సెల్కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!! | Careful at the time of Charging to cell | Sakshi
Sakshi News home page

సెల్కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!!

Published Thu, Apr 9 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

సెల్కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!!

సెల్కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!!

పెద్దకుడుబూరు(కర్నూలు): కర్నూలు జిల్లా పెద్దకుడుబూరు మండలం మేకదోన గ్రామంలో సెల్ ఛార్జింగ్ పెడుతూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన ఖలీల్(28) గురువారం రాత్రి తన ఇంట్లో సెల్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఖలీల్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

సెల్కు ఛార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడం, షాక్ కొట్టడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. సెల్కు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement