హైదరాబాద్:విశాఖలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. చెట్లకు నిప్పటించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు మాట్లాడారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ కు చంద్రబాబు సూచించారు.