ఏపి మ్యాప్ - శివరామకృష్ణన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ 187 పేజీల నివేదికను సమర్పించింది. గడువులోపలే ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిని కేంద్ర హొం శాఖ ఆమోదించింది. ఈ నివేదికను కేంద్రం ఏపి ప్రభుత్వానికి పంపుతుంది. ఈ నివేదికలో కమిటీ ఏ నగరాన్నీ రాజధాని కోసం సూచించలేదు. పలు ప్రాంతాలను సూచించింది. విజయవాడ-గుంటూరు మధ్య మాత్రం వద్దని సలహా ఇచ్చింది. రాజధానికి కావలసిన ప్రదేశం, అందుకోసం తగిన భూముల సేకరణ, ఎటువంటి భూములు సేకరించాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, హైకోర్టు, హైకోర్టు బెంచ్...తదితర అంశాలకు సంబంధించి సూచనలు చేసింది. అయిదేళ్ల ప్రత్యేక హోదా కోరడం సమంజసమేనని తెలిపింది.
కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు:
* హైదరాబాద్ మాదిరి సూపర్ రాజధాని వద్దు
* విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం మంచిదికాదు.
* విజిటిఎం పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి.
* రాజధాని నిర్మాణానికి మొత్తం పది వేల ఎకరాలు కావాలి
* రాజధాని నిర్మాణానికి 4.5 లక్షల కోట్ల రూపాయలు అవసరం.
* భూసేకరణ అలస్యమైయ్యే కొద్ది రాజధాని నిర్మాణానికి ఎక్కవ సమయం పదుతుంది.
* రాజధాని నిర్మించే ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలి
* నీటి వనరులు, రవాణా,రక్షణ, చారిత్రక అంశాలు.....ఆధారంగా రాజధాని ప్రదేశం ఎంపిక చేయాలి.
* విశాపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు.
* అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసకోవచ్చు.
* ముఖ్యమంత్రి కార్యాయలం ఉన్నచోటే హైకోర్టు ఉండవలసిన అవసరంలేదు.
* విశాఖపట్నంలో హైకోర్టు.
* రాయలసీమలో హైకోర్టు బెంచ్.
* విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి.
* విశాఖపట్నం పరిశ్రమలకు, అనంతపురం విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
* ప్రభుత్వభూములు ఉన్నచోట ఏర్పాటు చేయడం మంచిది.
* 13జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది.
* రాజధాని కోసం 15ఎకరాలు, అసెంబ్లీకి వంద ఎకరాలు అవసరం.
* వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం మంచిది కాదు.
* అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం.
* అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు
* అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం
* ఈ రెండిటి నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది
* హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిదికాదు.
ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తరువాత మంత్రి మండలి సమావేశమై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరో రెండు రోజులలో ఏపి రాజధాని ఎక్కడ అనేది తేలిపోయే అవకాశం ఉంది