Central Railways
-
చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్ఈడీ డిస్ప్లే, డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్ఓబీ (రెండు బోర్డులు), కంజుర్మార్గ్ రోడ్ ఆర్ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి. ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది. -
ఆ రైలుకు రెండు వైపులా ఇంజన్లు!
మనకు ఊహ తెలిసినప్పటి నుంచి రైలు అంటే ముందు ఒక ఇంజన్ ఉండి, తర్వాత బోగీలు ఉంటాయి. తాజాగా ఒక ట్రైన్‌కు మాత్రం రెండు వైపులా ఇంజన్లు అమర్చారు. పశ్చిమ రైల్వే ఈ ప్రయోగం చేసింది. బాంద్రా నుంచి ఢిల్లీలోని హజ్రత్‌నిజాముద్దీన్ వరకు వెళ్లే ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు రెండు ఇంజిన్లు అమర్చారు. భారతీయ రైల్వే చరిత్రలో ప్రయాణికుల రైలుకు రెండు ఇంజిన్లు జతచేయడం ఇదే మొదటిసారి. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాక, ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా కదిలేందుకు ఆ రెండో ఇంజన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చుకుంటే రెండు ఇంజిన్లు అమర్చిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రెండు గంటల సమయం ఆదా అవుతుందన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ఇంతకుముందు గూడ్స్ రైళ్లలో విజయవంతంగా ప్రయోగించారు. ప్రయాణికుల రైలులోనూ పుష్ అండ్ పుల్ టెక్నిక్(ముందు, వెనక ఇంజన్లు అమర్చడం)ను ప్రవేశపెట్టాలని మధ్య రైల్వే (సెంట్రల్ రైల్వే) జనరల్ మేనేజర్ డి.కె. శర్మ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రయోగాన్ని అమలు చేశారు. ‘వెనక వైపు ఇంజన్‌ను అమర్చినా... ముందువైపు ఇంజన్లో ఉన్న లోకో పైలటే రెండో దాన్ని కూడా ఆపరేట్ చేస్తాడు. వేగం, బ్రేకింగ్ విషయంలో లోకోమోటివ్స్‌ల మధ్య ఇంకా సాంకేతికతను అభివృద్ది పరచాల్సి ఉంద’ ని సెంట్రల్రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) రావినర్ భాకర్ తెలిపారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని కుదించలేం
లోక్‌సభలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో కుదింపు సాధ్యం కాదని రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.ఎస్.అవినాశ్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లోక్‌సభలో రాతపూర్వకంగా బదులిచ్చారు. ‘ఏపీ ఎక్స్‌ప్రెస్ 19 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు వేగం గంటకు 110 కి.మీ. మేర మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంది. అందువల్ల ప్రయాణ సమయం కుదింపు సాధ్యం కాదు. ఈ రైలు నిలిచే స్టేషన్ల సంఖ్యను తగ్గించడం, రైలును గరిష్ట వేగానికి పెంచడం వంటి అంశాల్లో సాధ్యత కనిపించలేదు’ అని పేర్కొన్నారు. త్వరలో పట్టాలెక్కనున్న 8 కొత్త రైళ్లు: ఏపీతో సంబంధం ఉండి 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన 13 కొత్త రైళ్లలో 5 రైళ్లు పట్టాలెక్కాయని, మరో 8 రైళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలు ఎక్కాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో సభ్యుడు రాయపాటి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచం
స్పష్టం చేసిన రైల్వే మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 110 కి.మీ. వేగంతో పయనిస్తుందని, ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమాధానమిచ్చారు. ఈ రైలు పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం వీలుపడదని తేల్చి చెప్పారు. ఏపీలోని ప్రధాన పట్టణాలను దేశ రాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్ట్‌లతో నడుస్తోందని, అందువల్ల వేగం పెంచడం, హాల్ట్‌లు కుదించడం సాధ్యపడదని వివరించారు. నాన్-ఏసీ బోగీలను కలపాలన్న వినతులు కూడా వచ్చాయని, అయితే 2014-15 బడ్జెట్లో ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో మార్చలేమని చెప్పారు. -
ఏపీకి రిక్తహస్తం!
♦ రూ.2,823 కోట్ల పనులు కేటాయింపులతోనే సరి ♦ ఏపీలో 9 కొత్త మార్గాలకు సర్వే ♦ విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు ♦ విభజన చట్టంలోని హామీలకూ కేంద్రం మొండి చెయ్యే సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రైల్వేశాఖ రిక్తహస్తం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలనూ విస్మరించింది. అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. కొత్త రైళ్ల ఊసే లేదు. రాష్ట్రానికి 2016-17లో మొత్తంగా రూ.2,823 కోట్ల మేర ప్రాజెక్టుల పనులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఏపీలో కొత్తగా 10 మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. రాష్ట్రంలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులు కేటాయించారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే చేయకపోవడం గమనార్హం. తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరీకరిస్తామని ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇలా.. యూపీఏ-2 హయాంలో సగటున ఏటా రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో సగటు రూ.2,195 కోట్లుగా ఉంది. తాజాగా రూ.2,823 కోట్లు కేటాయించారు. కొత్తగా రైల్వే మార్గాల నిర్మాణం మార్గం దూరం అంచనా(రూ.కోట్లలో) గుంతకల్లు-గుంటూరు (డబ్లింగ్) 443 4,000 గద్వాల-మాచర్ల 184 3,500 డబ్లింగ్‌కు కేటాయింపులు రూ.కోట్లలో గుత్తి-ధర్మవరం-బెంగళూరు 30 కల్లూరు-గుంతకల్లు 60 రేణిగుంట-ధర్మవరం-వాడీ బైపాస్ 75 విజయవాడ-కాజీపేట్-బైపాస్ లైన్ 27 గత మూడేళ్లుగా ఇలా.. 2014-15 రూ.1,105 కోట్లు 2015-16 రూ.2,659 కోట్లు 2016-17 రూ.2,823 కోట్లు నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు (రూ. కోట్లలో) మార్గం కేటాయింపు నంద్యాల-ఎర్రగుంట్ల 50 మాచర్ల-నల్లగొండ 0.2 గద్వాల-రాయిచూర్ 5 కాకినాడ-పిఠాపురం 50 కోటిపల్లి-నర్సాపూర్ 200 ఓబులవారిపల్లె-కృష్ణపట్నం 100 జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ 110 కడప-బెంగళూరు 58 నడికుడి-శ్రీకాళహస్తి 180 గూడూరు-దుగరాజపట్నం 5 భద్రాచలం-కొవ్వూరు 15 కంభం-ప్రొద్దుటూరు 1 -
రైల్వేస్టేషన్లలో అంబులెన్స్‌ల సౌకర్యం
సాక్షి, ముంబై : వర్షాల వల్ల ఫుట్‌పాత్‌లపై జారిపడి గాయాలైన వారి కోసం వెస్టర్న్, సెంట్రల్ రైల్వేలు అంబులెన్సులను అందుబాటులో ఉంచాయి. ఓవర్‌హెడ్ బ్రిడ్జిల వద్ద మెట్లు ఎక్కి దిగే సమయంలో ప్రయాణికులు పలు మార్లు జారి కిందపడి తీవ్ర గాయాలైన సందర్భాలు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వెస్టర్న్ లైన్ అయిన చర్చ్‌గేట్ నుంచి అంధేరి-బోరివలి, దాదర్, బాంద్రాలో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. సెంట్రల్లైన్లో మాటుంగ, సీఎస్టీ, ఘాట్కోపర్, కుర్లా వర కూ అంబులెన్సుల సౌకర్యం కల్పించారు.రైల్వే స్టేషన్లలో గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అం దజేయడంతోపాటు, తక్షణమే ఆస్పత్రులకు కూడా తరలించడానికి ఏర్పాట్లు చేసింది. చిన్న గాయాలకు ప్రథమ చికిత్స అందజేస్తామని, పెద్ద గాయాలైతే సమీప ఆస్పత్రులకు తరలిస్తామని అంబులెన్స్ డ్రైవర్ పేర్కొన్నాడు.