రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ | chandra babu discusses capital issue with union ministers | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ

Published Fri, Jan 16 2015 4:43 PM | Last Updated on Sat, Aug 18 2018 5:50 PM

రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ - Sakshi

రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ఆర్థికసాయం చేసే అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  గోదావరి పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించికూడా ఆయనకు వివరించానని తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్యాకేజి, ప్రత్యేక హోదా తదితర అంశాలపై కూడా వివిధ శాఖలకు చెందిన మంత్రులతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. రెండు రోజుల్లో తాను ప్రధానమంత్రి సహా మొత్తం 11 మంది మంత్రులను కలిసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement