గత ప్రభుత్వాలే టార్గెట్! | chandrababu focus on previews govts | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వాలే టార్గెట్!

Published Wed, Jul 2 2014 12:58 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

గత ప్రభుత్వాలే టార్గెట్! - Sakshi

గత ప్రభుత్వాలే టార్గెట్!

ఆయూ ప్రభుత్వాలవిధానాలను తప్పుబట్టడమే లక్ష్యం
వివిధ రంగాలపై శ్వేతపత్రాల
విడుదలకు చంద్రబాబు సర్కారు సిద్ధం

 
హైదరాబాద్: గత ప్రభుత్వాలను తప్పుపట్టడమే లక్ష్యంగా ఆరు రంగాల్లో శ్వేతపత్రాల విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగం సిద్ధం చేశారు. తద్వారా తానిచ్చిన హామీలు, ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే వ్యూహం పన్నారు. బుధవారం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. శ్వేతప్రతాలపై మంత్రులు, అధికారులతో మంగళవారం ఆయన సమీక్షలు నిర్వహించారు. శ్వేతపత్రాలంటే ఆయూ రంగాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను వివరించడమే. అరుుతే చంద్రబాబు సూచనల మేరకు అధికారులు ఆయన  చెప్పినట్టుగా శ్వేతపత్రాలను రూపొందిం చారు. విచిత్రంగా ఆయా రంగాల్లో.. గతంలో పనిచేసిన అధికారు లే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో గతంలో వారు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులను వారే తప్పుపడుతూ శ్వేతపత్రాలను తయారు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ద్వారా భారీగా విద్యుత్ ఉత్పాదన చేయడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. పైగా జెన్‌కోను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరించాలనే ఎత్తుగడ కూడా వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జెన్‌కోను పటిష్టం చేయడానికి పూనుకున్నారు. జెన్‌కో ద్వారానే వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి చర్యలను చేపట్టారు. వైఎస్ నిర్ణయాల కారణంగా ఇప్పటికే అదనంగా 1750 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో రెండు నెలల్లో 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది మార్చిలో మరో 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రైతుల ఉచిత విద్యుత్‌కు ఏ మాత్రం వెలితి ఏర్పడకుండా వైఎస్ భారీ ఎత్తున కరెంట్ కొనుగోలు చేశారు. రైతుల కోసం, సామాన్య ప్రజల కోసం విద్యుత్ సబ్సిడీ కింద తన హయాంలో ఏకంగా రూ.30 వేల కోట్లు వెచ్చించారు. ఈ వాస్తవాలను మరుగుపరచడంతో పాటు గత ప్రభుత్వాలపై అభాండాలు వేస్తూ, విధానాలను తప్పుబడుతూ శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కొత్త సర్కారు సిద్ధమవుతోంది. రాష్ర్టంలో ఎర్రచందనం తాజా స్థితిపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement