టీడీపీ నేతలకు పరాభవం
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. ఆదివారం చంద్రబాబు నాయుడు వెంకటాచలం వచ్చారు. ఆయన హాజరైనవి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సొంత కార్యక్రమాలు కావడం, సెక్యూరిటీతో పాటు బీజేపీ నేతలు పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు అవమానకర రీతిలో పార్టీ అధినేతకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. కనీసం పలకరించే వారు కూడా కరువవడంతో చేసేదేమీ లేక ఉసురూమంటూ బా బు వెళ్లే వరకు పడిగాపులు కాస్తూ కనిపిం చారు.
ఇదంత వెంకయ్య మహిమ అంటూ కొందరు, అనుభవించాల్సిందేనంటూ ఇం కొందరు నిట్టూర్పులు విడిచారు. ఇప్పటికే మంత్రి నారాయణ ఎఫెక్ట్‌తో జిల్లాలో టీడీ పీ నేతలు వర్గాలుగా విడిపోయారు. వీరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న నేపథ్యం లోనే తాజా పర్యటనలో నారాయణను తప్ప మిగిలిన వారిని సీఎం పట్టించుకోకపోవడం నేతలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అవమానకర పరిస్థితులు ఎ దురవడంతో వారు లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ పరిణామా లు ఎంత వరకు పోతాయో అర్ధం కావడం లేదని కొందరు టీడీపీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.
అడుగడుగునా అవమానాలే
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కు టుంబసభ్యులకు చెందిన అక్షర విద్యాలయం, స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన పలు కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పార్టీ అధినేత వస్తుండడంతో టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదా ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జడ్.శివప్రసా ద్, మహిళా నేతలు తాళ్లపాక అనురాధ, అంచెల వాణి తదితర నేతలు మొదట అ క్షర విద్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ వీరిని చంద్రబాబు వద్దకు వెళ్లనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
అయితే బీజేపీ నేతలకు మాత్రం ఎవరూ అడ్డం చెప్పలేదు. అనంతరం అక్షర విద్యాలయం విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నించినా సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు. తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నారేంటని అ క్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బీజేపీ నేతలను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఇ క్కడ సీఎంతో కలిసే కార్యక్రమం ఏమీ లే దని సమాధానం రావడంతో చంద్రబాబు ను దూరం నుంచే చూస్తూ గడిపారు. త ర్వాత జరిగిన చెట్టు-నీరు పోస్టర్ల ఆవిష్కరణ, మున్సిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌కు సైతం టీడీపీ నేతలకు అనుమతి లభించలేదు. ఈ అన్ని కార్యక్రమాలకు కేవ లం మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌నే అనుమతించారు. పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుండగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరె డ్డి శ్రీనివాసులురెడ్డి సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి లోనికి వచ్చినా సీఎం వెనుకభాగంలో నిలుచోవాల్సి వచ్చింది.
నామమాత్రపు పలకరింపులతో సరి
సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలను నా మమాత్రపు పలకరింపులతో సరిపెట్టారు. జిల్లా నేతలతో కొద్ది సేపు బాబు సమావేశమవుతారని మొదట ప్రచారం జరిగినా తర్వాత అది రద్దయింది. దీంతో జిల్లా నేతలు సీఎంకు దూరంగానే ఉండిపోయారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన సభలోనూ వెంకయ్యనాయుడితో కలిసే ఎ క్కువ సమయం వేదికపైనే ఉండడంతో సీ ఎంను నేతలు కలవలేకపోయారు. సమావేశం అనంతరం కలవాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలించలేదు. సీఎంను కలి సేందుకు జిల్లా టీడీపీ నేతలకు అవకాశం లేదని, కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి న వీఐపీలను మాత్రమే చంద్రబాబు కలుస్తారని సాక్షాత్తు కేంద్ర మంత్రి వెంకయ్య మైక్‌లో పదేపదే ప్రకటించారు. మొత్తంగా మంత్రి నారాయణ, ఆయన కొందరు అనుచరులు మినహా మిగిలిన నేతలు చంద్రబాబుకు దూరంగా ఉండిపోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది.
భోజనాల వద్దా చుక్కెదురు..
చివరకు భోజనాల వద్ద కూడా టీడీపీ నేతలకు చుక్కెదురైంది. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇది గమనించిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వద్దకు చేరారు. అనంతరం సోమిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు తాళ్లపాక రమేష్‌రెడ్డి, అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు అక్కడ నుంచి వెళ్లిపోయి సమీపంలోని ఓ హోటల్‌లో భోజనం ముగించారు.