సెల్‌టవర్ ఎక్కిన కాల్‌మనీ బాధితుడు | call money victim protests on cell tower in guntur district | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్ ఎక్కిన కాల్‌మనీ బాధితుడు

Published Mon, Dec 21 2015 2:04 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

call money victim protests on cell tower in guntur district

మంగళగిరి: గుంటూరు జిల్లాలో ఓ కాల్‌మనీ బాధితుడు సోమవారం ఓ సెల్ టవర్ ఎక్కాడు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన సత్యంబాబు స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి రూ.60వేలు వడ్డీకి తీసుకుంటే రూ.1.20 లక్షల వరకు వసూలు చేయడంతోపాటు, తన ఇంటిని తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇల్లు తనకు ఇప్పించాలని లేకుంటే సెల్‌టవర్ పైనుంచి కిందకు దూకుతానని బాధితుడు హెచ్చరించాడు. ఈ పరిణామంతో అతడి భార్య.. తన భర్తను రక్షించాలంటూ పోలీసులను ప్రాధేయపడింది. పోలీసులు సత్యంబాబుకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement