water canal
-
అమృత్ 2.0.. ఇంకెప్పుడో?
ఆదిలాబాద్: స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ. 95.50 కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది. ఈ పనుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిధులు సైతం మంజూరయ్యాయి. అయినా పనుల ప్రారంభంపై అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.14 నెలల క్రితం నిధుల మంజూరు..రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 2023 మే 20న నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.50 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 312ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బల్దియా కూడా తమ వాటా చెల్లించి తాగునీటి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ చేసింది.అప్పుడే పనులు ప్రారంభించాల్సి ఉండగా టెండర్ల దాఖలకు కాంట్రాక్టర్లు ఆ సమయంలో ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ పనులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చేపట్టేందుకు అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఇప్పటికి ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.టెండర్ల ప్రక్రియ పూర్తయినా..పట్టణంలోని ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉన్న పట్టణంలో కొత్తగా విలీనమైన కేఆర్కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు, రాంపూర్ వంటి కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలతో పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్లు, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏయే కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రస్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోనూ ఆయా ఆయా కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.త్వరలోనే ప్రారంభిస్తాం..అమృత్ 2.0 పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది, పదిహేను రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, పబ్లిక్ హెల్త్, ఈఈ -
చెన్నైకి తెలుగుగంగ జలాలు
రాపూరు/తిరుపతి అర్బన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగు గంగలో ప్రధాన భాగమైన కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి సోమవారం చెన్నై నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు జలాలను విడుదల చేశారు. తెలుగు గంగ చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి మూడో గేట్‌ను ఎత్తి నీటిని వదిలారు. అనంతరం హరినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నై నగర వాసులకు నీటిని విడుదల చేస్తున్నామని, సెప్టెంబర్ వరకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. జలాశయం నుంచి మొదటిసారిగా రెండో పంటకు నీరు విడుదల చేసినట్టు తెలిపారు. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు 20 టీఎంసీలు విడుదల చేస్తున్నామన్నారు. సోమశిల నుంచి కండలేరుకు వచ్చే నీటి కాలువ వెడల్పు పెంచే పనులు ప్రారంభమయ్యాయని, మూడేళ్లలో ఇవి పూర్తవుతాయని హరినారాయణరెడ్డి వివరించారు. -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
30 ఏళ్ల కృషి; ఆనంద్ మహింద్రా ఔదార్యం
పట్నా: ఊరి బాగుకోసం 30 ఏళ్లు కష్టపడి నీటి కాలువ తవ్విన బిహార్‌లోని లంగీ భుయాన్‌పై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రశంసలు కురిపించారు. భుయాన్ తవ్విన కాలువ పిరమిడ్స్, తాజ్‌మహల్ వంటిదని అన్నారు. ఆయన కృషికి చిరు బహుమానంగా ట్రాక్టర్ ఇవ్వనున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. ఆ పెద్దాయనకు తమ మహింద్రా ట్రాక్టర్‌ను అందించడం గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు. కాగా, బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి లంగీ భుయాన్.. ఆ ఊరి కొండలపై కురిసిన వాననీరు వృథా పోకుండా 30 ఏళ్ల క్రితం ఓ బృహత్తరమైన ఆలోచన చేశాడు. కొండ దగ్గర నుంచి కాలువ తవ్వి వర్షం నీరును ఊరికి తరలిద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాడు. అప్పుడు మొదలైన కాలువ తవ్వకం తాజాగా పూర్తయింది. అయితే, భుయాన్ కష్టానికి గ్రామస్తులు పెద్దగా సాయం చేయలేదు. ఒక్కడే 3 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల అతని ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే రోహిన్ వర్మ అనే వ్యక్తి భుయాన్‌ను ఆదుకోవడం ఆనంద్ మహింద్రా అదృష్టంగా భావిస్తారనుకుంటా అని ఆయన్ని ట్యాగ్ చేశాడు. (చదవండి: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?) అప్పటికే భుయాన్ గొప్పతనంపై ట్విటర్లో స్పందించిన ఆనంద్ మహింద్రా.. ఆ పెద్దాయనకు ట్రాక్టర్ ఇస్తానని రిప్లై ఇచ్చాడు. ఇదిలాఉండగా.. బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. (చదవండి: సామాన్యుడి 30 ఏళ్ల కృషి, ఆ ఊరికి వరప్రదాయిని) उनको ट्रैक्टर देना मेरा सौभाग्य होगा। As you know, I had tweeted that I think his canal is as impressive a monument as the Taj or the Pyramids. We at @MahindraRise would consider it an honour to have him use our tractor. How can our team reach him @rohinverma2410 ? https://t.co/tnGC5c4j8b -
అన్నబాటలోనే హీరో కార్తీ
తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ సామాజిక బాధ్యతల్లోనూ హీరోయిజం చూపిస్తున్నారు. ఇప్పటికే అగరమ్ ఫౌండేషన్ ద్వారా పేదప్రజలకు సాయంగా నిలుస్తున్నారు సూర్య. తమిళనాడులోని పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు విద్యారంగంలో మార్పులకు తనవంతు కృషి చేస్తున్నాడు. తాజాగా తమ్ముడు కార్తీ కూడా అన్నబాటలోనే నడుస్తూ ఓ గొప్పపనికి పూనుకున్నారు. రైతులు, గ్రామస్తుల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు 13 కిలోమీటర్ల కాలువకు మరమ్మతులు చేయించాడు. (చదవండి: వెన్నెల కిషోర్‌కు శుభాకాంక్షల వెల్లువ) అంఫెనోల్ ఓమ్నీ కనెక్టెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో.. తన ఉజావన్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులు చేపట్టాడు. తిరునల్వేలి జిల్లాలోలోని సూరవళి కాలువకు రూ.4 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించడంతో 8 చెరువులు, కుంటలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. ఆ నీటితో సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు పండించుకోవచ్చు. దాంతోపాటు 10 గ్రామాల నీటి సమస్యలూ తీరనున్నాయి. కాలువ పనులు కేవలం 21 రోజుల్లో పూర్తవడం విశేషం. ఇక చినబాబు చిత్రంలో రైతుగా కనిపించిన కార్తీ రియల్ లైప్‌లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. (చదవండి: మళ్లీ డబుల్ యాక్షన్?) -
కాలువలోకి దూసుకెళ్లిన కారు,ముగ్గురు మృతి
-
డ్రైవర్ నిద్రమత్తు!.. ముగ్గురి దుర్మరణం
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నరసాపురం నీటి కాలువలోకి కాలువలోకి కారు దూసుపోవడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాధితులు కారులో కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో కాలువ నుంచి కారు సహా 3 మృతదేహాల్ని బయటకు తీశారు. మృతుల్ని యలమంచిలి మండలం కాజా గ్రామస్తులు కప్పిశెట్టి సురేశ్, చింత చిట్టెయ్య, చౌదుల కాశిగా గుర్తించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
ఇదీ..అవినీటి చరిత్ర!
ఇది ఓ అవి‘నీటి’చరిత్ర. టీడీపీ గద్దల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. ఏదో చేస్తున్నామన్న భ్రమకల్పించి సర్వం మింగేసే యత్నం. అంచనాలు పెంచుకుని.. నేతలు పంచుకుతిన్న అవినీతి బాగోతం. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు కుప్పం ఉపకాలువ నిర్మాణాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం తన కాంట్రాక్టు సంస్థ కోసం నిబంధనలు పక్కనబెట్టింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్ కోసం కొత్త జీవోలు జారీచేసింది. అంచనాలు పెంచి ఏకంగా రూ.144.7 కోట్లను దోచిపెట్టింది. దీనిపై నేడు నిపుణుల కమిటీ జిల్లాలో పర్యటించనుంది. కుప్పం ఉప కాలువల్లో పారిన అవినీతి వరదను పరిశీలించనుంది. సాక్షి, బి.కొత్తకోట: పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లె చెరువు నుంచి కుప్పంలోని పరమసముద్రం చెరువు వరకు 143.9 కి.మీ హంద్రీ–నీవా కాలువ పనులు, మూడు ఎత్తిపోతల పథకాలు, మధ్యలో కాంక్రీటు నిర్మాణాలు పూర్తి చేయడానికి 2015లో రూ.413 కోట్లతో టెండర్లు నిర్వహించారు. టెండర్ వేసిన గాయత్రి నిర్మాణ సంస్థకు అర్హతలేదని తప్పించారు. 4శాతం ఎక్సెస్‌తో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్కే, కోయా జాయింట్ వెంచర్ టెండర్ దక్కించుకున్నాయి. పనిచేపట్టాక వెంచర్ సంస్థ పనులు పూర్తిచేసేందుకు రిత్విక్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్టు సంస్థకు పనుల్లో భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వాలన్న లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతోనే అవినీతి కథ మొదలైంది. కాంట్రాక్టర్ల ఇష్టంగా పనులు కుప్పం ఉపకాలువ పనులు దక్కించుకున్న కాం ట్రాక్టు సంస్థ డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు) మేరకు పనులు చేపట్టలేదు. తమకు అనుకూలంగా, ఇబ్బందులు లేనివిధంగా, పనిభారం తగ్గేలా వ్యవహరించింది. దీనివల్ల నిర్మాణాలు, కాలువ పొడవు తగ్గిపోయాయి. అంటే టెండర్ విలువ మేరకు పనిచేయకపోవడంతో టెండర్ విలువ తగ్గాలి. ఇక్కడ అలా జరగలేదు. పనిభారం తగ్గినా అదనం చెల్లింపుల కోసం పావులు కదిపారు. డీపీఆర్‌లో సైఫన్ కాలువలో 6 నిర్మాణాలు, 12 అక్విడెక్టులు, పనుల్లో సొరంగాల (టన్నల్) నిర్మాణం లేదు. కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం సోమాపురం వద్ద 50మీటర్లు, గుడుపల్లె వద్ద 475మీటర్లు, యామిగానిపల్లె వద్ద 50మీటర్లు, కిలోమీటర్ 108 వద్ద 50మీటర్లు, గ్యాస్ పైప్‌లైన్ వద్ద 50మీటర్ల సొరంగం పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా కొండల చుట్టూ వెళ్లాల్సిన కాలువ పొడవు 20 కిలోమీటర్ల దూరం తగ్గింది. 12 కిలోమీటర్ల పైప్‌లైన్, 45 వరకు బ్రిడ్జిలు, వాగులు, వంకలపై నిర్మాణాలు చేపట్టారు. కాలువకు సంబంధించి 1.15కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,17,345 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిచేయాలి. కాలువలో మట్టిపనికి క్యూబిక్ మీటరుకు రూ.80 చెల్లిస్తారు. అయితే గట్లమీద మట్టి పనిచేశామని అందుకు క్యూబిక్ మీటర్‌కు రూ.500 చెల్లించాలని, అదనంగా నిర్మించిన కాంక్రీటు పనులకు అదనంగా చెల్లించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. రూ.287 కోట్ల కోసం స్కెచ్ వాస్తవంగా కుప్పం ఉప కాలువ పనిలో ప్రభుత్వం నుంచి టెండర్ విలువ కాకుండా అదనంగా మరో రూ.287 కోట్లు దోచుకోవా లని పథకం వేశారు. అదనంగా మట్టి పనులు చేశామని కాంట్రాక్టు సంస్థ విన్నవించింది. ఈ విన్నపం ప్రభుత్వానికి నివేదించగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. దీనిపై ప్రాజెక్టు అధికారులు రూ.160కోట్లు చెల్లించేలా ప్రతిపాదించారు. స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ అదనపు చెల్లింపు కదరదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం మంత్రి మండలికి చేరి నిర్ణయం తీసుకునేలా చేసింది. కాంక్రీటు నిర్మాణాలకు మాత్రమే అదనం చెల్లిస్తామని ఎస్ఎల్ఎస్సీ నిర్ణయం తీసుకోగా రూ.122.75 కోట్లు మం జూరుచేస్తూ 2018 సెప్టెంబర్ 7 జీవో నంబర్ 626 జారీచేసింది. అంతటితో ఆగని కాంట్రాక్టు సంస్థలు మట్టిపనులకు అదనపు చెల్లింపుల డిమాండ్‌తో పావులు కదిపాయి. కుప్పం కాలువ పనిలో కాలువ గట్లమీద మట్టిపనులు చేశారని ప్రభుత్వం 2019 జనవరి 28న జీవో 68 జారీచేసి రూ.21.95 కోట్లున మంజూరు చేసింది. దీంతో టీడీపీ సర్కార్ అడ్డంగా అదనం రూ.144.7 కోట్లు దోచిపెట్టింది. గ్యారెంటీనే వద్దన్నారు అదనంగా రూ.144.7 కోట్లు పొందిన కుప్పం కాలువ కాంట్రాక్టర్ల వ్యవహరంపై ఉన్నతాధికారులకు నమ్మకం కుదరలేదు. నిర్ణీత గడువు 9నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. పలుమార్లు గడువు పెంచుకుంటూ వెళ్లారు. దీంతో అదనంగా పెంచిన నిధులను విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు విముఖత వ్యక్తంచేశారు. అదనం పొందినా పనులు ముందుకు సాగడం లేదు, ప్రధానంగా కాంట్రాక్టు సంస్థ తీరుపై నమ్మకం లేదని, అదనపు చెల్లింపులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ తీసుకుంటామని, పనులన్నీ పూర్తి చేశాకే అదనపు సొమ్మును చెల్లిస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. అధికారుల నివేదికను పక్కనపెట్టి కాంట్రాక్టు సంస్థ దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నారు. బ్యాంకు గ్యారంటీతో పనిలేదు. బిల్లుల మేరకు చెల్లింపులు చేయండి అంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో అధికారులు టీడీపీ ప్రభుత్వం చెప్పినట్టుగా చేయక తప్పలేదు. జీవో 32 ద్వారా వెసులుబాటు తొలుత కాంట్రాక్టు సంస్థ కోరిన అదనపు ధరలు, నిర్మాణాలపై స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ, ఐబీఎం కమిటీలు సమీక్షించి ఒప్పందం మేరకు పనులు చేయాలని స్పష్టంచేశాయి. కాంట్రాక్టర్ కోరినట్టు అదనం పెంపు సాధ్యం కాదని తేల్చేసింది. జీవో 22 జారీకి మునుపున్న పనులకు మాత్రమే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా ఈపీసీ ద్వారా నిర్వహిం చిన టెండర్లతో చేపట్టిన పనులకు అదనం, వెసులుబాటు వర్తించదు. దీంతో ఆశించింది సాధ్యంకాదని తేలిపోవడంతో ప్రభుత్వం కుప్పం ఉపకాలువ కాంట్రాక్టర్లను దృష్టిలో ఉంచుకుని ఈపీసీ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేలా కొత్తగా జీవో 32 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం మరోమారు పరిశీలించిన స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ, ఐబీఎం కమిటీలు కుప్పం కాలువ పనులకు అదనం చెల్లింపులకు ఆమోదం తెలిపాయి. పనులు చేయని కాంట్రాక్టు సంస్థను నిబంధనల ప్రకారం పనుల నుంచి తొలగించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. సొరంగం లైనింగ్ వదిలేశారు తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వెళ్లే హంద్రీ –నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ మదనపల్లె మీదుగా పుంగనూరుకు నీళ్లు చేరాలంటే 59వ ప్యాకేజీలోని సొంరంగం పనులు కీలకం. 150కిమీ నుంచి 173కిమీ వరకు కాలువ, 3కిమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసేందుకు ఏపీఆర్ కాంట్రాక్టు సంస్థ రూ.69.71కోట్లతో పని దక్కించుకుంది. 2015 నాటికి ఒప్పందం మేరకు రూ.36.92 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనుల్లో రూ.34.27 కోట్ల పనులు కాంట్రాక్టు సంస్థ నుంచి తొలగించారు. తొలగించిన పనికి సంబంధించి కాట్లాటపల్లె–రామిరెడ్డిగారిపల్లె మధ్యలో 2.5 కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజీ కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి టెం డర్లు నిర్వహించగా పనులను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు సంస్థ సొరంగం పని పూర్తిచేసినా లైనింగ్ పనుల జోలికి వెళ్లలేదు. 