తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భూమన మాటిచ్చారు. రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 13 జిల్లాల ప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, తదదితరులు పాల్గొన్నారు.