cm delhi tour
-
నేడు అమిత్‌షాతో ముఖ్యమంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరు కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎన్.రెడ్డప్పలు సీఎంకు స్వాగతం పలికారు. ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఢిల్లీకి వచ్చారు. -
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం(నేడు) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారు. గురువారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్‌పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించింది. -
రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ఆర్థికసాయం చేసే అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించికూడా ఆయనకు వివరించానని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్యాకేజి, ప్రత్యేక హోదా తదితర అంశాలపై కూడా వివిధ శాఖలకు చెందిన మంత్రులతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. రెండు రోజుల్లో తాను ప్రధానమంత్రి సహా మొత్తం 11 మంది మంత్రులను కలిసినట్లు తెలిపారు.