నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికకు లైన్‌క్లియర్ అయ్యింది. జెడ్పీటీసీ సభ్యుల కోటాలో 20 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కౌన్సిలర్ల కోటాలో రెండుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ సభ్యుల నడుమే పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ కుదిరిన అవగాహన మేరకు జెడ్పీటీసీ కోటాలో కాంగ్రెస్-13, టీఆర్‌ఎస్-7 స్థానాలు పంచుకున్నాయి. అయితే జెడ్పీటీసీ సభ్యుల కోటా బీసీ మహిళా కేటగిరీలో 3 స్థానాలుండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కుదిరిన అవగాహన మేరకు కాంగ్రెస్‌కు రెండుస్థానాలు, టీఆర్‌ఎస్‌కు ఒక స్థానం అనుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నిడమనూరు జెడ్పీటీసీ సభ్యురాలు అంకతి రుక్మిణి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ మూడు స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి.
కౌన్సిలర్ల కోటాలో...పోటాపోటీ
కౌన్సిలర్ల కోటాలో నాలుగు స్థానాలుండగా, ఎస్పీ మహిళా కేటగిరిలో మిర్యాలగూడ కౌన్సిలర్ వెంకమ్మ(కాంగ్రెస్), జనరల్ మహిళా కేటగిరిలో పి.వనజ(టీఆర్‌ఎస్) ఏకగీవ్రమయ్యారు. అయితే వనజ సూర్యాపేట మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి గెలిచి తదనంతర పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక మిగిలిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ కౌన్సిలర్ మధ్యే తీవ్రపోటీ నెలకొంది. బీసీ జనరల్ స్థానానికి నలుగురు సభ్యులు పోటీపడుతుండగా, దీంట్లో ముగ్గురు కాంగ్రెస్‌పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ కౌన్సిలర్. జనరల్ కేటగిరిలో ఆరుగురు బరిలో ఉండగా, ఇందులో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరిది బీజేపీ. నల్లగొండ, కోదాడ మునిసిపాలిటీల్లో కా ంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల దృష్ట్యా పోటీ అనివార్యమైంది. అయితే పోటీ అనివార్యమైనప్పటికీ ఒక స్థానం నల్లగొండకు, రెండోస్థానం దేవరకొండకు దక్కేవిధంగా రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నేడు ఎన్నిక..
కౌన్సిలర్ కోటాలో మిగిలిన రెండు స్థానాలకు బుధవారం కలెక్టరేట్‌లో ఉదియాదిత్య భవన్‌లో ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక ఉంటుంది. ఐదు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం మొత్తం 210 కౌన్సిలర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు ఫొటోగుర్తింపు కార్డులు, కౌన్సిలర్లుగా ఎన్నికైన సమయంలో ఇచ్చిన ధృవీకరణ పత్రాలు, మునిసిపల్ కమిషనర్ నుంచి గుర్తింపుపత్రం తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఎన్నికకు మునిసిపల్, నగర పంచాయతీల కమిషనర్లు హాజరుకావాలని జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన
జెడ్పీటీసీ సభ్యులు వీరే..
ఎస్సీ జనరల్ : ఎస్.బసవయ్య ,
ఎం.యాదయ్య
ఎస్సీ మహిళ : వై.నాగమణి
పి.సంపత్‌రాణి
ఎస్టీ మహిళ : బి.మంజుల, భూక్యా నీల
ఎస్టీ జనరల్ : కె. శంకర్
బీసీ మహిళ : ఎస్.ఉమ , జె.వసంత,
కె.కమలమ్మ
బీసీ జనరల్ : ఎన్. శ్రీనివాస్‌గౌడ్,
ఎం.శ్రీనివాస్, బి.పరమేశ్వర్,
పి.కోటేశ్వరరావు
జనరల్ మహిళ : టి. స్పందనరెడ్డి,
ఈ. శ్వేత, ఆర్.చుక్కమ్మ
జనరల్ కేటగిరి : ఎం.రామకృష్ణారెడ్డి,
కె.లింగారెడ్డి, ఎన్.రాజిరెడ్డి
డీపీసీ...లైన్‌క్లియర్
Published Wed, Dec 17 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement