చంద్రబాబు నాయుడు
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వేట్లపాలెం నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్షా 70వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు.