
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో కేబుల్ టీవీ, ఇంటర్నట్ సేవలు నిలిచిపోయాయి. నిన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ వద్ద కేబుల్ వైర్లు తెగిపోయినందువల్లే కేబుల్ ప్రసారాలు నిలిచిపోయినట్లు కేబుల్ సిబ్బంది చెబుతున్నారు. అయితే జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన నిజానిజాలు తెలియకుండా కేబుల్ ప్రసారాలు నిలిపివేయించినట్లు వైఎస్సార్ సీపీ అభిమానులు, ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment