thotlavalluru
-
Krishna District: సెల్‌ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య
తోట్లవల్లూరు (కృష్ణా): పెళ్లయిన నాలుగు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. సెల్‌ఫోన్ కారణంగా జరిగిన గొడవ నవ వధువు ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి(19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 13న సెల్‌ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్నగొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. చదవండి: (కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం) కుటుంబసభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా నిండక ముందే మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లుగా తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హైలెవల్ బ్రిడ్జి..అభూత కల్పనే
సాక్షి, గుంటూరు : తోట్లవల్లూరు–పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. రాజధాని నిర్మాణం నుంచి గ్రామస్థాయి పనుల వరకు టీడీపీ సర్కార్ చేస్తున్న గ్రాఫిక్స్ మాయలో పాములలంక హైలెవల్ బ్రిడ్జి ‘అభూత కల్పన’లాగే మిగిలిపోయింది. ఆరు నెలల నుంచి ఇదిగో వంతెన నిర్మాణం, అవిగో పనుల ప్రారంభం అంటూ ఊరిస్తూ..ఉసూరుమనిపించిన టీడీపీ నేతల మాయాజాలంపై సాక్షి ప్రత్యేక కథనం. వివరాలలోకి వెళితే..కృష్ణానది గర్భంలో పాములలంక గ్రామం ఉంది. సుమారు 1500 జనాభా నివసిస్తున్నారు. వీరంతా దళితులు. వ్యవసాయా«న్ని నమ్ముకునే గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. తోట్లవల్లూరుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. మామూలు సమయాలలో తాత్కాలిక రహదారిపై ప్రయాణించే స్థానికులు, వరదల సమయంలో పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు. రూ.30 కోట్లు మంజూరు కృష్ణానదిపై తోట్లవల్లూరు–పాములలంక మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అనేక ఏళ్లుగా కోరుతున్నారు. గత కాంగ్రెస్ పాలనలో వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరై, శంకుస్థాపన జరిగి కూడా పనులు ప్రారంభం కాలేదు. తాజాగా గత ఏడాది కాలంగా వంతెన నిర్మాణానికి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.30 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చెబుతూ వచ్చారు. గత డిసెంబర్లో సీఎం సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం పామర్రు మండలం కొమరవోలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులకు సంభందించిన శిలాఫలకం కూడా ఆవిష్కరిస్తారని అప్పట్లో ప్రకటించారు. జాడలేని పనులు వంతెన నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణ జరపకుండా, వంతెన నిర్మాణ పనులను దక్కించుకున్న వల్లభనేని కన్స్ట్రక్షన్ కంపెనీ గత నాలుగు నెలల కిందట నిర్మాణ ప్రాంతంలో కొంత హడావుడి చేసింది. సిబ్బంది కోసం తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయటంతోపాటు కొంత నిర్మాణ సామాగ్రి, యంత్రాలను కూడా నిర్మాణ ప్రదేశానికి తరలించింది. వంతెన పనులను మాత్రం ఇంతవరకు ప్రారంభించలేదు. నిర్మాణ పనుల కోసం వచ్చిన క్షేత్రస్ధాయి సిబ్బంది కూడా రెండు నెలలుగా కానరావటం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారని ఎమ్మెల్యే కల్పన చెబుతుండగా, మరి వంతెన పనులు జరపకుండా నిర్మాణ సంస్థ ఎందుకు ఉంటోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు చంద్రబాబు శంకుస్థాపన చేశారా లేదా లేక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి టీడీపీ నేతలు ఏమైనా డ్రామా ఆడుతున్నారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వంతెన పేరుతో గత పదేళ్లుగా తమను పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఎందుకు ప్రారంభించరు తోట్లవల్లూరు–పాములలంక మధ్య వంతెన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఎమ్మెల్యే కల్పన గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. పనుల శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించాడని కూడా సభల్లో చెబుతున్నారు. వంతెన పనుల కోసం నిర్మాణ సామగ్రిని కూడా తరలించిన కాంట్రాక్టర్ పనులను ఎందుకు నిలిపివేశాడో అర్థం కావటం లేదు. -సోలే నాగరాజు, పాములలంక -
తోటవల్లూరులో చైన్ స్నాచింగ్
తోటవల్లూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా తోటవల్లూరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. సూరమ్మ అనే మహిళ వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో సగం గొలుసు ఆమె చేతిలోనే ఉండిపోయింది. మిగిలిన సగం గొలుసును దొంగ లాక్కెళ్లాడు. దీనిపై ఆమె తోటవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మరికొద్ది ఘడియల్లో పెళ్లి... అంతలోనే ...
విజయవాడ: మరికొద్ది ఘడియల్లో పెళ్లి .... సంతోషంగా ప్రాణ స్నేహితురాలితోపాటు కుటుంబ సభ్యులతో కలసి కారులో వివాహనికి బయలుదేరింది. ఇంతలో మృత్యువు అధిక వేగం రూపంలో ఆమెతోపాటు స్నేహితురాలిని కబళించింది. అంతా కన్ను తెరచి మూసేలోగా ఈ ఘటన కొన్ని సెకన్లలో జరిగిపోయింది. హృదయాన్ని కలచి వేసిన ఈ సంఘటన బుధవారం కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపల్లి రహదారి పక్కనే ఉన్న కాల్వ వద్ద చోటు చేసుకుంది. వధువు ధరించిన నగలు చెల్లచెదురుగా పడి పోయాయి. ఆమె వేసుకున్న పూల దండ కాల్వలోని చెట్టుపై పడింది. వధువు, ఆమె స్నేహితురాలు, ఏడేళ్ల బాలుడుతోపాటు మరో ఇద్దరు కారులో చల్లపల్లి నుంచి గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో వల్లూరుపల్లి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. దాంతో కారులోని నవ వధువు అల్లంశెట్టి బాలాకుమారి (అమ్ములు)తోపాటు ఆమె స్నేహితురాలు నాగచంద్ర మృతి చెందారు. ఏడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడింది. దాంతో సహాయక చర్యలు నిలిపివేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన విజయవాడకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు క్రేన్ల సహాయంతో కారును కాల్వ నుంచి బయటకు తీశారు. ప్రమాద వార్త తెలియగానే వధువు కుటుంబసభ్యులతోపాటు వరుడి కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. -
పెళ్ళింట.. విషాదం..
-
కాలువలోకి దూసుకెళ్ళిన కారు : నలుగురు మృతి
-
పెళ్లింట విషాదం... వధువు మృతి
విజయవాడ: కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం వద్ద కాల్వలోకి సాంత్రో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మరొకరు గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల్లో వధువుతో పాటు బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం నవ వధువుతోపాటు ఆరుగురు పెళ్లి బృందం సాంత్రో కారులో చల్లపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
భర్తపై ప్రియుడితో కలసి భార్య దాడి
భార్య, ఆమె ప్రియుడు దాడి చేయడంతో భర్తకు గాయాలైన ఘటన మండలంలోని కుమ్మమూరులో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మత్తే శోభనాద్రి ఎన్నికల సందర్భంగా ఓటువేసేందుకు బుధవారం చల్లపల్లి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య సలోమి కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెదికాడు. సమీపంలోని చెరకుతోట లో నుంచి సలోమితోపాటు శంకర్ అనే వ్యక్తి వచ్చి శోభనాద్రిపై దాడిచేశారు. ఈ ఘటనలో అతడికి గాయాల య్యాయి. స్థానికులు అతడిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.