భర్తపై ప్రియుడితో కలసి భార్య దాడి
భార్య, ఆమె ప్రియుడు దాడి చేయడంతో భర్తకు గాయాలైన ఘటన మండలంలోని కుమ్మమూరులో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మత్తే శోభనాద్రి ఎన్నికల సందర్భంగా ఓటువేసేందుకు బుధవారం చల్లపల్లి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య సలోమి కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెదికాడు.
సమీపంలోని చెరకుతోట లో నుంచి సలోమితోపాటు శంకర్ అనే వ్యక్తి వచ్చి శోభనాద్రిపై దాడిచేశారు. ఈ ఘటనలో అతడికి గాయాల య్యాయి. స్థానికులు అతడిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.