పదో తరగతి పరీక్షల్లో అక్రమాల అదుపునకు చర్యలు
తొలిసారిగా కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత
రాయవరం/బాలాజీచెరువు(కాకినాడ) : పదో తరగ తి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు పరీక్షా కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని భావించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఆదేశాలందాయి. తొలుత అన్ని కేంద్రాల్లో వీటిని అమర్చాలనుకున్నా.. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్లే ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 70,428 మంది విద్యార్థులు 319 కేంద్రాల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,461 మంది ప్రైవేటుగా రాయనుండగా 67,967 మంది రెగ్యులర్ విద్యార్థులు. వీరిలో 35,545 మంది బాలురు, 34,968 మంది బాలికలు. పదో తరగతి పరీక్షల్లో ఏటా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పలువురు విద్యార్థులు పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిని నివారించేందుకు పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే పాఠశాల విద్యాశాఖ సీసీ కెమెరాల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దీని ప్రకారం ఎంపిక చేసిన కొన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో ఆ కేంద్రాల్లో విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలను, పరీక్ష జరుగుతున్న తీరును ఎప్పకప్పుడు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవకతవకలు చోటు చేసుకుంటే వీడియో ఫుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ఉపాధ్యాయ సంఘా లు వ్యతిరేకిస్తున్నాయి. సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు సమర్థనీయం కాదని సంఘాల నేతలు అంటున్నారు. దీని వల న విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొ నే అవకాశం ఉందని వాదిస్తున్నారు. విద్యార్థి స్థాయిని పరీక్షించేందుకు పలు రకాల పద్ధతులు ఉన్నాయంటున్నారు.
డేగ కళ్ల నిఘా
Published Fri, Feb 19 2016 12:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement