సాక్షి, కర్నూలు: ఉదయం 11:40 గంటలకు : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువును సందర్శించారు.
11:50 : ఆత్మకూరు మండలం సంజీవనగర్ తండా చేరుకుని రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండావాసులు సావిత్రి, కోటి బాయి అనే మహిళలు జగనన్నా! మా పొలాలకు నీళ్లు వచ్చేలా చూడన్నా!.. అంటూ మొర పెట్టుకున్నారు.
మధ్యాహ్నం 12 : ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు.
12:10 : క్రిష్ణాపురం చేరుకుని అక్కడ ఆయన కోసం వేచివున్న కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. పాపన్న అనే వికలాంగుడు పింఛన్ ఇవ్వడం లేదని, వైఎస్సార్ హయాంలో 1వ తేదీనే పింఛన్ అందజేసేవారని, ప్రస్తుతం 10వ తేదీ దాటినా ఇవ్వడం లేదని వాపోయారు. జగన్ స్పందిస్తూ సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు.
1 గంట : క్రిష్ణాపురం నుంచి బయలుదేరి ఆత్మకూరుకు చేరుకున్నారు. రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆత్మకూరు సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
1:45 : కరివేనకు చేరుకున్నారు. అక్కడ తన కోసం వేచివున్న ప్రజలతో మాట్లాడారు.
1:55 : ఎర్రగూడూరులో అరగంట పాటు భోజన విరామం తీసుకున్నారు.
2:55 : బానకచెర్ల క్రస్ట్ గేట్లను సందర్శించారు.
3:10 : బానకచెర్లలోని ఎస్‌ఆర్‌బీసీ కాల్వ పనులను పరిశీలించారు.
3:40 : బానకచెర్ల రెగ్యులేటరీ కెనాల్ కాంప్లెక్స్ వద్ద రైతులతో ముఖాముఖి. అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు.
5:00 : పాములపాడుకు చేరుకున్నారు.
6:30 : రుద్రవరం, జూటూరు, కృష్ణారావుపేట మీదుగా బన్నూరుకు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
6:55 : పోతిరెడ్డిపాడుకు చేరుకున్నారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రాజెక్టును పరిశీలించారు.
7:10 : పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు.
7:40 : పోతిరెడ్డిపాడు నుంచి నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు.
8:40 : నందికోట్కూరు చేరుకున్నారు.
9:00 : మల్యాల చేరుకున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌పనులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
బస్సు యాత్ర సాగిందిలా...
Published Sat, Apr 18 2015 2:51 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement