Siddharth Reddy
-
క్రీడారంగం అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ: బైరెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్: చదువులకు పిల్లలు దూరమవుతారనే దురభిప్రాయంతో క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం లేదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడలతో జీవితాలు బాగుపడుతాయనే విషయంపై సమాజంలో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంత క్రీడా మైదానంలో జిల్లాలోని 36 సాఫ్ట్‌బాల్ క్లబ్బులకు సోమవారం క్రీడా సామగ్రిని ఆయన అందజేసి, మాట్లాడారు. క్రీడలకు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో రాష్ట్రంలో క్రీడారంగం వెనుకబడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అనంతరం సీనియర్ ఫుట్‌బాల్ కోచ్ విజయభాస్కర్ రచించిన ‘ఫుట్‌బాల్ క్రీడా ప్రాథమిక భావన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సాయికృష్ణ, సాఫ్ట్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి, కేశవమూర్తి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బైరెడ్డితో పీఈటీ అసోసియేషన్ భేటీ.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డిని జిల్లా స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ అసోసియేషన్ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందించాలని కోరారు. బైరెడ్డిని కలిసిన వారిలో నరసింహారెడ్డి, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, కాశీవిశ్వనాథరెడ్డి ఉన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు అనంతపురం సెంట్రల్: పార్టీ అభ్యున్నతికి శ్రమించే కార్యకర్తలకు వైఎస్సార్సీపీలో తగిన గుర్తింపు ఉంటుందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సోమవారం అనంతపురానికి విచ్చేసిన ఆయన అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 శాతం నామినేటెడ్ పదవులు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని, మహిళలకూ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోనే సంక్షేమ ఫలాలను అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. -
ప్రతి జిల్లాలో టోర్నమెంట్ లు నిర్వహిస్తా : బైరెడ్డి
-
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతాను. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. సిద్ధార్థరెడ్డికి నామినేటెడ్ పోస్టు.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవిని ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. చదవండి: AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సయమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: AP Nominated Posts List 2021: ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే.. ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. -
దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలు : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నరసరావుపేట: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రధాన ప్రతిపక్షాలు దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని క్రీడల స్టేడియంలో నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వేలాది మంది రైతన్నలను ఉద్దేశించి సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు. ఎన్నికలను రద్దుచేయాలని కోరుకోవట్లేదని కేవలం వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తాము ఎన్నికలకు భయపడుతున్నామంటూ కొన్ని పక్షాల నాయకులు చేస్తున్న ప్రచారం ఏమాత్రం వాస్తవంకాదన్నారు. భయమనే పదమే వైఎస్.జగన్‌కు తెలియదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ పౌరుషం, మాట నిలబెట్టుకోవటం, అభిమానం చూపించటంలో పలనాడు, రాయలసీమకు పోలిక ఉందన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన సిద్ధార్థరెడ్డిపై చూపిస్తున్న అభిమానం అలాంటిదన్నారు. కులాలు, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారంటే ఆ పారీ్టకి ప్రజల్లో అభిమానం లేకపోవటమే కారణం అన్నారు. టీడీపీకి మనుగడలేదనే భావనతో దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు తెరతీశారన్నారు. సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శాలువా కప్పి సత్కరించారు. మార్కెట్‌యార్డు చైర్మన్ ఎస్.ఏ.హనీఫ్, నాయకులు మిట్టపల్లి రమే‹Ù, కపలవాయి విజయకుమార్, వ్యవసాయ బోర్డు మెంబరు చల్లా నారపరెడ్డి, ఇప్పల దానారెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, కనక పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘జార్జ్ రెడ్డి’ పోస్టర్ రిలీజ్
చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . ఈ చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘జార్జ్ రెడ్డి’చిత్ర పోస్టర్ రిలీజ్
-
ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే..
సాక్షి, కర్నూలు : ‘‘నేను పార్టీ మారుతున్నట్లు ‘పచ్చ’ మీడియాతో ఓ వర్గం నాయకులు ప్రచారం సృష్టించారు. ఊపిరి ఉన్నంత వరకు నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, జగనన్నతోనే నడుస్తాను’’ అని వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు, ఎమ్మెల్యే ఆర్థర్‌కు విభేదాలున్నాయని ప్రచారం చేస్తున్నారు, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. తనకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారని, పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్న తపన తనదని, అయితే కొందరు నందికొట్కూరులో పెత్తనం చెలాయిస్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి..మూడు నెలలైందని, తాను రెండు నెలలు నియోజకవర్గంలోనే లేనని, ఆధిపత్యం ఎలా చెలాయిస్తానని ప్రశ్నించారు. అధికారులు ఎవరికీ ఫలాన పని చేయాలంటూ ఫోన్ చేసిన సందర్భాలు లేవన్నారు. తనపై తెర వెనుక భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను దళిత వ్యతిరేకి అనే ప్రచారం చేయొచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, కుటుంబ సభ్యులను, తన వెంట ఉండే కార్యకర్తలనూ ఇబ్బందులకు గురి చేశారన్నారు. మిడుతూరు మండలానికి హంద్రీ–నీవా నీరు తీసుకురావడం, శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ నంబర్ 98 కింద ఉద్యోగాల కల్పన, మున్సిపాలిటీలో పెంచిన పన్ను భారాన్ని తగ్గించడం, నందికొట్కూరు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడం.. తన ముందున్న లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ కోసం సమష్టిగా పని చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. -
చంద్రబాబువి నీచ రాజకీయాలు
కర్నూలు / జూపాడుబంగ్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మండలంలోని 80 బన్నూరు గ్రామంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు బాబు నేడు కపట రాజకీయాలు చేస్తున్నారన్నారు. అడ్డంగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకుడు చంద్రమౌళి, లాయర్ సత్యంరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి
సాక్షి, కర్నూలు : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా సిద్ధార్ధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్సీపీ లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తున్నారన్నారు. కనీసం నియోజకవర్గంలో ప్రజలకు ఫెన్షన్లు కూడా రావడం లేదన్నారు. కాగా, ఈ నెల 7 వ తేదిన వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. -
ఆమెకు అన్నీ తానే...
ఆదర్శం ఆమె పేరు శోభ. సాధారణ గృహిణి... ఆమెకు పెళ్లయి పాతికేళ్లయింది. పదిహేడేళ్లుగా ఆమె మంచం దిగనే లేదు. ప్రమాదం ఆమె వెన్నును విరిచేసింది... విధి ఆమెను పరిహసించింది. నాతి... చరామి... అని పెళ్లి నాడు చేసిన బాసను గుర్తు చేసుకున్నాడామె భర్త.ఉద్యోగాన్ని వదిలేశాడు... భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తన బాధ్యత అనుకున్నాడు. భర్త అంటే ఇంత బాధ్యతగా ఉండాలని చెబుతున్నాడు సిద్ధరామ్‌రెడ్డి. మెదక్ జిల్లా పర్వతాపూర్ గ్రామానికి చెందిన సిద్ధ్దరామ్రెడ్డి, కామారెడ్డి పట్టణానికి చెందిన శోభను సరిగ్గా పాతికేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉద్యోగరీత్యా కామారెడ్డిలోనే స్థిరపడ్డాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. శోభ ఇంటి వద్దే ఉంటూ కొడుకును చూసుకునేది. దాదాపుగా ఏడెనిమిదేళ్లపాటు హాయిగా ఉన్నారు. విధి వీరి జీవితంలో పిడుగు వేసింది. అది 2000 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ. ఆ దంపతులకు చేదు అనుభవం మిగిల్చిన రోజది. సాయంత్రం ఇంటి డాబా మీద ఏదో పనిచేస్తూ ఉంది శోభ. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేశారు. ఐదు లక్షలకు పైగా ఖర్చయింది. కానీ విరిగిన వెన్నును మామూలు చేయడం సాధ్యం కాదన్నారు. ఇక ఆమె లేచి నడవడం జరిగేపని కాదని తేల్చేశారు. తనతోపాటు ఏడడుగులు నడిచిన సహధర్మచారిణి ఇక నడవలేదని తెలిసి సిద్ధరామ్‌రెడ్డి తల్లడిల్లిపోయాడు. కన్నీళ్ల పర్యంతమవుతున్న శోభ కన్నీళ్లు తుడిచి తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే సిద్ధరామ్‌రెడ్డి భార్య కోసం తన ఉద్యోగానికి స్వచ్చంద విరమణ చేశాడు. కొంతకాలం పాటు అటు ఉద్యోగానికి వెళ్లడం, తిరిగి వచ్చి ఆమెకు సేవలు చేయడం ద్వారా అలసట తీవ్రమైన అలసటకు లోనయ్యేవాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి భార్యతోనే ఉంటున్నాడు. శోభను చేతులతో లేపి వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకెళతాడు. ఒక మోస్తరుగా కోలుకున్న తర్వాత శోభ భర్త వంట చేసి పెడితే తిని కూర్చోవడానికి మనసొప్పడం లేదని, తానే వంట చేస్తానని పట్టుపట్టింది. శోభ మంచం వద్దనే గ్యాస్ స్టౌను ఏర్పాటు చేయగా, ఆమె మంచం మీద కూర్చునే వంట చేస్తోంది. భర్త అన్ని సామాన్లను అందిస్తుంటే వంట పెడుతుంది. ఇంటికి ఎవరు వెళ్లినా చాయ్ చేసి తాగిన తర్వాత కానీ పంపించదు. కొడుకుని పెంచి పెద్ద చేశాడు... శోభకు ప్రమాదం జరిగేటప్పటికి కొడుకు వంశీ సాయికి రెండున్నరేళ్లు. అప్పటి నుంచి కొడుకు ఆలనా, పాలనా అంతా సిద్ధరామ్‌రెడ్డి చూసుకునేవాడు. వంశీ సాయి ఇప్పుడు జలంధర్‌లోని ఎన్ఐటీ (నిట్)లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగం సంపాదిస్తే తమకు ఆర్థిక కష్టాలు కూడా తీరుతాయని ఆ దంపతులు ఆశతో ఉన్నారు. ఇంట్లో తల్లి పరిస్థితి, తండ్రి కష్టాలను చూసిన వంశీ పట్టుదలతో చదివి నిట్‌లో సీటు తెచ్చుకున్నాడని వారు చెబుతున్నారు. అదే నాకు జరిగితే! మంచానికే పరిమితమైన శోభకు ధైర్యాన్నిస్తూ ఆమెకు అన్నీ తానై సేవలు చేయసాగాడు సిద్ధరామ్‌రెడ్డి. గడచిన పదిహేడేళ్లుగా సపర్యలు చేస్తూనే ఉన్నాడు. భార్య మంచాన పడడంతో బంధువులందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోవాలనే సలహా ఇచ్చారు, ఒత్తిడి చేశారు. కాని ఆయన ససేమిరా అన్నాడు. ‘ఆమెకు అలా అయ్యిందని రెండో పెళ్లి చేసుకోమంటున్నారు. అదే నాకు జరిగి ఉంటే ఏమనేవారు’ అని వారిని ఎదురు ప్రశ్నించేవారాయన. భార్య కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. జీవచ్ఛవంలా పడి ఉన్న భార్యకు అన్ని సేవలు చేస్తూ ఆత్మసై ్థర్యాన్ని నింపాడు. అవస్థలతో ఈ బతుకే ఎందుకనుకున్న శోభకు మనోధైర్యాన్నిచ్చి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. శోభ ఇప్పుడు తనలాంటి సమస్యతో నడవలేని వారెందరికో మనోధైర్యాన్నిచ్చే స్థాయికి ఎదిగింది. వెన్ను సమస్యతో మంచం పట్టిన వారి నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి వారికి ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని నింపుతోంది. ఆయన త్యాగం గొప్పది నా వెన్ను విరిగి మంచం పడితే అందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోమని వెంట పడ్డారు. కాని ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. అంతేగాక రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఎంత అలసట ఉన్నా నొచ్చుకున్న సందర్భం ఒక్కటీ లేదు. పదిహేడేళ్లుగా ఆయన నాకు చేసిన సేవలు నాలుగు జన్మలెత్తినా తీర్చుకోలేనివి. మా బాబుని ఆయనే పెంచి పెద్ద చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చలించిపోలేదు. నా కోసం ఎన్నో భరించాడు. – శోభ అది నా బాధ్యత... నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి కష్టాలపాలైతే ఆమెను అలాగే వదిలేయడం ఎలా? అలాంటి ఇబ్బంది భర్తకు ఎదురైతే భార్యే అన్నీ చూస్తుంది. మరి భార్యకు కష్టం వస్తే చూసుకోవలసింది భర్తే కదా. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా. ఆమె ధైర్యంగా ఉండడమే నాకు సంతోషం. – సిద్దరాంరెడ్డి, శోభ భర్త సిద్ధరామ్‌రెడ్డి... పేరు చెప్పగానే తెలిసిన వాళ్లంతా ‘‘ఆయన అందరిలా కాదు. ఆదర్శ భర్త. నేటి తరం ఆయన్ను చూసి నేర్చుకోవాలి’’ అంటారు. భార్యభర్తల బంధం ఇలా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడు–నీడ అంటే అర్థం ఏమిటో ఈ దంపతులను చూస్తే తెలుస్తుంది. వీళ్లను చూస్తే వివాహ బంధం విలువ తెలుస్తుంది. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి భార్యతో సిద్దరాంరెడ్డి -
సువర్ణపాలన అందిస్తాం
లింగంపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సువర్ణపాలన అందిస్తారని ఎల్లారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి పెద్దపట్లో ల సిద్ధార్థరెడ్డి అన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రజ లు సహకరించాలన్నారు. ఆయన లింగంపేటలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. బడుగుబలహీన వర్గాలు, పేదప్రజల అభ్యునతికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాటు పడ్డారని, ఆయన ఆశయ సాధన కోసమే యువనేత జగన్మోహన్రెడ్డి పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చారని ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మర్చిపోకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లువేసి ప్రజలు తమ నిజాయితీని చాటుకోవాలని అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా యువనేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వ్యవసాయరంగానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, అమ్మఒడి పథకం, వృద్ధులకు పింఛన్ పెంపు తదితర సంక్షేమ పథకాలపై జగన్ సీఎం అయితే తొలి సంతరం చేస్తారని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎల్లారెడ్డి నియోజకవర్గన్నా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆయనవెంట పార్టీ మండల కన్వీనర్ విఠల్, బుజ్జాగౌడ్, లక్ష్మయ్య, దేవగౌడ్ తదితరులున్నారు.