DPC
-
పదోన్నతులకు డీపీసీ
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖలో ద్వితీయ శ్రేణి గెజిటెడ్ అధికారి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రెండేళ్ల కాలపరిమితితో పని చేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ శాఖకు రూ.30 కోట్లు మంజూరు మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్ కింద రూ.30 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎట్టకేలకు
ఎట్టకేలకు జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటైంది. ఏడాది కాలంగా డీపీసీ లేకపోవడంతో సుమారు రూ.25 కోట్ల బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలలో జాప్యం జరిగింది. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కమిటీ ఏర్పాటుతో నిధులు రాబట్టేందుకు చర్యలు వేగవంతమవుతాయని, ఫలితంగా జిల్లా అభివృద్ధికి వీలు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సుమారు ఏడాది కాలం తర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఏర్పాటైంది. వరుసగా వచ్చిన ఎన్నికలలో (సర్పంచ్ మొదలు సార్వత్రిక) భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా డీపీసీ ఖరారు కాలేదు. డీపీసీ ఏర్పాటు కానందున ఏడాది క్రితం రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహిం చారు. జిల్లా పరిషత్ ద్వారా ఏటా సుమారు రూ. 25.63 కోట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్) ప్రతిపాదనలలో సైతం జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ బీఆర్జీఎఫ్ నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివద్ధికి నిధుల ప్రతిపాదన, ఆమోదం తదితర అంశాలలో కీలకంగా ఉండే డీపీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వ ం నవంబర్ 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ఎనిమిది నుంచి మొదలైన డీపీసీ సభ్యుల ఎన్నికల ప్ర క్రియ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీకి జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సభ్య కార్యదర్శిగా ఉం టారు. ప్రభుత్వం నియమించే నలుగురు సభ్యులు ఎవరనేది తేలాల్సి ఉం ది. కాగా బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. డీపీసీ స్వరూపం ఇలా డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. జడ్పీ చైర్మన్ సారథ్యం వహిస్తారు. కలెక్టర్ కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. ఇటీవల ఎన్నికైన 24 మంది సభ్యులకు తోడు మరో నలుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. మొత్తం 24 స్థానాలలో 21 స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ప్రభుత్వం నామినేట్ చే సే నలుగురిలో ముగ్గురు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగినవారు, ఒకరు మైనార్టీకి చెందినవారుంటారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాల్సిన మూడు స్థానాలలో మాజీ సర్పంచులనుగానీ, మాజీ ఎంపీపీలనుగానీ, తదితర కేడర్‌కు చెందినవారినిగానీ నియమించే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో ఎంపికయ్యేందుకు పలువురు పైరవీలు షురూ చేశారు. రెండు మూడు రోజులలో సభ్యుల నియామకం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. డీపీసీ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. సభ్యులకు నియామక పత్రాలు ఇందూరు : నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ నియామకపత్రాలు అందజేశారు. మహ్మద్ షకీల్ అహ్మద్, విశాలినీరెడ్డి, లలిత, బోండ్ల సుజాత, గడ్డం సుమనారెడ్డి, నేనావత్ కిషన్, అయిత సుజ, విమల వెల్మల, సామెల్ చిన్నబాలి నియామకపత్రాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన డీపీసీ సభ్యులకు కమిటీ స్వరూపం ఏమిటీ? కమిటీ ఏం చేస్తుంది? సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారికి గల అధికారాలపై వారం రో జులలో శిక్షణా తరగతులు నిర్వహించాలని జడ్పీ సీఈఓ రాజారాంను ఆదేశించారు. దీంతో సభ్యులకు డీపీసీపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని పేర్కొ న్నా రు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
‘డీపీసీ’లో బడంగ్‌పేట నుంచి ముగ్గురు
సరూర్‌నగర్: రంగారెడ్డి జిల్లా ప్రణాళికా సంఘం (డీపీసీ)లో బడంగ్‌పేట నగర పంచాయితీ నుంచి ముగ్గురు వార్డు కౌన్సిలర్లకు సభ్యులుగా అవకాశం దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ స్థానంలో నామినేషన్ వేసిన 3వ వార్డు కౌన్సిలర్ పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి (బడంగ్‌పేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 13వ వార్డు కౌన్సిలర్ యాతం శ్రీశైలం యాదవ్ (నాదర్గుల్) కూడా కాంగ్రెస్ పార్టీ తరుఫున బీసీ కోటా కింద బరిలో ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఓటింగ్‌ను ఎదుర్కొన్నారు. మొత్తం 119 ఓట్లకు గాను 101 ఓట్లు పోలయ్యాయి. అందులో శ్రీశైలం యాదవ్‌కు 85 ఓట్లు రావడంతో సభ్యుడిగా ఎన్నికైనట్లు సీఈవో ప్రకటించారు. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి జనరల్‌లో పోటీ చేసిన 15వ వార్డు కౌన్సిలర్ ఈరెంకి వేణుగౌడ్ (మామిడిపల్లి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చక్రం తిప్పిన మాజీ హోంమంత్రి సబిత.. కాంగ్రెస్ పార్టీనుంచి పోటీలో ఉన్న 3,13 వార్డుల సభ్యులు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం శ్రీశైలం యాదవ్‌లను జిల్లా ప్రణాళికా సంఘం సభ్యులుగా గెలిపించుకునేందుకు మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవం చేయడంతోపాటుయాతం శ్రీశైలం యాదవ్ పోటీలో ఉన్నప్పటి కీ ఇతర పార్టీల నాయకులతో మాట్లాడి ఒప్పించి గెలిపించడం విశేషం. గెలుపునకు సహకరించిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్,జడ్పీ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు పార్టీలకతీతంగా ఎన్నికకు సహకరించిన బడంగ్‌పేట నగర పంచాయితీ 20 వార్డుల కౌన్సిలర్లకు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం శ్రీశైలంయాదవ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అనందం వచ్చేసింది. మాజీ హోంమంత్రి తిరిగి సరూర్‌నగర్, బడంగ్‌పేట నగర పంచాయితీ పై దృష్టిపెట్టి తన వాళ్లకు మద్దతుపలికి గెలిపించుకోవడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ బడంగ్‌పేట నగర పంచాయితీ కౌన్సిల్ నుంచి ఒకేసారి ముగ్గురు కౌన్సిలర్లకు జిల్లా ప్రణాళికా సంఘంలో సభ్యులుగా చోటు దక్కడంపై చైర్మన్ సామ నర్సింహగౌడ్, వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర ్భంగా వారు మాట్లాడుతూ.. నగర పంచాయితీలో ప్రధానంగా ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి, అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న సమస్యలను జిల్లా ప్రణాళికా సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యో విధంగా కృషిచేయాలని కొత్తగా ఎన్నికైన ప్రణాళికా సంఘం సభ్యులను వారు కోరారు. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట నగర పంచాయితీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని వారిని కోరారు. -
డీపీసీ...లైన్‌క్లియర్
నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికకు లైన్‌క్లియర్ అయ్యింది. జెడ్పీటీసీ సభ్యుల కోటాలో 20 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కౌన్సిలర్ల కోటాలో రెండుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ సభ్యుల నడుమే పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ కుదిరిన అవగాహన మేరకు జెడ్పీటీసీ కోటాలో కాంగ్రెస్-13, టీఆర్ఎస్-7 స్థానాలు పంచుకున్నాయి. అయితే జెడ్పీటీసీ సభ్యుల కోటా బీసీ మహిళా కేటగిరీలో 3 స్థానాలుండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కుదిరిన అవగాహన మేరకు కాంగ్రెస్‌కు రెండుస్థానాలు, టీఆర్ఎస్కు ఒక స్థానం అనుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నిడమనూరు జెడ్పీటీసీ సభ్యురాలు అంకతి రుక్మిణి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ మూడు స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. కౌన్సిలర్ల కోటాలో...పోటాపోటీ కౌన్సిలర్ల కోటాలో నాలుగు స్థానాలుండగా, ఎస్పీ మహిళా కేటగిరిలో మిర్యాలగూడ కౌన్సిలర్ వెంకమ్మ(కాంగ్రెస్), జనరల్ మహిళా కేటగిరిలో పి.