సాక్షి, అమరావతి : మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేదవ్యాస్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు అందజేశారు. బందరు అభివృద్ధి, పోర్టు భూ సేకరణ తదితర వ్యవహారాలు చక్కదిద్దేందుకు 2016లో ప్రభుత్వం ముడా శాఖను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాలన, అభివృద్ధిపరమైన వ్యవహారాలు చూసుకునేందుకు డెప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారిని వైస్ చైర్మన్‌గా నియమించారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకుడైన వేదవ్యాస్‌ను ముడా చైర్మన్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment