
బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి.
సాక్షి, కర్నూలు : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్బంగా సిద్ధార్ధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్‌సీపీ లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తున్నారన్నారు. కనీసం నియోజకవర్గంలో ప్రజలకు ఫెన్షన్లు కూడా రావడం లేదన్నారు. కాగా, ఈ నెల 7 వ తేదిన వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.