
'బాబు యాత్రపై ఆయనకే స్పష్టత లేదు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రపై ఆయనకే స్పష్టత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బాబు వైఖరితో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. అధికార దాహం తప్ప.... ప్రజల సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సూర్ఫితోనే సమైక్యవాదం వినిపిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర’ అంటూ ఆదివారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.