
సువర్ణపాలన అందిస్తాం
లింగంపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సువర్ణపాలన అందిస్తారని ఎల్లారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి పెద్దపట్లో ల సిద్ధార్థరెడ్డి అన్నారు.
పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రజ లు సహకరించాలన్నారు. ఆయన లింగంపేటలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. బడుగుబలహీన వర్గాలు, పేదప్రజల అభ్యునతికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాటు పడ్డారని, ఆయన ఆశయ సాధన కోసమే యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చారని ఆయన స్పష్టం చేశారు.
రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మర్చిపోకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లువేసి ప్రజలు తమ నిజాయితీని చాటుకోవాలని అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా యువనేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వ్యవసాయరంగానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, అమ్మఒడి పథకం, వృద్ధులకు పింఛన్ పెంపు తదితర సంక్షేమ పథకాలపై జగన్ సీఎం అయితే తొలి సంతరం చేస్తారని ఆయన అన్నారు.
వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎల్లారెడ్డి నియోజకవర్గన్నా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆయనవెంట పార్టీ మండల కన్వీనర్ విఠల్, బుజ్జాగౌడ్, లక్ష్మయ్య, దేవగౌడ్ తదితరులున్నారు.