న్యూఢిల్లీ: రైళ్లలో ఉండే మొబైల్ ఛార్జింగ్ పరికరాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలు గతంలో వచ్చినవేననీ, తాజాగా మరో సారి రైల్వే బోర్డు వీటిని జారీ చేసిందని దక్షిణ రైల్వే సీపీఆర్‌వో చెప్పారు. రైలు బోగీల్లో ఉండే చార్జింగ్ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలని గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రతిపాదించారు. ఆ సమయంలోనే బెంగళూరు–నాందేడ్ రైలులో అగ్నిప్రమాదం సంభవించడంతో అన్ని జోన్లలోనూ సెల్ ఛార్జింగ్ స్టేషన్లను రాత్రి వేళల్లో ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం)
Comments
Please login to add a commentAdd a comment