సినీ దర్శకుడు వర్మపై కేసులు | cases against ram gopal varma for comments on lord ganesh | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు వర్మపై కేసులు

Published Mon, Sep 1 2014 12:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సినీ దర్శకుడు వర్మపై కేసులు - Sakshi

సినీ దర్శకుడు వర్మపై కేసులు

సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆదివారం హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ కె.శేఖర్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘తన తలనే కాపాడుకోలేని వినాయకుడు ఇతరులను ఎలా కాపాడుతాడు.’అంటూ ట్విట్టర్‌లో రాంగోపాల్ వర్మ అభ్యంతరక వ్యాఖ్యలు చేశారంటూ శనివారం చంపాపేటకు చెందిన న్యాయవాది కె.కరుణసాగర్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 

ఈ మేరకు వర్మపై 153-ఏ, 505, 298, 504, ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ నవీన్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి, పెనుకొండ పోలీస్ స్టేషన్లలోనూ వర్మపై కేసులు నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement