సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా ప్రణాళిక కమిటి (డీపీసీ)సభ్యుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా కూడా ప్రకటించారు. కమిటీలో మొత్తం 30 మంది సభ్యులకు గాను నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 26 మందిలో జడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉండాలి.
డీపీసీ సభ్యులను 20 శాతం నగర, పట్టణాల నుంచి, 80 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఐదుగురు సభ్యులను మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల నుంచి, మిగిలిన 19 మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి (జడ్పీటీసీలను) ఎన్నుకుంటారు. అయితే ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇక్కడ మేయర్లు లే నందున అన్ని మున్సిపాలిటీల కౌన్సిలర్లను కూడా సభ్యులుగా తీసుకోవటం లేదని, నగరపాలక సంస్థల ఎన్నికల అనంతరం ఐదుగురు సభ్యులను ఎన్నుకుంటామని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు (మెమో నంబర్ 4893) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 మంది జడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది.
చైర్‌పర్సన్‌కు డీపీసీ పగ్గాలు..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత డీపీసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో ఆమె డీపీసీ పగ్గాలు అందుకోనున్నారు. కమిటీలో కలెక్టర్ మెంబర్, సెక్రటరిగా వ్యవహరిస్తారు. నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరిలో ఒకరు మైనార్టీ, మరో ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. మిగతా 24 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులలో 19 మందిని మాత్రమే ప్రస్తుతం ఎన్నుకుంటారు. ఈ కమిటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్‌లు శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
నోటిఫికేషన్ ఇలా..
జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పాటు 19 మంది జడ్పీటీసీలతో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించారు.
8 నుంచి 10 వరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు
11 ఓటర్ల తుదిజాబితా విడుదల
12న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు
జడ్పీలో నామినేషన్‌ల స్వీకరణ
15న నామినేషన్ల పరిశీలన
16న ఉపసంహరణ ప్రక్రియ (సాయంత్రం 3గంటల లోపు)
17న పోలింగ్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు జిల్లాపరిషత్‌లో)అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు.. ఫలితాలు విడుదల.
ముసాయిదా ఓటరు జాబితా విడుదల..
గడిపల్లి కవిత -జడ్పీచైర్‌పర్సన్(వెంకటాపురం జడ్పీటీసీ), బనావత్ కొండా (బోనకల్), కూరపాటి తిరీష(చింతకాని), జర్పుల లీలావతి (కల్లూరు), దరావత్ భారతి (ఖమ్మంరూరల్), తేజావత్ సోమ్లా (కొణిజర్ల), వడ్త్యా రాంచంద్రు(కూసుమంచి), మూడు ప్రియాంక(మధిర), మందడపు నాగేశ్వరరావు(ముదిగొండ), తేజావత్ అనిత (నేలకొండపల్లి), గుగులోత్ భాషా(వేంసూరు), అంకుడోత్ రజిత(పెనుబల్లి), అజ్మీరా వీరూ(రఘునాథపాలెం), అసావత్ లక్ష్మీ(సత్తుపల్లి), మూకర ప్రసాద్(తల్లాడ), బాణోత్ విజయ(తిరుమలాయపాలెం), బొర్రా ఉమాదేవి(వైరా), అంకసాల శ్రీనివాసరావు(ఎర్రుపాలెం), గౌని ఐలయ్య(బయ్యారం), అంకిరెడ్డి కృష్ణారెడ్డి(చండ్రుగొండ), కొప్పెల శ్యామల(ఏన్కూరు), ఎద్దు మాధవి(గార్ల), గొగ్గిల లక్ష్మి(గుండాల), శెట్టిపల్లి వెంకటేశ్వరరావు(జూలూరుపాడు), మేకల మల్లిబాబు (కామేపల్లి), ఉన్నం వీరేందర్(సింగరేణి), గిడ్ల పరంజోతిరావు(కొత్తగూడెం), లక్కినేని సురేందర్‌రావు(టేకులపల్లి), చండ్ర అరుణ(ఇల్లందు), తోకల లత(అశ్వాపురం), అంకిత మల్లిఖార్జున్‌రావు(అశ్వారావుపేట), దొడ్డాకుల సరోజిని (దమ్మపేట), పాల్వంచ దుర్గ(మణుగూరు), బత్తుల అంజి(ములకలపల్లి), బరపటి వాసుదేవరావు(పాల్వంచ), జాడి జానమ్మ(పినపాక), తోటమల్ల హరిత(చర్ల), అన్నె సత్యనారాయణమూర్తి(దుమ్ముగూడెం), సోమిడి ధనలక్ష్మీ(వాజేడు).
డీపీసీకి నోటిఫికేషన్
Published Tue, Dec 9 2014 3:14 AM | Last Updated on Wed, Sep 5 2018 2:01 PM
Advertisement
Advertisement