‘చంద్రు’నికి ‘సన్’ స్ట్రోక్
స్టీఫెన్‌సన్‌తో సంభాషించి అడ్డంగా దొరికిన చంద్రబాబును
అరెస్ట్ చేయాల్సిందే
సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సిందే
ప్రతిపక్ష నేతల శివాలు..
టీడీపీ శ్రేణుల దిగాలు
నేడు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు,
రాస్తారోకోలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెగబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ జిల్లా ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సాగించిన బేరసారాలన్నీ ఆడియో టేపుల సాక్షిగా బట్టబయలైన నేపథ్యంలో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ నినదిస్తున్నాయి.
గతేడాది జరిగిన ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలూ గెలవడంతో టీడీపీకి పెట్టని కోటగా చెప్పుకునే ‘పశ్చిమ’ ప్రజల నుంచే ఇప్పుడు చంద్రబాబుపై తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కోసం బేరసారాలాడి చంద్రబాబు తన నయవంచన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ నేతలే కాదు సామాన్య జనం కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు సంభాషణలను ఆదివారం రాత్రి నుంచి టీవీల్లో చూస్తున్న ప్రజలు అతడి తీరును ఏవగించుకుంటున్నారు.
ఓట్ల కొనుగోళ్లకు పట్టిసీమ ఎత్తిపోతల కాంట్రాక్టులో పక్కదారి పట్టించిన సొమ్మునే వాడారన్న వార్తలు రావడంతో.. చంద్రబాబు అందుకే పశ్చిమ గోదావరి జిల్లాపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ పదేపదే పర్యటిస్తున్నారా.. అన్న వ్యంగ్య వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఆడియో టేపులతో బాబు అడ్డంగా దొరికిపోయి కేసులో ఇరుక్కోవడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తీవ్ర అసహనంతో పలుచోట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మరికొన్ని చోట్ల టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుపై కుట్ర జరిగిందంటూ ధర్నాలకు దిగారు.
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. గతంలో జార్ఖండ్ సీఎం శిబుసోరెన్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రాగా, వెంటనే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్పష్టమవుతోంది కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని అతన్ని అరెస్ట్ చేయాలి.
- ఎండీ రఫీయుల్లాబేగ్, డీసీసీ అధ్యక్షుడు
అవి బాబు మాటలే
ఓటుకు నోటు విషయంలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన నేపథ్యంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అవి బాబు మాటలుగానే అర్థమవుతోంది. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని మొత్తం ఘటనపై విచారణ జరిపించాలి. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి.
- మంతెన సీతారామ్,
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు
చంద్రబాబుకు సంకెళ్లే సరి
Published Tue, Jun 9 2015 1:45 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement
Advertisement