2.5కిలోమీటర్ల సొంరంగానికి లైనింగ్ చేయాల్సి ఉండగా కేవలం 200 మీటర్లు మాత్రమే లైనింగ్ చేశారు. మిగిలిన 2.3కిలోమీటర్లు లైనింగ్ చేయలేదు. దీనికితోడు పనులు చేసేందుకు వసతులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఎన్నికల సమయంలో పారిన కృష్ణా జలాలతో సొరంగంలో పూడిక చేరినా తొలగించలేదు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉండగా రిత్విక్ సంస్థకు మాత్రం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చూసిం ది. చేసిన పనులన్నింటీకి బిల్లులు చెల్లించేసింది. అయినప్పటికీ సొరంగానికి కీలకమైన లైనింగ్ పనుల జోలికి మాత్రం వెళ్లలేదు. -
30 మంది జలసమాధి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండ్య జిల్లాలో శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు నీటి కెనాల్లో పడింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతిచెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు కాబట్టి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బెంగళూరుకు సుమారు 105 కి.మీ దూరంలోని పాండవపుర తాలూకా కానగానమారండి వద్ద మధ్యాహ్నం బస్సు అదుపు తప్పి 12 అడుగుల లోతున్న వీసీ కెనాల్లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీటి నుంచి 30 మృతదేహాల్ని వెలికితీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల్లో 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని వాదెసముద్ర గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. పిల్లలు స్కూలు ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ సాయంతో బస్సును బయటికి లాగారు. సంఘటనా స్థలం వద్ద భారీగా గుమికూడిన స్థానికులను నియంత్రించడం పోలీసులకు కష్టమైంది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలపించిన ముఖ్యమంత్రి ఈ ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దుచేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటన జరిగిన తీరు తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పరారీలో డ్రైవర్.. కేసు నమోదు ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు. ఈ దుర్ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పాండవపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ప్రమాదానికి గురైన బస్సు మండ్యకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద 2001లో రిజిస్టరై ఉంది. 2019 వరకు బస్సుకు బీమా సదుపాయం ఉంది. బస్సు 15 ఏళ్లకు పైబడినదే కాకుండా, ఇప్పటి వరకు 8 మంది యజమానులు మారినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానిక ఆర్డీవోను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈత రావడం వల్లే బతికా.. అదృష్టం కలసిరావడంతో పాటు ఈత నేర్చుకోవడం వల్లే బతికిపోయానని గిరీశ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు కాలువలో పడి ఉండొచ్చని తెలిపాడు. తన గ్రామానికి చెందిన 15 మంది ఈ ప్రమాదంలో మరణించారన్నాడు. రోహిత్ అనే విద్యార్థిని గిరీశ్ కాపాడినట్లు తెలిసింది. కాలువలో పడిపోయిన బస్సును పైకి లాగుతున్న సహాయక సిబ్బంది కన్నీటిపర్యంతమైన సీఎం కుమారస్వామి -
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
చిత్తూరుజిల్లా: నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పీలేరు మండలంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. కాలనీలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో కలకడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ధనూస్(12), జయ(12) కాలనీ పక్కనే ఉన్న నీటికుంటవైపు వెళ్ళారు. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడిపోయి ఇద్దరూ చనిపోయారు. చిన్నారుల మృతితో స్ధానికంగా విషాదం నెలకొంది. -
కాల్వలో కొట్టుకుపోయిన దంపతులు!