సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరు కానున్నారు.
అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎన్.రెడ్డప్పలు సీఎంకు స్వాగతం పలికారు. ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఢిల్లీకి వచ్చారు.
నేడు అమిత్‌షాతో ముఖ్యమంత్రి భేటీ
Published Fri, Oct 6 2023 4:29 AM | Last Updated on Fri, Oct 6 2023 11:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment