car overturned
-
టైరు పగిలి కారు బోల్తా.. 9 నెలల బాలుడు మృతి
మెదక్: కారు పల్టీ కొట్టిన ఘటనలో 9 నెలల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన అందోల్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆదివారం నాందేడ్‌లో జరిగే ఫంక్షన్‌కు కారులో వెళ్తున్నారు. నాందేడ్, అకోలా జాతీయ రహదారిపై వెళ్తుండగా అందోల్ మండల పరిధి డాకూరు–ఎర్రారం గ్రామ శివారులోకి రాగానే వారి కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీకొట్టడంతో అందులో ఉన్న 9 నెలల బాలుడు విరాట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో ఇద్దరు క్షతగాత్రులను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. బిడ్డ మృతదేహంతో తల్లి రోదన ప్రమాదం జరిగిన వెంటనే తనకు తగిలిన గాయాలను లెక్క చేయకుండా కుమారుడి కోసం అటు ఇటు వెతికిన తల్లి చివరకు జీవచ్చవంలా పడి ఉన్న కొడుకును చూసి రోదించడం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ బీబీపాటిల్ తన కారును నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలకు ఆదేశించారు. -
హార్సిలీహిల్స్‌లో లోయలో పడిన కారు
మదనపల్లె: కారు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి హార్సిలీహిల్స్ లోయలో పడటంతో.. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు, పోలీసులు సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం రాత్రి అదపుతప్పి ఓ కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులోని ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్లే ప్రాణాపాయం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా.. ఇద్దరి మృతి
-
కారు బోల్తా.. ఇద్దరి మృతి
జగిత్యాల: కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు అదుతప్పింది. ఆ వెంటనే బోల్తాపడి కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా: టీపీసీసీ నాయకుడికి గాయాలు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర్ మండలం బాన్సువాడ క్రాస్ రోడ్డు వద్ద శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... మహేష్‌కుమార్‌ను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలిసిన తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆసుపత్రికి చేరుకుని... మహేష్‌కుమార్‌ను పరామర్శించారు. -
ఇన్నోవా కారు బోల్తా : నలుగురికి గాయాలు
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో దుర్గానగర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించి.. ట్రాఫిక్‌ను పునరుద్దురించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.