తుని రూరల్: కాసిని పాల కోసం ఆశపడ్డ ఆ పిల్లి.. ‘తన శత్రువులైన కుక్కలు కూడా పడకూడదురా దేవుడా!’ అనిపించేంత కష్టాల పాలైంది. చివరికి ఓ మనిషి పుణ్యంతో ‘బతుకు జీవుడా!’ అని తల దక్కించుకుంది. ఆదివారం తుని మండలం హంసవరం శివారు జిల్లేడుపాడులో ఎస్సీ కాలనీవాసులు వంటావార్పు చేసుకుని కూలి పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ ఓ పిల్లి పాల కోసం వెతుకులాడుతూ..ఓ చెంబులో తల దూర్చింది. చెంబులో తల ఇరుక్కుపోవడంతో ‘మియాం.. మియాం..’ అంటూ ఎంత గింజుకున్నా నొప్పి తప్ప విముక్తి లభించలేదు. కాసేపటికి అటుగా వెళుతున్న అప్పారావు అనే వ్యక్తి దాన్ని గమనించాడు. ‘అయ్యో! పాపం.. పిల్లి!’ అనుకుని జాలిపడ్డాడు. చెంబు పట్టుకుని పైకి లేపి, ఒడుపుగా లాగడంతో పిల్లి తలతో సహా చెంబు నుంచి జారిపడి, ఉరుక్కుంటూ పోయింది.
Comments
Please login to add a commentAdd a comment