
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే ఐజయ్య, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
కర్నూలు / జూపాడుబంగ్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మండలంలోని 80 బన్నూరు గ్రామంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు బాబు నేడు కపట రాజకీయాలు చేస్తున్నారన్నారు. అడ్డంగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకుడు చంద్రమౌళి, లాయర్ సత్యంరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment