తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ సామాజిక బాధ్యతల్లోనూ హీరోయిజం చూపిస్తున్నారు. ఇప్పటికే అగరమ్ ఫౌండేషన్ ద్వారా పేదప్రజలకు సాయంగా నిలుస్తున్నారు సూర్య. తమిళనాడులోని పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు విద్యారంగంలో మార్పులకు తనవంతు కృషి చేస్తున్నాడు. తాజాగా తమ్ముడు కార్తీ కూడా అన్నబాటలోనే నడుస్తూ ఓ గొప్పపనికి పూనుకున్నారు. రైతులు, గ్రామస్తుల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు 13 కిలోమీటర్ల కాలువకు మరమ్మతులు చేయించాడు.
(చదవండి: వెన్నెల కిషోర్‌కు శుభాకాంక్షల వెల్లువ)
అంఫెనోల్ ఓమ్నీ కనెక్టెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో.. తన ఉజావన్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులు చేపట్టాడు. తిరునల్వేలి జిల్లాలోలోని సూరవళి కాలువకు రూ.4 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించడంతో 8 చెరువులు, కుంటలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. ఆ నీటితో సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు పండించుకోవచ్చు. దాంతోపాటు 10 గ్రామాల నీటి సమస్యలూ తీరనున్నాయి. కాలువ పనులు కేవలం 21 రోజుల్లో పూర్తవడం విశేషం. ఇక చినబాబు చిత్రంలో రైతుగా కనిపించిన కార్తీ రియల్ లైప్‌లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
(చదవండి: మళ్లీ డబుల్ యాక్షన్?)
Comments
Please login to add a commentAdd a comment