లోక్‌సభలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో కుదింపు సాధ్యం కాదని రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.ఎస్.అవినాశ్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లోక్‌సభలో రాతపూర్వకంగా బదులిచ్చారు. ‘ఏపీ ఎక్స్‌ప్రెస్ 19 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు వేగం గంటకు 110 కి.మీ. మేర మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంది. అందువల్ల ప్రయాణ సమయం కుదింపు సాధ్యం కాదు. ఈ రైలు నిలిచే స్టేషన్ల సంఖ్యను తగ్గించడం, రైలును గరిష్ట వేగానికి పెంచడం వంటి అంశాల్లో సాధ్యత కనిపించలేదు’ అని పేర్కొన్నారు.
త్వరలో పట్టాలెక్కనున్న 8 కొత్త రైళ్లు: ఏపీతో సంబంధం ఉండి 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన 13 కొత్త రైళ్లలో 5 రైళ్లు పట్టాలెక్కాయని, మరో 8 రైళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలు ఎక్కాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో సభ్యుడు రాయపాటి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏపీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని కుదించలేం
Published Thu, Dec 1 2016 2:34 AM | Last Updated on Wed, Jul 25 2018 6:05 PM
Advertisement