తాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళతా
చిత్తూరు (టౌన్): జిల్లాలో తాగునీటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీరామనేని గీర్వాణి అన్నారు. మంగళవారం ఆమె జెడ్పీ కార్యాలయంలోని తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న తిరుపతి లో 14వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో నిర్వహించనున్న సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్రానికి చెందిన పలువురు ఉ న్నతాధికారులు పాల్గొననున్నారని చె ప్పారు. ఆ సందర్భంగా తాగునీటి స మస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి ప రిష్కారానికి తగిన నిధులిమ్మని కోరనున్నట్టు చెప్పారు.
ఇప్పటికే జెడ్పీ నుంచి రూ.13 కోట్లు, కలెక్టర్ మం జూరు చేసిన రూ.4.8 కోట్లు పూర్తిగా ఖర్చయినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. తాగునీటి సమస్య తీరాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అదనపు నిధులు విడుదల కావాల్సిందేనన్నారు. జిల్లాలోని కురబలకోట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో జెడ్పీటీసీ సభ్యుల నుంచి వినతులందాయన్నారు. కార్వేటినగరం డైట్ కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రిన్సిపాల్ తమను కలిసి వినతిపత్రాన్ని కూడా అందజేశారని చెప్పారు.
కళాశాలలో భవనాల మరమ్మతులు, లోపల రోడ్ల నిర్మాణం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నామన్నారు. జిల్లాలో నీరు-చెట్టు పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రస్తుతం జిల్లాలో అవకాశమున్న మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని కోరారు. వర్షాలు కురిసిన తర్వాత జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె వివరించారు.