
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నరసాపురం నీటి కాలువలోకి కాలువలోకి కారు దూసుపోవడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాధితులు కారులో కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో కాలువ నుంచి కారు సహా 3 మృతదేహాల్ని బయటకు తీశారు. మృతుల్ని యలమంచిలి మండలం కాజా గ్రామస్తులు కప్పిశెట్టి సురేశ్, చింత చిట్టెయ్య, చౌదుల కాశిగా గుర్తించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment