తోటవల్లూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా తోటవల్లూరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. సూరమ్మ అనే మహిళ వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో సగం గొలుసు ఆమె చేతిలోనే ఉండిపోయింది. మిగిలిన సగం గొలుసును దొంగ లాక్కెళ్లాడు. దీనిపై ఆమె తోటవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.