చిత్తూరుజిల్లా: నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పీలేరు మండలంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. కాలనీలన్నీ జలమయం అయ్యాయి.
ఈ నేపథ్యంలో కలకడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ధనూస్(12), జయ(12) కాలనీ పక్కనే ఉన్న నీటికుంటవైపు వెళ్ళారు. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడిపోయి ఇద్దరూ చనిపోయారు. చిన్నారుల మృతితో స్ధానికంగా విషాదం నెలకొంది.