ ఈ కమిటీని అంగీకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల పంచాయితీ ఏ మలు పు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. -
17న డీపీసీ ఎన్నిక
సాక్షి, సంగారెడ్డి: జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ) ఎన్నిక ఈనెల 17న జరగనుంది. ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయటంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ ఎన్నిక ముగియగానే జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు ఇతరాత్ర సమస్యల వల్ల ప్రణాళిక కమిటీ ఎన్నికల నిర్వహణలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం సర్కార్ జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను అనుసరించి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల పేర్లతో ఓటరు జాబితాను సైతం జెడ్పీ అధికారులు వెలువరించారు. ఈ ఓటరు జాబితాపై బుధవారం అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది ఓటరు జాబితాను గురువారం ప్రకటిస్తారు. ఎన్నికలు...ఆ వెంటనే ఫలితాలు 12వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీలోని 4 అర్బన్, 20 గ్రామీణ సభ్యుల స్థానాల ఎన్నికకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 17వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెలువరిస్తారు. జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రణాళిక కమిటీ ఎన్నికల విషయమై రెండు పార్టీల జెడ్పీటీసీలు త్వరలో సమావేశమై ప్రణాళిక కమిటీ సభ్యుల స్థానాలకు ఎవరిని బరిలో దించాలో నిర్ణయించే అవకాశం ఉంది. కాగా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ డీపీసీ ఎన్నికల్లో సైతం పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. డీపీసీ సభ్యుల ఎన్నిక ఇలా... జిల్లా ప్రణాళిక కమిటీలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు మరో 28 మంది సభ్యులు ఉంటారు. జెడ్పీ చైర్పర్సన్ డీపీసీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ ఉంటారు. 28 మంది సభ్యుల్లో నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగితా 24 మంది సభ్యుల్లో నలుగురు అర్బన్, 20 మంది రూరల్ సభ్యులు ఉంటారు. నలుగురు అర్బన్ సభ్యులుగా మున్సిపల్ కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. 20 మంది రూరల్ సభ్యులను జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు. జిల్లాలో ప్రస్తుతం సంగారె డ్డి, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, గజ్వేల్, అందోలు మున్సిపాలిటీల్లో మొత్తం 145 మంది కౌన్సిలర్లు ఉన్నారు. డీపీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుసరించి కౌన్సిలర్లు పోటీ చేయవచ్చు. ఒక్కో కౌన్సిలర్లు ఎన్నికల్లో నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రూరల్ సభ్యుల రిజర్వేషన్ ప్రకారం జెడ్పీటీసీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక్కో జెడ్పీటీసీ 20 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 17న సంగారెడ్డిలో జరగనున్న డీపీసీ ఎన్నికలకు కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. టీఆర్ఎస్కే ఎక్కువ అవ కాశాలు డీపీసీ ఎన్నికల్లో 24 మంది సభ్యుల ఎన్నికల కీలకం కానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ, జెడ్పీలోనూ అధికారపార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో డీపీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో 46 స్థానాలకుగాను 21 మంది టీఆర్ఎస్ సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన మరో ఐదుగురు సభ్యులు టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు. అలాగే టీ డీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు సైతం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో టీఆర్ఎస్ సహకరించారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక తరహాలోనే డీపీసీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డీపీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
డీపీసీకి నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా ప్రణాళిక కమిటి (డీపీసీ)సభ్యుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా కూడా ప్రకటించారు. కమిటీలో మొత్తం 30 మంది సభ్యులకు గాను నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 26 మందిలో జడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉండాలి. డీపీసీ సభ్యులను 20 శాతం నగర, పట్టణాల నుంచి, 80 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఐదుగురు సభ్యులను మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల నుంచి, మిగిలిన 19 మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి (జడ్పీటీసీలను) ఎన్నుకుంటారు. అయితే ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇక్కడ మేయర్లు లే నందున అన్ని మున్సిపాలిటీల కౌన్సిలర్లను కూడా సభ్యులుగా తీసుకోవటం లేదని, నగరపాలక సంస్థల ఎన్నికల అనంతరం ఐదుగురు సభ్యులను ఎన్నుకుంటామని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు (మెమో నంబర్ 4893) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 మంది జడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. చైర్‌పర్సన్‌కు డీపీసీ పగ్గాలు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత డీపీసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో ఆమె డీపీసీ పగ్గాలు అందుకోనున్నారు. కమిటీలో కలెక్టర్ మెంబర్, సెక్రటరిగా వ్యవహరిస్తారు. నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరిలో ఒకరు మైనార్టీ, మరో ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మిగతా 24 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులలో 19 మందిని మాత్రమే ప్రస్తుతం ఎన్నుకుంటారు. ఈ కమిటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్లు శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. నోటిఫికేషన్ ఇలా.. జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పాటు 19 మంది జడ్పీటీసీలతో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించారు. 8 నుంచి 10 వరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు 11 ఓటర్ల తుదిజాబితా విడుదల 12న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు జడ్పీలో నామినేషన్ల స్వీకరణ 15న నామినేషన్ల పరిశీలన 16న ఉపసంహరణ ప్రక్రియ (సాయంత్రం 3గంటల లోపు) 17న పోలింగ్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు జిల్లాపరిషత్‌లో)అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు.. ఫలితాలు విడుదల. ముసాయిదా ఓటరు జాబితా విడుదల.. గడిపల్లి కవిత -జడ్పీచైర్‌పర్సన్(వెంకటాపురం జడ్పీటీసీ), బనావత్ కొండా (బోనకల్), కూరపాటి తిరీష(చింతకాని), జర్పుల లీలావతి (కల్లూరు), దరావత్ భారతి (ఖమ్మంరూరల్), తేజావత్ సోమ్లా (కొణిజర్ల), వడ్త్యా రాంచంద్రు(కూసుమంచి), మూడు ప్రియాంక(మధిర), మందడపు నాగేశ్వరరావు(ముదిగొండ), తేజావత్ అనిత (నేలకొండపల్లి), గుగులోత్ భాషా(వేంసూరు), అంకుడోత్ రజిత(పెనుబల్లి), అజ్మీరా వీరూ(రఘునాథపాలెం), అసావత్ లక్ష్మీ(సత్తుపల్లి), మూకర ప్రసాద్(తల్లాడ), బాణోత్ విజయ(తిరుమలాయపాలెం), బొర్రా ఉమాదేవి(వైరా), అంకసాల శ్రీనివాసరావు(ఎర్రుపాలెం), గౌని ఐలయ్య(బయ్యారం), అంకిరెడ్డి కృష్ణారెడ్డి(చండ్రుగొండ), కొప్పెల శ్యామల(ఏన్కూరు), ఎద్దు మాధవి(గార్ల), గొగ్గిల లక్ష్మి(గుండాల), శెట్టిపల్లి వెంకటేశ్వరరావు(జూలూరుపాడు), మేకల మల్లిబాబు (కామేపల్లి), ఉన్నం వీరేందర్(సింగరేణి), గిడ్ల పరంజోతిరావు(కొత్తగూడెం), లక్కినేని సురేందర్‌రావు(టేకులపల్లి), చండ్ర అరుణ(ఇల్లందు), తోకల లత(అశ్వాపురం), అంకిత మల్లిఖార్జున్‌రావు(అశ్వారావుపేట), దొడ్డాకుల సరోజిని (దమ్మపేట), పాల్వంచ దుర్గ(మణుగూరు), బత్తుల అంజి(ములకలపల్లి), బరపటి వాసుదేవరావు(పాల్వంచ), జాడి జానమ్మ(పినపాక), తోటమల్ల హరిత(చర్ల), అన్నె సత్యనారాయణమూర్తి(దుమ్ముగూడెం), సోమిడి ధనలక్ష్మీ(వాజేడు). -
డీపీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
- 12 నుంచి నామినేషన్ల స్వీకరణ - 15న పరిశీలన - 17న పోలింగ్, అదే రోజు ఫలితాలు ఇందూరు : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికలకు తెరలేచింది. పది రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జిల్లా పరిషత్ అధికారులు డీపీసీ ఎన్నికలకు సంబంధించిన ఫైలును కలెక్టర్‌కు పంపారు. ఆయన దీనిపై సంతకం చేస్తూ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇటు జడ్పీ అధికారులు ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా నోటీస్ బోర్డుపై పెట్టారు. 10వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో పేర్లపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓట్లను నమోదు చేసుకుంటారు. 11న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 12న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15న నామినేషన్లను పరిశీలించిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ, 17న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటిస్తారు. డీపీసీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రి.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే డీపీసీ ఎ న్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆలస్యంగా వెలువడిన నోటిఫికేషన్లో ప్రభుత్వం డీపీసీలో కొన్ని మా ర్పులు చేసింది. గతంలో కమిటీకి చైర్మన్‌గా జిల్లా పరి షత్ చైర్మన్ ఉండేవారు. ఇక నుంచి జిల్లాకు చెందిన మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కమిటీకి ఉపాధ్యక్షుడి గా జడ్పీ చైర్మన్, కార్యదర్శిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళిక కమిటీ చాలా ముఖ్యమైంది. కమిటీ సభ్యులు ఆమోదం తెలిపితేనే జిల్లాకు కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు వస్తాయి. ఈ డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యేక ఆహ్వనితులుగా ఉంటారు. ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు ఉండదు. జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. -
డీపీసీ నగారా మోగింది
ఎన్నికలకు సర్కారు అనుమతి సమాయత్తమవుతున్న అధికారులు డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల 12న నామినేషన్లు..15న పరిశీలన 17న పోలింగ్.. అదేరోజు ఫలితాలు పదిరోజులపాటు సాగనున్న ప్రక్రియ నిజామాబాద్: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, డీపీసీ ఖరారు కాకపోవడంతో రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగా క డీపీసీ సభ్యులను ఎన్నుకోవడం ఆనవాయితీ. ఆలస్యంగానైనా డీపీసీ ఏర్పాటుకు తెర లేసింది. డిసెంబర్ 17న ఎన్నికలునిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కా ర్యదర్శి జె. రేమండ్ పీటర్ గురువారం జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ రూపం ఇదీ జిల్లా ప్రణాళిక కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. చైర్మన్‌గా జడ్పీ చైర్పర్సన్ ఉంటారు. కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 24 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. డీపీసీ సభ్యులను 20 శాతం నగరం/పట్టణాల నుంచి, 80 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నుంటారు. జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టే అభివృద్ది పనుల ప్రతి పాదన, ఆమోదాలలో డీపీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. బీఆర్‌జీఎఫ్‌లోనూ చురుకుగా ఉంటుంది. దీంతో సుమారు పది రోజు లపాటు జరిగే ఎన్నికల ప్రక్రియ కూడా అధికారులకు కీలకంగా మారనుంది. ఇదీ వరుస 24 మంది డీపీసీ సభ్యుల కోసం జరిగే ఎన్నికలకు డిసెంబర్ ఎనిమిదిన షెడ్యూల్ విడుదల అవుతుంది. అదేరోజు ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను రూపొందించేందుకు నోటిఫికేషన్ ఇస్తారు. 8,9,10 తేదీలలో ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 11న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. 12న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 15న వాటిని పరిశీలించి, అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, 17న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికలలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు, 141 మంది కార్పొ రేటర్లు, కౌన్సిలర్లు ఓటు వేసేందుకు, పోటీచేసేందుకు అవకాశం ఉంది. దాదాపుగా డీపీసీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్న చర్చ కూడ జరుగుతోంది. -
బీఆర్జీఎఫ్ నిధులకు గ్రహణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్)కి రాజకీయ గ్రహణం పట్టుకుంది. జిల్లా ప్లానింగ్ కమిటీ(డీపీసీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. దీంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బీఆర్జీఎఫ్ కింద చేపట్టే పనులకు సాధారణంగా మే నెలలో ఆమోదం తెలపాల్సివుంటుంది. రాష్ట్ర విభజన , జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల ప్రభావం ఈ పనుల ఆమోదంపై పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీపీసీ సభ్యుల నియామకపు ప్రక్రియ నిర్వహణలో జాప్యం జరిగింది. రాష్ట్రస్థాయిలో కమిటీలను నియమించినప్పటికీ జిల్లా కమిటీలను ప్రకటించకపోవడంతో బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. 2014-15వ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్లతో బీఆర్జీఎఫ్ పనులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. దీంట్లో 50 శాతం మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలకు, 30శాతం మండల పరిషత్‌లకు, 20శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతిపాదనలు పూర్తి.. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయిస్తారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను ప్రతిపాదిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.25.74 కోట్లతో 1,508 పనులు చేపట్టగా, వీటిలో గ్రామ పంచాయతీల్లో రూ.12 కోట్లు, మండల పరిషత్‌లలో రూ.7.5 కోట్లు, జిల్లా పరిషత్‌లో రూ.ఐదు కోట్ల పనులు పూర్తి చేశారు. అలాగే జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ. 1.24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీనికి అనుగుణంగా ఈ సారి కూడా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేశారు. మే చివరినాటికే పనులకు తుదిరూపు ఇచ్చినప్పటికీ రాష్ట్ర విభజన, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీటికి ఆమోదముద్ర పడలేదు. డీపీసీ ఆమోదిస్తేనే.. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు డీపీసీ సభ్యుల ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సభ్యులను నామినేట్ చేసినప్పటికీ, జిల్లాలో ముగ్గురు నామినేటెడ్ సభ్యుల నియామకం ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో తొలి త్రైమాసిక పూర్తయినప్పటికీ బీఆర్జీఎఫ్ పనులకు అతిగతీ లేకుండా పోయింది. నిధుల వినియోగ ధ్రువపత్రాలు సమర్పిస్తేనే తదుపరి పనులకు నిధులను విడుదల చేయాలనే కేంద్రం ఆంక్షల నేపథ్యంలో.. డీపీసీ సభ్యుల నియామకంతో ఇప్పటికీ పనులకు ఆమోదం తెలపకపోవడం చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో పనులు పూర్తికావడం అనుమానంగానే కనిపిస్తోంది.