నరసన్నపేట : బుచ్చిపేట ఇసుక ర్యాంపును అధికారులు మంగళవారం మూసివేశారు. నరసన్నపేట ఎస్‌ఐ ఎన్ లక్ష్మణ తోపాటు రెవెన్యూ సిబ్బంది వెల్లి ర్యాంపును క్లోజ్ చేస్తూ రోడ్డు మార్గంలో ట్రెంచ్‌లు తవ్వించారు. బోర్డులు పెట్టారు. రెండు రోజులుగా గ్రామస్తులు ఇసుక ర్యాంపుపై ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం మైన్స్ అధికారులకు పరిశీలించమని సోమవారం ఆదేశించారు. ర్యాంపులో అనుమతికి మించి ఇసుక తవ్వకాలు జరిగాయని ప్రస్తుతం తవ్వేందుకు అనుకూలంగా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై ర్యాంపును మూసి వేశామని ఎస్‌ఐ హెచ్చరించారు.
బుచ్చిపేట ఇసుక ర్యాంపు మూసివేత
Published Tue, Mar 29 2016 11:47 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement