మదనపల్లె: కారు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి హార్సిలీహిల్స్ లోయలో పడటంతో.. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు, పోలీసులు సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.