వనజ(టీఆర్ఎస్) ఏకగీవ్రమయ్యారు. అయితే వనజ సూర్యాపేట మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి గెలిచి తదనంతర పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక మిగిలిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ కౌన్సిలర్ మధ్యే తీవ్రపోటీ నెలకొంది. బీసీ జనరల్ స్థానానికి నలుగురు సభ్యులు పోటీపడుతుండగా, దీంట్లో ముగ్గురు కాంగ్రెస్‌పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ కౌన్సిలర్. జనరల్ కేటగిరిలో ఆరుగురు బరిలో ఉండగా, ఇందులో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరిది బీజేపీ. నల్లగొండ, కోదాడ మునిసిపాలిటీల్లో కా ంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల దృష్ట్యా పోటీ అనివార్యమైంది. అయితే పోటీ అనివార్యమైనప్పటికీ ఒక స్థానం నల్లగొండకు, రెండోస్థానం దేవరకొండకు దక్కేవిధంగా రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు ఎన్నిక.. కౌన్సిలర్ కోటాలో మిగిలిన రెండు స్థానాలకు బుధవారం కలెక్టరేట్లో ఉదియాదిత్య భవన్లో ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక ఉంటుంది. ఐదు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం మొత్తం 210 కౌన్సిలర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు ఫొటోగుర్తింపు కార్డులు, కౌన్సిలర్లుగా ఎన్నికైన సమయంలో ఇచ్చిన ధృవీకరణ పత్రాలు, మునిసిపల్ కమిషనర్ నుంచి గుర్తింపుపత్రం తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఎన్నికకు మునిసిపల్, నగర పంచాయతీల కమిషనర్లు హాజరుకావాలని జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు వీరే.. ఎస్సీ జనరల్ : ఎస్.బసవయ్య , ఎం.యాదయ్య ఎస్సీ మహిళ : వై.నాగమణి పి.సంపత్రాణి ఎస్టీ మహిళ : బి.మంజుల, భూక్యా నీల ఎస్టీ జనరల్ : కె. శంకర్ బీసీ మహిళ : ఎస్.ఉమ , జె.వసంత, కె.కమలమ్మ బీసీ జనరల్ : ఎన్. శ్రీనివాస్‌గౌడ్, ఎం.శ్రీనివాస్, బి.పరమేశ్వర్, పి.కోటేశ్వరరావు జనరల్ మహిళ : టి. స్పందనరెడ్డి, ఈ. శ్వేత, ఆర్.చుక్కమ్మ జనరల్ కేటగిరి : ఎం.రామకృష్ణారెడ్డి, కె.లింగారెడ్డి, ఎన్.రాజిరెడ్డి -
ఎట్టకేలకు...
నీలగిరి :వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొంతకాలంగా వివిధ కారణాల దృష్ట్యా వాయిదాపడుతూ వస్తున్న జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం(డీపీసీ) బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10గంట లకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్జీఎఫ్లకు సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో గుర్తించి పంపిన ప్రతి పాదనలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారు. జెడ్పీచెర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరుకానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బీఆర్జీఎఫ్ కింద జిల్లాకు 33 కోట్ల రూపాయలు కేటాయించారు. అభివృద్ధికి పెద్దపీట బీఆర్జీఎఫ్ పథకం ఏడేళ్లుగా అమలవుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాకు రూ. 190 కోట్లు కేటాయించారు. అయినా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం పూర్తికాకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.33 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామ, మండల పరిషత్, జెడ్పీల నుంచి అంగన్వాడీ భవనాలు, మురికికాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి సౌకర్యం, పశువైద్యశాలల మిగులు పనులు, పాఠశాలల అదనపు తరగతి గదులు, మండల పరిషత్ భవనాల మిగులు పనులు, గ్రామ పంచాయతీ భవనాల మిగులు పనులుతో కలిపి ప్రణాళిక రూపొందించారు. అంతేగాక మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు చెందిన సొంత నిధులు రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘బీఆర్జీఎఫ్ పనులకు డీపీసీ ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టస్థాయిలో జరిగే సమావేశానికి కూడా పంపిస్తాం. అక్కడా ఆమోదం లాంఛనమే. అదే రోజున 14 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా ఉంది. ఈ సమావేశానికి జెడ్పీచైర్మన్ హాజరవుతారు. జిల్లాకు సంబంధించి సీపీడబ్ల్యూఎస్ పథకాలపై చైర్మన్ సలహాలు, సూచనలు ఇస్తారు.’’ నిధుల పంపకం.. బీఆర్‌జీఎఫ్‌లో భాగంగా జిల్లాపరిషత్ కోటా రూ.6 కోట్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు కేటాయించారు. ఎంపీలకు 10 లక్షల రూపాయలు, ఎమ్మెల్యేలకు 5 లక్షల రూపాయలు, జెడ్పీటీసీలకు 7 లక్షల రూపాయలు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ 20 లక్షల రూపాయల నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులను ఆయా ప్రజాప్రజానిధులు తమ ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.