Husband attacked
-
భర్త చెంపపై కొట్టడంతో భార్య మృతి
కొవ్వూరు: డ్వాకా రుణ వాయిదా చెల్లింపు విషయంపై తగదా పడి భార్యను భర్త చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు, భార్య లావణ్య సాయి దీపిక(30)తో డ్వాక్రాలో తీసుకున్న రుణం చెల్లింపు విషయంపై వారం నుంచి తగదా పడుతున్నాడు. మంగళవారం ఉదయం వాయిదా డబ్బులు ఇవ్వాలని భార్య మరోసారి అడగడంతో కోపోద్రిక్తుడైన వీరబాబు ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఈ విషయం వీరబాబు అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన ఘటనకు గురించి తెలిపాడు. వీరబాబుకి, లావణ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వీరబాబే లావణ్యను హత్య చేశాడని ఆరోపించారు. పెళ్లి అయినప్పటి నుంచి వీరబాబు తన కుమార్తెను సక్రమంగా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టారని తల్లి బడేటి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. డీఎస్పీ కె.సీహెచ్ రామరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దాని రీల్స్ చూస్తావా?.. భర్తపై అఘాయిత్యం
సాక్షి, ఎన్టీఆర్: నా మొగుడు నాకే సొంతం అనుకున్న ఓ భార్య.. భర్తపై అఘాయిత్యానికి తెగబడింది. బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసి ఆస్పత్రి పాలు జేసింది. నందిగామలోని అయ్యప్ప నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబుకు గతంలో ఓ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయిన ఆనంద్.. ఐదేళ్ల కిందట వరమ్మ అనే రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కాపురం తర్వాత మొదటి భార్య విషయంలో వరమ్మ ఆనంద్‌తో గొడవకు దిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ భార్య రీల్స్ చూస్తున్నాడని అనుమానం పెంచుకున్న ఆమె.. భర్తతో గొడవకు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి(శుక్రవారం) ఆనంద్ బాబు తన మొదటి భార్య Instagram వీడియోలు చూస్తుండటం గమనించిన వరమ్మ.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. బ్లేడ్‌తో భర్త మర్మాంగాన్ని కోసేసిందామె. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడ్ని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి...మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. -
Crime: భర్త లేకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధాల మోజులో పడి.. మానవ సంబంధాలకు పాతరేస్తున్నారు కొందరు. పక్కదారి పట్టిన ఆ భార్యను.. మంచి దారిలోకి తేవాలని ఆ భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ఒకరకంగా అదే అతని ప్రాణం మీదకు తెచ్చింది కూడా!. హయత్‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన.. భార్య చేసిన కుట్ర, బాధితుడి మరణాంతరం కొన్నినెలలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడి.. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని ప్లాన్ చేసింది ఓ మహిళ. అందుకోసం ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తపై దాడి చేయించింది. అదృష్టం బాగుండి ఆ టైంకి బతికాడు. అనుమానం రాకుండా కన్నీళ్లు కారుస్తూ.. లేని ప్రేమను నటించిందామె. మంచానపడ్డ ఆ భర్త కొన్నాళ్లకు కన్నుమూశాడు. దీంతో తన కుట్ర బయటకు రాదని ఆమె భావించింది. అయితే.. సన్నిహితురాలి ద్వారానే ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజితలు ఇద్దరూ ఆర్టీసీ కండక్టర్లు. శంకర్ కూకట్పల్లి, రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తుండేవాళ్లు. అయితే.. రజిత పని చేసే డిపోలోనే రాజ్‌కుమార్ ఆర్టీసీ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. శంకర్ గౌడ్ డ్యూటీ కోసం వెళ్లగానే.. రాజ్‌కుమార్ రజిత కోసం ఇంటికి వచ్చేవాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించి.. ఆమెను మందలించాడు శంకర్. అయితే..అది ఆమెకు కోపం తెప్పించింది. భర్త లేకుంటే.. ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. .. ఈ ఏడాది మార్చి 7వ తేదీ రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్‌పై.. దారి కాచిన రాజ్‌కుమార్, అతని ఇద్దరి స్నేహితులు దాడికి దిగారు. ఆ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడగా.. తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రజిత. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా.. నిందితులెవరు అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దాడిలో తగిలిన దెబ్బలతో శంకర్ మంచానికే పరిమితం అయ్యాడు. అలా మూడు నెలల తర్వాత గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే.. భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని రజిత తన స్నేహితురాలితో పంచుకుంది. ఆమె అతని సోదరుడికి చెప్పడం, ఆ సోదరుడు శంకర్ గౌడ్ సోదరుడికి స్నేహితుడు కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంతా వివరించాడు. దీంతో.. ఐపీసీ సెక్షన్ 307గా కేసు నమోదు చేసుకుని.. రాజ్‌కుమార్, అతని సహకరించిన నీరజ్, ఉమాకాంత్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ భార్య రజిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడిన పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న పాల్ (82)పై అతను సుత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపిత, ఉద్దేశపూర్వక దాడి అని శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రూక్ జెంకిన్స్ వెల్లడించారు. ‘‘నాన్సీ ఎక్కడున్నారంటూ ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజుల వరకు రాదని తెలుసుకుని పాల్ చేతులు కట్టేశాడు. కిందికి వెళ్లాలని ప్రయత్నించిన పాల్‌ను అడ్డుకున్నాడు. చివరికి రెస్ట్‌రూంకు వెళ్లేందుకు అంగీకరించాడు. రెస్ట్ రూం నుంచే పోలీసులకు పాల్ సమాచారమిచ్చారు. తర్వాత డేవిడ్ సుత్తితో పాల్ తలపై మోదాడు. పెనుగులాట జరుగుతుండగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘డెమోక్రాటిక్ పార్టీలోని అబద్ధాలాడే వారికి నాయకురాలు నాన్సీ. నిజం చెబితే వదిలేయాలని, లేదంటూ సుత్తితో మోకాళ్లు విరగ్గొట్టి, వీల్ చైర్లో కాంగ్రెస్‌కు తీసుకెళ్లాలనుకున్నా. అబద్ధాలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో మిగతా సభ్యులకు చూపాలనుకున్నా అని డేవిడ్ విచారణలో తెలిపాడు’అని జెంకిన్స్ వెల్లడించారు. నాన్సీ తర్వాత మరో కాంగ్రెస్ సభ్యుడిపైనా దాడి చేయాలనుకున్నట్లు చెప్పిన డేవిడ్ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదన్నారు. అంతేకాదు, పాల్, డేవిడ్‌లకు మధ్య ఇంతకు ముందు ఎటువంటి పరిచయం కూడా లేదని జెంకిన్స్ చెప్పారు. పెలోసీ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన డేవిడ్ డిపపే(42) వెంట సుత్తితోపాటు చేతులను కట్టేసేందుకు జిప్ టేప్, తాడు వెంట తీసుకెళ్లాడు. కెనడా పౌరుడైన డేవిడ్ 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నాడు.అతడి వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు పేర్కొన్నారు. -
నాన్సీ పెలోసీ భర్తపై పైశాచికంగా దాడి
శాక్రమెంటో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్ పెలోసీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సమయంలో కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌లో ఆమధ్య నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆపై ఆమెపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ప్రస్తుత దాడి సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలుస్తోంది. డెమొక్రట్స్తో కలిసి ఆమె నవంబర్8న జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఘటన సమయంలో ఆమె వాషింగ్టన్లో ఉన్నారు. పోలీసుల అదుపులోనే దుండగుడు ఉండగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆగంతకుడి దాడిలో పాల్ పెలోసీ(82).. ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. అయితే దాడికి ఆ సుత్తిని ఉపయోగించాడా? అనేది తెలియాల్సి ఉంది. పాల్ పెలోసీ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్)కు చెందిన పాల్ పెలోసీ ప్రముఖ వ్యాపారవేత్త. నాన్సీ-పాల్‌కు 1963లో వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు సంతానం. ఈ కుటుంబం మొత్తం ఆస్తిపాస్తుల ద్వారా నాన్సీ పెలోసీ మొత్తం కాంగ్రెస్ సభ్యుల్లో అత్యంత ధనవంతురాలిగా నిలవడం విశేషం. బాల్టిమోర్‌కు చెందిన నాన్సీ పెలోసీ.. 1987 నుంచి శాన్ఫ్రాన్సిస్కో తరపున కాంగ్రెస్‌కు ఎన్నికవుతూ(మధ్య మధ్యలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ నుంచి కూడా) వస్తున్నారు. అమెరికాలో పవర్ఫుల్ నేతల్లో పెలోసీ ఒకరు. ప్రతినిధుల సభకు స్పీకర్‌గా 2021లో ఆమె నాలుగో సారి ఎన్నికయ్యారు. పాతికేళ్లలలో తైవాన్ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఈమెనే కావడం గమనార్హం. స్పీకర్ నాన్సీ పావెల్ భర్తపై దాడి ఘటనను యూఎస్ఐ, యూఎస్ కాపిటోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్యపై భర్త దాడి
సాక్షి, హోసూరు(కర్ణాటక): దొంగచాటున ప్రియున్ని కలిసేందుకెళ్లిన భార్యపై దాడి చేసిన భర్తను సిప్కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం లక్కిపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భర్యతో కలిసి హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో నివాసముంటున్నారు. ఆ మహిళకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మంగళవారం ఉదయం ప్రియున్ని వెతుక్కొంటూ వెళ్లిన భార్యను భర్త వెంబడించి ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. చదవండి: శివసేనపై హోంమంత్రి ఆగ్రహం -
అత్తారింటికి వెళ్లి.. భార్య, బామ్మర్దిపై కత్తితో దాడి
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్య, బామ్మర్దిలపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన వడ్లపూడి రైల్వే క్వార్టర్స్ చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. గాజువాకలోని సుందరయ్య కాలనీకి చెందిన భాస్కర్ (33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి రైల్వే కార్టర్స్‌కు చెందిన భారతి (31)తో గతంలో వివాహం జరిగింది. భార్యతో మనస్పర్థల వల్ల రెండేళ్ల నుంచి గొడవలు పడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఒక కేసు కోర్టులో నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆదివారం రాత్రి భాస్కర్ రైల్వే క్వార్టర్స్‌లోని అత్తారింటికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన బామ్మర్ది గోపాలకృష్ణ పొట్టలో కత్తితో పొడిచాడు. ఈలోగా అక్కడికి వచ్చిన భార్య భారతి మెడపై, కడుపులో, ఎడమ చేతిపై దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. స్థానికులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం మొదట గాజువాక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతను గాజువాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో స్టీల్‌ప్లాంట్ పోలీసులకు సమాచారం అందించారు. స్టీల్‌ప్లాంట్ సీఐ సత్యనారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
భర్తపై ప్రియుడితో కలసి భార్య దాడి
భార్య, ఆమె ప్రియుడు దాడి చేయడంతో భర్తకు గాయాలైన ఘటన మండలంలోని కుమ్మమూరులో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మత్తే శోభనాద్రి ఎన్నికల సందర్భంగా ఓటువేసేందుకు బుధవారం చల్లపల్లి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య సలోమి కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెదికాడు. సమీపంలోని చెరకుతోట లో నుంచి సలోమితోపాటు శంకర్ అనే వ్యక్తి వచ్చి శోభనాద్రిపై దాడిచేశారు. ఈ ఘటనలో అతడికి గాయాల య్యాయి. స్థానికులు అతడిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.